OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 13 సినిమాలు- అన్నీ స్పెషల్, 5 మరింత ఇంట్రెస్టింగ్- హారర్ టు కోర్ట్ డ్రామా వరకు!

OTT Telugu Movies: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో హారర్ థ్రిల్లర్ నుంచి కోర్ట్ రూమ్ డ్రామా వరకు అన్ని రకాల జోనర్లు ఉన్నాయి. అలాగే, నెట్‌ఫ్లిక్స్ టు లయన్స్ గేట్ ప్లే వరకు వివిధ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలపై లుక్కేద్దాం.

Published on: May 25, 2026, 05:54:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత వారం ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. హారర్, సైన్స్ ఫిక్షన్, స్పై యాక్షన్, కామెడీ, రొమాన్స్, కోర్ట్ రూమ్ వంటి విభిన్న రకాల జోనర్లలో ఆ ఓటీటీ సినిమాలు ప్రీమియర్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి లయన్స్ గేట్ ప్లే వరకు ఓటీటీ రిలీజ్ అయిన ఆ మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 13 సినిమాలు- అన్నీ స్పెషల్, 5 మరింత ఇంట్రెస్టింగ్- హారర్ టు కోర్ట్ డ్రామా వరకు!
ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 13 సినిమాలు- అన్నీ స్పెషల్, 5 మరింత ఇంట్రెస్టింగ్- హారర్ టు కోర్ట్ డ్రామా వరకు!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

దేశీ బ్లింగ్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ హిందీ రియాలిటీ టీవీ లైఫ్‌స్టైల్ సిరీస్)- మే20

ది బోరోగ్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ డ్రామా వెబ్ సిరీస్)- మే 21

ధురంధర్ పార్ట్ 1: రా అండ్ అన్‌దేఖా (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- మే 22 (జియో హాట్‌స్టార్ ఓటీటీలో కూడా)

లేడీస్ ఫస్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సోషల్ సెటైరికల్ రొమాంటిక్ కామెడీ సినిమా)- మే 22

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

టామ్ క్లేన్సీ జాక్ ర్యాన్: ఘోస్ట్ వార్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- మే 20

గాయపడ్డ సింహం (తెలుగు క్రైమ్ కామెడీ యాక్షన్ డ్రామా ఫిల్మ్)- మే 22

సిస్టమ్ (తెలుగు డబ్బింగ్ హిందీ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- మే 22

ఈటీవీ విన్ ఓటీటీ

ఉత్తుత్త హీరోలు (తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- మే 21

సర్కస్ కాలనీ (తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- మే 24

జీ5 ఓటీటీ

మేము కాప్‌లం (తెలుగు రూరల్ క్రైమ్ కామెడీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 22

సన్ నెక్ట్స్ ఓటీటీ

సతీ లీలావతి (తెలుగు ఫ్యామిలీ కామెడీ రొమాంటిక్ డ్రామా సినిమా)- మే 20

సోనీ లివ్ ఓటీటీ

మధువిదు (తెలుగు డబ్బింగ్ మలయాళ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- మే 22

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

పండా ప్లాన్ 2: ది మ్యాజికల్ ట్రైబ్ (తెలుగు డబ్బింగ్ చైనీస్ యాక్షన్ కామెడీ మూవీ)- మే 22

ఓటీటీలోకి తెలుగులో 13 సినిమాలు

ఇలా గత వారం (మే 18 నుంచి 24 వరకు) తెలుగు భాషలో ఏకంగా 13 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు అన్నీ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అయితే, గాయపడ్డ సింహం, ఉత్తుత్త హీరోలు, సతీ లీలావతి, మేము కాప్‌లం, సర్కస్ కాలనీ వంటి 5 తెలుగు స్ట్రయిట్ సినిమాలు మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అంతేకాకుండా ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 4 సినిమాలు ప్రీమియర్ కావడం విశేషంగా మారింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More