Malayalam OTT: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'ఒరు అన్వేషణథింతె తుడక్కం' (Oru Anveshanathinte Thudakkam). ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. సస్పెన్స్, క్రైమ్ కథలను ఇష్టపడే సినీ ప్రియులను ఈ చిత్రం ఆకట్టుకోనుంది.
ఒరు అన్వేషణథింతె తుడక్కం ఓటీటీ

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ లో ఈ ఒరు అన్వేషణథింతె తుడక్కం సినిమా అక్టోబర్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో చూడలేకపోయిన వారు అలాగే మంచి మలయాళ థ్రిల్లర్లను ఆదరించే ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జర్నలిస్ట్ మిస్సింగ్
ఈ ఒరు అన్వేషణథింతె తుడక్కం సినిమా కథ మొత్తం ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మిస్సింగ్ చుట్టూ తిరుగుతుంది. జీవన్ థామస్ అనే జర్నలిస్ట్ హఠాత్తుగా కనిపించకుండా పోవడంతో మీడియా, పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతుంది. ఈ కేసును ఛేదించే బాధ్యతను క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక పోలీస్ బృందం తీసుకుంటుంది.
సంచలన నిజాలు
జర్నలిస్ట్ మిస్సింగ్ కేసు దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ అనూహ్యమైన మలుపులు, సంచలన నిజాలు వెలుగులోకి వస్తాయి. అసలు జీవన్ కిడ్నాప్ అయ్యాడా లేక హత్యకు గురయ్యాడా అనే ప్రశ్నలతో కథ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. రాజకీయ నేపథ్యం, కుటుంబ రహస్యాలు, ద్రోహాల కలయికతో సినిమాలోని మిస్టరీ మరింత ముదురుతుంది.
షాకిచ్చే క్లైమాక్స్
దర్శకుడు ఎం.ఎ. నిషాద్ ఈ సినిమాలో వాస్తవ కేసుల ఆధారంగా పోలీసు పరిశోధన తీరును స్క్రీన్‌పై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. జీవన్ అదృశ్యం వెనుక ఉన్న అసలు కారణం ఎవరు అనే క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని రీతిలో ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇస్తుంది. ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా దర్శకుడు కథను నడిపించారు. దీంతో ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.
మస్ట్ వాచ్
{{/usCountry}}దర్శకుడు ఎం.ఎ. నిషాద్ ఈ సినిమాలో వాస్తవ కేసుల ఆధారంగా పోలీసు పరిశోధన తీరును స్క్రీన్‌పై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. జీవన్ అదృశ్యం వెనుక ఉన్న అసలు కారణం ఎవరు అనే క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని రీతిలో ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇస్తుంది. ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా దర్శకుడు కథను నడిపించారు. దీంతో ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.
మస్ట్ వాచ్
{{/usCountry}}ఈ ఒరు అన్వేషణథింతె తుడక్కం చిత్రంలో షైన్ టామ్ చాకో, వాణీ విశ్వనాథ్, సముద్రఖని, ముఖేష్, స్వాసిక విజయ్, శివదా, దుర్గా కృష్ణ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు ఎం.ఎ. నిషాద్ స్వయంగా ఇన్వెస్టిగేషన్ అధికారిగా కీలక పాత్రలో మెప్పించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. జయచంద్రన్ సంగీతాన్ని అందించగా, బెంజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కేవీ అబ్దుల్ నాజర్ దీనిని నిర్మించారు. మలయాళ థ్రిల్లర్లను ఇష్టపడే ఓటీటీ ఆడియన్స్ కు ఈ మూవీ మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు.