...
...
Next Story

Ori Nayano Movie: వినూత్నమైన ట్యాగ్‌లైన్‌తో ఓరి నాయనో- ఆ ఇద్దరితో ఘనంగా పూజ- 25 రోజుల్లోనే షూటింగ్- ఫిబ్రవరిలో రిలీజ్!

Ori Nayano Movie Begin With Pooja Ceremony: వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్. సాయి అభిషేక్ నిర్మిస్తున్న ఓరి నాయనో సినిమా హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. మణి తేజ గొంది దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను 25 రోజుల్లోనే పూర్తి చేసి ఫిబ్రవరిలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Published on: Oct 31, 2026, 07:07:56 IST
Advertisement

Ori Nayano Movie Begin With Pooja Ceremony: హైదరాబాద్ సినీ వర్గాల్లో మరో ఆసక్తికరమైన చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్. సాయి అభిషేక్ నిర్మిస్తున్న చిత్రం ‘ఓరి నాయనో’. తాజాగా హైదరాబాద్‌లో ఓరి నాయనో సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

వినూత్నమైన ట్యాగ్‌లైన్‌తో

వినూత్నమైన ట్యాగ్‌లైన్‌తో ఓరి నాయనో- ఆ ఇద్దరితో ఘనంగా పూజ- 25 రోజుల్లోనే షూటింగ్- ఫిబ్రవరిలో రిలీజ్!
వినూత్నమైన ట్యాగ్‌లైన్‌తో ఓరి నాయనో- ఆ ఇద్దరితో ఘనంగా పూజ- 25 రోజుల్లోనే షూటింగ్- ఫిబ్రవరిలో రిలీజ్!

‘Every life will have Ori.. Nayano! Moment’ అనే వినూత్న ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి మణి తేజ గొంది దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, డా. ప్రవీణ్ రెడ్డి, సుధీర్ అంకుశం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఓరి నాయనో ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా నిర్వహించిన ముహూర్తపు షాట్‌కు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి తొలి క్లాప్ కొట్టారు. ‘పొలిమేర’ ఫ్రాంచైజీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న ప్రముఖ దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించి మూవీ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

వేగంగా షూటింగ్.. ఫిబ్రవరిలో రిలీజ్

చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న సంచలనాలు టాలీవుడ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ సందర్భంగా నిర్మాత వంశీ నందిపాటి పేర్కొన్నారు. ‘ఓరి నాయనో’ చిత్ర బృందానికి తన నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.

సినిమా నిర్మాణ ప్రణాళికల గురించి నిర్మాత ఎస్. సాయి అభిషేక్ మాట్లాడుతూ.. నాణ్యత విషయంలో ఎక్కడా తగ్గకుండా అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. కేవలం 25 రోజుల్లోనే సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ఓరి నాయనో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

వినోదం, భావోద్వేగాల మేళవింపు

"ప్రతి గొప్ప ప్రయాణం నమ్మకంతోనే మొదలవుతుంది. నా హృదయానికి ఎంతో దగ్గరైన కథ ఇది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, గుర్తుండిపోయే పాత్రలు, చక్కటి భావోద్వేగాలు ఈ సినిమాలో ఉంటాయి" అని దర్శకుడు మణి తేజ గొంది ధీమా వ్యక్తం చేశారు. తన మిత్రుడు సాయి అభిషేక్ చేపట్టిన ఈ ప్రయత్నం పెద్ద విజయం సాధించాలని దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఆకాంక్షించారు.

నటీనటులు.. టాప్ టెక్నీషియన్లు

ఇక ఓరి నాయనో చిత్రంలో శ్రీనివాస్ గవి రెడ్డి, విష్ణు ఓయి, మహేష్ దత్తా, శ్రీకాంత్ రెడ్డి, మైఖేల్ బెన్నీ, గాయత్రి చాగంటి, ఆర్నా ముల్లర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు సీనియర్ నటులు మురళీధర్ గౌడ్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సాంకేతిక విభాగంలో అనుభవజ్ఞులైన నిపుణులు పనిచేస్తున్నారు. సుభాష్ నాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఆర్ట్ డైరెక్టర్‌గా అర్జున్ సూరిశెట్టి, పీఆర్ఓగా అశోక్ దయ్యాల వ్యవహరిస్తున్నారు. వినోదభరితమైన కథాంశంతో రూపొందుతున్న ఓరి నాయనో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks