...
...
Next Story

Oscars 2026: ఆస్కార్ గెలుచుకున్న సినిమా ఇదే.. విజేతల ఫుల్ లిస్ట్.. ఆ యాక్షన్ థ్రిల్లర్ కు ఆరు అవార్డులు.. ఓ లుక్కేయండి

Oscars 2026: ఆస్కార్స్ 2026 ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ 98వ అకాడమీ అవార్డుల్లో ఓ థ్రిల్లర్ డామినెన్స్ కొనసాగింది. ఈ మూవీ ఏకంగా ఆరు అవార్డులను ఖాతాలో వేసుకుంది. ఆస్కార్స్ 2026 విన్నర్స్ ఫుల్ లిస్ట్ పై ఓ లుక్కేయండి.

Published on: Mar 16, 2026, 08:31:13 IST
Advertisement

ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది. ఆస్కార్స్ 2026 విన్నర్స్ ఎవరో తేలిపోయింది. భారత కాలమానం ప్రకారం సోమవారం (మార్చి 16) ఉదయం 98వ అకాడమీ అవార్డుల కార్యక్రమం జరిగింది. మొత్తం 24 విభాగాల్లో అవార్డులు అందజేశారు. యాక్షన్ థ్రిల్లర్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అదర్ ఏకంగా ఆరు విభాగాల్లో విజేతగా నిలిచింది.

ఆస్కార్స్ 2026

ఆస్కార్స్ 2026 ఈవెంట్లో ప్రియాంక చోప్రా, జేవియర్
ఆస్కార్స్ 2026 ఈవెంట్లో ప్రియాంక చోప్రా, జేవియర్

ప్రపంచ సినిమాకు పట్టం కంటే ఆస్కార్స్ ఈవెంట్ ఈ సారి కూడా గ్రాండ్ గా జరిటింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ 98 వ అకాడమీ అవార్డులకు ఆతిథ్యమిచ్చింది. ఆస్కార్స్ 2026లో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్, ఉత్తమ నటి తదితర విభాగాల్లో విజేతలను ప్రకటించారు. విన్నర్స్ సగర్వంగా ఆస్కార్ ను ముద్దాడారు.

ఆరు అవార్డులు

యాక్షన్ థ్రిల్లర్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీ ఆస్కార్స్ 2026లో ఏకంగా ఆరు విభాగాల్లో విన్నర్ గా నిలిచింది. ఉత్తమ సహాయ నటుడు, కాస్టింగ్, డైరెక్టింగ్, ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ ఫిక్చర్, రైటింగ్ (అడాప్టడ్ స్క్రీన్ ప్లే) విభాగాల్లో ఈ మూవీ అవార్డులు దక్కించుకుంది. ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఆస్కార్ ను ఖాతాలో వేసుకుంది.

ఫుల్ లిస్ట్

ఉత్తమ నటుడు - మైఖేల్ బి జోర్డాన్ (సిన్నర్స్)

ఉత్తమ సహాయ నటుడు - సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)

ఉత్తమ నటి - జెస్సీ బక్లీ (హామ్నెట్)

ఉత్తమ డైరెక్టర్- పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)

ఉత్తమ చిత్రం - వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ - కే పాప్ డీమాన్ హంటర్స్

ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ - ది గర్ల్ వూ క్రైడ్ పియర్ల్స్

కాస్టింగ్ - వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

సినిమాటోగ్రఫీ - సిన్నర్స్ (ఆటమ్ డురాల్డ్)

కాస్ట్యూమ్ డిజైన్ - ఫ్రాంకెన్ స్టీన్ (కేట్ హాలీ)

డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ - మిస్టర్ నోబడీ అగైన్ట్స్ పుతిన్

డాక్యుమెంటర్ షార్ట్ ఫిల్మ్ - ఆల్ ది ఎంప్టీ రూమ్స్

ఫిల్మ్ ఎడిటింగ్ - వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (ఆండీ జార్గన్ సెన్)

ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ - సెంటిమెంటల్ వాల్యూ (నార్వే)

లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ - ది సింగర్స్

మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ - ఫ్రాంకెన్ స్టీన్ (మైక్ హిల్, జోర్డాన్ సామ్యూల్స్, క్లియోనా ఫ్యూరే)

మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్) - లుడ్వింగ్ గోరాన్సన్ (సిన్నర్స్)

మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్) - గోల్డెన్ (కేపాప్ డీమాన్ హంటర్స్)

ప్రొడక్షన్ డిజైన్ - ఫ్రాంకెన్ స్టీన్

సౌండ్ - ఎఫ్ 1

విజువల్ ఎపెక్ట్స్ - అవతార్ ఫైర్ అండ్ యాష్

రైటింగ్ (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే) - వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (పాల్ థామస్ అండర్సన్)

రైటింగ్ (ఒరిజినల్ స్క్రీన్ ప్లే)- సిన్నర్స్ (ర్యాన్ కూగ్లర్)

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe