Casting Couch: నెలలో నాతో ఐదారు సార్లు సెక్స్ చేయాలి, నటికి ఇండస్ట్రీలోని పెద్ద మనిషి కండీషన్: ఆకాంక్ష కామెంట్స్

Actress Akanksha Choudhary On Casting Couch: తను ఇచ్చిన డబ్బులకు బదులు నెలకు ఐదు, ఆరు సార్లు తనతో సెక్స్ చేయాలని ఇండస్ట్రీలోని ఓ పెద్ద మనిషి కండీషన్ పెట్టినట్లు నటి ఆకాంక్ష చౌదరి తాజాగా చెప్పుకొచ్చింది. అందాల పోటీల సమయంలో ఇలాంటి సంఘటన ఎదురైనట్లు పేర్కొంది. దీంతో ఆకాంక్ష కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Aug 2, 2026, 15:25:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Actress Akanksha Choudhary On Casting Couch: పాపులర్ రియాలిటీ ఓటీటీ షో 'లాక్ అప్ సీజన్ 2' ముగింపు దశకు చేరుకుంది. చివరి వారంలోకి అడుగుపెట్టిన ఈ ఓటీటీ షోలో అనూహ్య మలుపులు, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా జరిగిన డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా ప్రముఖ మోడల్, నటి ఆకాంక్ష చౌదరి షో నుంచి బయటకు వచ్చే ముందు మోడలింగ్ ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ దారుణాలను బయటపెట్టి కలకలం రేపింది.

నెలలో నాతో ఐదారు సార్లు సెక్స్ చేయాలి, నటికి ఇండస్ట్రీలోని పెద్ద మనిషి కండీషన్: ఆకాంక్ష కామెంట్స్
నెలలో నాతో ఐదారు సార్లు సెక్స్ చేయాలి, నటికి ఇండస్ట్రీలోని పెద్ద మనిషి కండీషన్: ఆకాంక్ష కామెంట్స్

రూ.2 లక్షల కోసం వెళితే.. దారుణమైన షరతు!

అందాల పోటీల్లో (Pageants) పాల్గొనేందుకు రూ. 1-2 లక్షల ఆర్థిక సాయం కోసం ఇండస్ట్రీలో బాగా పేరున్న ఒక పెద్ద మనిషిని కలిసినట్లు ఆకాంక్ష చౌదరి తెలిపింది. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో, తనకు ఉన్న ఇంజినీరింగ్ విద్యార్హతలతో అతని వద్ద పనిచేసి ఆ అప్పు తీరుస్తానని చెప్పానంది.

గతంలో పోటీలకు జడ్జిగా వచ్చిన పరిచయంతోనే అతని వద్దకు వెళ్లానని, అతను ఇలా చాలా మందికి సహాయం చేశాడని తెలిసి వెళ్లానని, అయితే అతను దానికి ఒప్పుకున్నట్లే నటించి తన నివాసానికి పిలిపించుకున్నాడని ఆకాంక్ష చౌదరి తెలిపింది. గతంలో తన మెంటార్లతో కలిసి అతని ఇంటికి వెళ్లిన అనుభవంతోనే ధైర్యంగా అక్కడకు వెళ్లానని తెలిపింది.

గట్టిగా హగ్ చేసుకున్నాడు

"అయితే, అక్కడ అతను నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. కేవలం హగ్ మాత్రమే చేసుకోలేదు. నన్ను పట్టుకున్నాడు. ఎంతకీ కూడా చేతులు తీయట్లేదు. అతను చాలా పెద్దాయన. అతన్ని ఒక్కసారిగా తోసేసాను. దాంతో అతను కూర్చుని నాతో ఇలా చెప్పాడు" అని ఆకాంక్ష పేర్కొంది.

"సంవత్సరం క్రితం వచ్చినప్పుడు చాలా అమాయకంగా ఉన్నావ్. ఇప్పుడు పెరిగి పెద్దదానివయ్యావ్. అప్పుడే నాతో ఉండటానికి ఒప్పుకుని ఉంటే ఈపాటికే ప్రాజెక్టులలో నటించేదానివి. నేను ఇచ్చే డబ్బులకు ప్రతిఫలంగా నెలలో 5-6 సార్లు నాతో సెక్స్ చేయాలి" అని ఆ వ్యక్తి షరతు విధించినట్లు ఆకాంక్ష బయటపెట్టింది.

తిరస్కరించి స్వశక్తితో నిలబడిన ఆకాంక్ష

ఆ వ్యక్తి కోరికను తీవ్రంగా వ్యతిరేకించి అక్కడ నుంచి వచ్చేసినట్లు ఆకాంక్ష చెప్పింది. ఇండస్ట్రీలో వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలకు ఇలాంటి కమిట్‌మెంట్లు ఇవ్వకుండా అవకాశాలు రావని అతను బెదిరించినప్పటికీ, తను వెనకడుగు వేయలేదని ఆకాంక్ష పేర్కొంది.

ఏ అడ్డదారులు తొక్కకుండా కేవలం తన కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగానని, ఆరు నెలల్లోనే ఒక పెద్ద షో సాధించి, ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో వేదికపై నిలబడ్డానని గర్వంగా ప్రకటించింది ఆకాంక్ష. అయితే, ఆకాంక్ష చెప్పిన వ్యక్తి చాలా పలుకుబడి ఉన్న మనిషి అని, అందుకే అతని పేరు చెప్పట్లేదని చెప్పుకొచ్చింది.

ధైర్యాన్ని ప్రశంసించిన ఫరా ఖాన్, రితీష్ దేశ్‌ముఖ్

ఆకాంక్ష ధైర్యాన్ని చూసి షో వ్యాఖ్యాతలు ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ భావోద్వేగానికి గురయ్యారు. "ఆ వ్యక్తి ఎవరైనా సరే ఈ షో చూస్తుంటే అతనికి ఒక విషయం అర్థం కావాలి. నీచమైన ఆఫర్లను తిరస్కరించి కూడా కేవలం సొంత కష్టంతో ఇంత పెద్ద వేదికపైకి రాగలరని నువ్వు నిరూపించావ్. నీ ధైర్యాన్ని చూసి మేమంతా గర్విస్తున్నాం" అని ఫరా ఖాన్, రితేష్ కొనియాడారు.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ షో

కాగా, 'లాక్ అప్ 2' షో ప్రస్తుతం గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది. శ్రేయా కల్రా, యోగేష్ రావత్, రామ్ కపూర్, శిల్పా షిండే, హర్షద్ చోప్డా, శివాంగి జోషి, వరుణ్ యాదవ్ ఫైనలిస్టులుగా రేసులో నిలిచారు. వారం చివర్లో వీరిలో ఒకరు రూ.1 కోటి నగదు బహుమతితో పాటు విజేత ట్రోఫీని గెలుచుకోనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో లాక్ అప్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More