OTT: మహాశివరాత్రికి జాగారం చేస్తున్నారా? ఓటీటీలో ఈ సినిమాలు చూస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోండి
మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉంటూ, జాగారం చేస్తూ శివుడి నామజపంలో భక్తులు మునిగిపోతారు. రాత్రంతా మెళకువగా ఉంటూ దేవుణ్ని స్మరించుకుంటారు. జాగారం చేసే భక్తులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూసి భక్తి పారవశ్యంలో మునిగిపోండి.
ఆది శంకరా, ఆపదలు తీర్చే భోళా శంకరుడా, కోరికలు నెరవేర్చే లింగమా.. ఇలా ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి భక్తులు శివ నామ స్మరణ చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శివుణ్ని కొలుస్తూ ఉపవాసం ఉండటమే కాకుండా రాత్రి జాగారం కూడా చేస్తారు. రాత్రి జాగారం ఉండే భక్తులారా.. ఓటీటీలో ఈ సినిమాలు చూసి భక్తి పారవశ్యంలో మునిగిపోండి. ఈ తెలుగు డివోషనల్ మూవీస్ పై ఓ లుక్కేయండి.

భూ కైలాస్ ఓటీటీ
తెలుగు భక్తి సినిమాల్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమా ‘భూ కైలాస్’. ఇందులో దివంగత సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించారు. ఈ భూ కైలాస్ మూవీ శివభక్తికి నిదర్శనం. అప్పటి తరం సినిమా అభిమానులైనా, శివుని భక్తులైనా ఈ క్లాసిక్ మూవీపై ఓ లుక్కేయండి. ఇది యూట్యూబ్ తో పాటు ఎమ్ఎక్స్ ప్లేయర్ లో ఉంది.
భక్త కన్నప్ప ఓటీటీ
ఎన్ని తరాలు మారినా తెలుగు భక్తి సినిమాల ప్రస్తావన వంచినప్పుడు తప్పకుండా మట్లాడుకునే మూవీ ‘భక్త కన్నప్ప’. కృష్ణంరాజు అద్భుత యాక్టింగ్ తో ఈ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్. శివుని ప్రతిరూపమైనా లింగానికి తన కళ్లు పెట్టే కన్నప్ప సీన్ ఎప్పటికీ గుర్తుండిపోయేదే. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ, యూట్యూబ్ లో ఉంది.
శ్రీ మంజునాథ ఓటీటీ
మెగాస్టార్ చిరంజీవి శివుడిగా నటించిన సినిమా ‘శ్రీ మంజునాథ’. ఇందులో యాక్షన్ హీరో అర్జున్ సర్జా గొప్ప శివభక్తుడిగా నటించాడు. ఈశ్వరుని గొప్పతనాన్ని, భక్తుల బాధలు తీర్చే ఆ ఉమామహేశ్వరుడి భోళా తనాన్ని చాటే సినిమా ఇది. శివరాత్రి జాగారానికి ఈ మూవీ పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. శ్రీ మంజునాథ మూవీని యూట్యూబ్ లో చూడొచ్చు.
అఖండ
ఇక ఈ జనరేషన్ విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’, ‘అఖండ 2’ సినిమాలు కూడా భక్తి భావంతో నిండినవే. అఘోరాగా శివతత్వాన్ని చాటే పాత్రలో బాలకృష్ణ నటించాడు. అఖండ సినిమా ఏమో జియోహాట్ స్టార్ లో , అఖండ 2 ఏమో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
కార్తీకేయ 2
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ లీడ్ రోల్ ప్లే చేసిన డివోషనల్ థ్రిల్లర్ ‘కార్తీకేయ 2’. ఓ వైపు దేవుడిపై భక్తిని పంచుతూనే, మరోవైపు థ్రిల్ కూడా అందించే సినిమా ఇది. ఈ మూవీ జీ5 ఓటీటీలో ఉంది. ఇక నాగార్జున నటించిన ఢమరుకం (సన్ నెక్ట్స్, ప్రైమ్ వీడియో), మహాభక్త సిరియాళ (జియోహాట్ స్టార్), జగద్గురు ఆదిశంకర (ఎంఎక్స్ ప్లేయర్) సినిమాలు కూడా భక్తిభావంతో నిండినవే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


