...
...
Next Story

Oscars: ఆస్కార్ ఓటింగ్ ప్యానెల్లో మన ఆర్ఆర్ఆర్ ఎడిటర్.. మొత్తం ఆరుగురు ఇండియన్స్‌కు చోటు.. ఎవరెవరంటే?

Oscars: ఆస్కార్స్ ఓటింగ్ ప్యానెల్లో ఆర్ఆర్ఆర్ మూవీ ఎడిటరల్ ఎ. శ్రీకర ప్రసాద్ కు చోటు దక్కింది. మొత్తంగా ఆరుగురు ఇండియన్స్ కు ఈసారి అవకాశం రాగా.. అందులో మన తెలుగు ఎడిటర్ అయిన శ్రీకర ప్రసాద్ కూడా ఉన్నారు.

Published on: Jun 25, 2026 10:44 AM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Oscars: ప్రపంచ చలనచిత్ర రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్స్ (Oscars) ఓటింగ్ కమిటీలో భారతీయులకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కొత్త సభ్యుల లిస్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

Oscars: ఆస్కార్ ఓటింగ్ ప్యానెల్లో మన ఆర్ఆర్ఆర్ ఎడిటర్.. మొత్తం ఆరుగురు ఇండియన్స్‌కు చోటు.. ఎవరెవరంటే?
Oscars: ఆస్కార్ ఓటింగ్ ప్యానెల్లో మన ఆర్ఆర్ఆర్ ఎడిటర్.. మొత్తం ఆరుగురు ఇండియన్స్‌కు చోటు.. ఎవరెవరంటే?

ఈ ప్రతిష్టాత్మక అకాడమీ ఓటింగ్ బాడీలో జాయిన్ అవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 529 మంది సినీ ప్రముఖులకు ఇన్విటేషన్స్ పంపగా.. అందులో ఇండియా నుంచి ఆరుగురు స్టార్ టెక్నీషియన్లు చోటు సంపాదించుకుని గ్లోబల్ లెవెల్లో మన సినిమా పవర్‌ను నిరూపించారు. ఈ లిస్ట్‌లో ప్రముఖ బాలీవుడ్ మేకర్ కమ్ మ్యూజిక్ కంపోజర్ విశాల్ భరద్వాజ్, లెజెండరీ ఎడిటర్ ఏ శ్రీకర్ ప్రసాద్ లాంటి టాప్ క్లాస్ సెలబ్రిటీలు ఉండటం విశేషం.

మొత్తం 529 కొత్తవాళ్లు

ఆస్కార్స్ ప్రతిష్టాత్మక లిస్ట్‌లో గ్లోబల్ లెవెల్లో పాపులర్ అయిన హాలీవుడ్ యాక్టర్లు జెన్నా ఒర్టెగా, జాకబ్ ఎలోర్డి, జోష్ ఓ కానర్, సిము లియుతో పాటు పాపులర్ డైరెక్టర్లు జోష్, బెన్నీ సాఫ్డీ లాంటి ఎంతోమంది ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ఉన్నారు. ఈ 529 మంది కొత్త వాళ్లు గనుక అకాడమీ ఇన్విటేషన్‌ను అఫీషియల్‌గా యాక్సెప్ట్ చేస్తే.. ఆస్కార్స్ మొత్తం సభ్యుల సంఖ్య 11,319 కి చేరుకుంటుంది.

అందులో ఓటింగ్ హక్కులు ఉన్న సభ్యుల సంఖ్య 10,338 గా మారుతుంది. గత పదేళ్లతో పోలిస్తే అకాడమీ ఓటర్ల సంఖ్య ఇప్పుడు దాదాపు రెట్టింపు అవ్వడం ఒక విశేషం.

ఆస్కార్ కమిటీలో చేరిన ఆరుగురు భారతీయులు వీళ్లే

శ్రీకర్ ప్రసాద్‌కు గ్లోబల్ వైడ్‌గా, ముఖ్యంగా విదేశాల్లో ఆస్కార్ విన్నింగ్ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) ఎడిటర్‌గా మంచి గుర్తింపు ఉంది. దాదాపు 40 ఏళ్లకు పైగా కెరీర్ ఉన్న ఆయన 'తల్వార్', 'షేర్షా', 'సాథియా', రీసెంట్ ప్రాజెక్ట్ 'స్కై ఫోర్స్' లాంటి వందలాది సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్‌గా వర్క్ చేశారు. వీరితో పాటు 'తారే జమీన్ పర్', 'కై పో చే', 'రాక్ ఆన్', 'కేదార్‌నాథ్' సినిమాలకు అద్భుతమైన ఎడిటింగ్ అందించిన దీపా భాటియాకు కూడా ఆస్కార్స్ నుంచి పిలుపు వచ్చింది.

కాస్ట్యూమ్ డిజైనింగ్ కేటగిరీలో ముంబైకి చెందిన పాపులర్ డిజైనర్ ఏకా లఖానికి ఈ అరుదైన అవకాశం దక్కింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్' ఫ్రాంచైజీతో పాటు 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ', షారుఖ్ ఖాన్ 'డంకీ', 'క్వీన్', 'సంజూ' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు ఆమె కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు.

వీరితో పాటు ఆస్కార్స్ రేసులో నిలిచిన గుజరాతీ చిత్రం 'లాస్ట్ ఫిల్మ్ షో' (ఛెల్లో షో) కు వర్క్ చేసిన కాస్టింగ్ డైరెక్టర్ దిలీప్ శంకర్, డిస్నీ ఫేమస్ యానిమేటర్ అవ్నీత్ కౌర్ ఈ ప్రతిష్టాత్మక లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. గత ఏడాది మన దేశం నుంచి యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానా, డైరెక్టర్ పాయల్ కపాడియా ఈ గౌరవాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

మారుతున్న ఆస్కార్స్ ఓటింగ్ రూపురేఖలు

ఆస్కార్స్ జాబితాలోకి కొత్తగా ఆహ్వానించిన చేసిన వారిలో 42 శాతం మహిళలు, 56 శాతం వెనుకబడిన లేదా అణగారిన వర్గాలకు చెందిన వారు, అలాగే 53 శాతం మంది అమెరికా కాకుండా ఇతర దేశాలకు చెందిన సినీ ప్రముఖులు ఉన్నారు.

ఈ మార్పుల వల్ల ఆస్కార్స్ ఓటింగ్‌లో ఇంటర్నేషనల్ మెంబర్స్ వాటా ఏకంగా 22 శాతానికి పెరిగింది. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, టాలెంట్‌తో పాటు అందరికీ సమాన అవకాశాలు, గుర్తింపు ఇవ్వాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ సెలెక్షన్ ప్రక్రియ జరిగినట్లు అకాడమీ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

ఇక అందరూ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న 99వ ఆస్కార్ అవార్డుల (99th Academy Awards) వేడుక మార్చి 14, 2027 న గ్రాండ్‌గా జరగనుంది. ప్రముఖ హాలీవుడ్ కమెడియన్ కమ్ టాక్ షో హోస్ట్ కోనన్ ఓబ్రియన్ వరుసగా మూడోసారి ఈ ప్రతిష్టాత్మక వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe