Samantha: హీరోయిన్ సమంత రూత్ ప్రభుకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఇక రెండో పెళ్లి వార్తలతో ఆమె పేరు మరింత మార్మోగింది. కానీ ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ కు షాక్ తగిలింది. ఇండియాలో నంబర్ వన్ హీరోయిన్ ర్యాంకును ఈ భామ కోల్పోయింది.
టాప్ హీరోయిన్లు

భారతీయ సినీ రంగంలో ఏ నటీనటులకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలుసుకోవడానికి ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఒర్మాక్స్ మీడియా ప్రతి నెలా ప్రత్యేక సర్వేలను నిర్వహిస్తుంది. థియేటర్లలో వినోదాన్ని పంచే వెండితెర తారలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై సందడి చేసే నటీమణుల ప్రజాదరణ, వారిపై ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ ఆధారంగా ఈ నివేదికలను సిద్ధం చేస్తారు.
సమంతకు షాక్
తాజాగా ఒర్మాక్స్ 'స్టార్స్ ఇండియా లవ్స్' తాజా ర్యాంకింగ్స్ లిస్ట్ ను ప్రకటించింది. ఇందులో సమంతకు షాక్ తగిలింది. ఈ రీసెంట్ సర్వేలో సమంతను వెనక్కి నెట్టి బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇండియాలోనే నంబర్ వన్ హీరోయిన్ గా అలియా నిలిచింది.
ఈ తాజా సర్వేలో బాలీవుడ్ స్టార్ నటి అలియా భట్ ఇండియాలోనే మోస్ట్ పాపులర్ ఫీమేల్ ఫిల్మ్ స్టార్‌గా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తన విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న అలియా, ఈ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది.
రెండో ప్లేస్ కు
ఇక టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఈ జాబితాలో రెండో స్థానానికి పడిపోయింది. గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ టాప్ నటి దీపికా పదుకొణె ఈ సర్వేలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ లిస్ట్ లో రష్మిక మందన్న, సాయి పల్లవి, నయనతార, శ్రీలీల లాంటి హీరోయిన్లు కూడా ఉన్నారు.
{{/usCountry}}ఇక టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఈ జాబితాలో రెండో స్థానానికి పడిపోయింది. గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ టాప్ నటి దీపికా పదుకొణె ఈ సర్వేలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ లిస్ట్ లో రష్మిక మందన్న, సాయి పల్లవి, నయనతార, శ్రీలీల లాంటి హీరోయిన్లు కూడా ఉన్నారు.
{{/usCountry}}ప్రతి నెలా సేకరించే డేటా ఆధారంగా ఒర్మాక్స్ మీడియా ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటిస్తుంది. దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు, అలాగే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను వీక్షించే సినీ ప్రియుల సెంటిమెంట్, వారి స్పందనలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు.
టాప్ 10 హీరోయిన్ల లిస్ట్
- అలియా భట్
2. సమంత రూత్ ప్రభు
3. దీపికా పదుకొణె
4. రష్మిక మందన్న
5. కాజల్ అగర్వాల్
6. సాయి పల్లవి
7. నయనతార
8. శ్రీలీల
9. కృతి సనన్
10. త్రిష కృష్ణన్
ఈ జాబితాను పరిశీలిస్తే ఉత్తరాది నటీమణులతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన కథానాయికల హవా కూడా దేశవ్యాప్తంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.