...
...
Next Story

OTT Release: ఓటీటీలోకి ఈ శుక్రవారం ఏకంగా 15 సినిమాలు, వెబ్ సిరీస్.. ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్

మార్చి 6, 2026 (శుక్రవారం) ఓటీటీ ప్రియులకు పండుగ లాంటి రోజు. ప్రభాస్ 'ది రాజా సాబ్' హిందీ వెర్షన్, విజయ్ సేతుపతి మూకీ చిత్రం 'గాంధీ టాక్స్', ఫిజిక్స్ వాలా బయోపిక్ 'హలో బచ్చోన్' మరియు బ్లాక్‌పింక్ జిసూ 'బాయ్‌ఫ్రెండ్ ఆన్ డిమాండ్' వంటి భారీ చిత్రాలు, సిరీస్‌లు ఈరోజే స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి.

Published on: Mar 5, 2026, 15:41:56 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మార్చి నెలలో ఫస్ట్ వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం (మార్చి 6) ఏకంగా 15 సినిమాలు, వెబ్ సిరీస్ వివిధ భాషల్లో మిమ్మల్ని అలరించడానికి రెడీ అవుతున్నాయి. వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్న ముఖ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్ గురించి ఇక్కడ చూడండి.

విక్రమ్ ఆన్ డ్యూటీ - JioHotstar

OTT Release: ఓటీటీలోకి ఈ శుక్రవారం ఏకంగా 15 సినిమాలు, వెబ్ సిరీస్.. ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్
OTT Release: ఓటీటీలోకి ఈ శుక్రవారం ఏకంగా 15 సినిమాలు, వెబ్ సిరీస్.. ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్

బిగ్ బాస్ తెలుగు 8 విజేత నిఖిల్ మలియక్కల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. నిబంధనలను అతిక్రమించే ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జియోహాట్‌స్టార్ లో చూడొచ్చు.

గాంధీ టాక్స్ - ZEE5

విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి నటించిన ఈ ప్రయోగాత్మక మూకీ సినిమా (మాటలు లేని మూవీ) అవినీతి, అత్యాశ నేపథ్యంలో సాగే బ్లాక్ కామెడీ. జీ5లోకి అడుగుపెడుతోంది.

ది రాజా సాబ్ (హిందీ) - JioHotstar

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ హారర్-కామెడీ మూవీ హిందీ వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వస్తోంది. ఒక పాత భవనంలో క్షుద్ర మాంత్రికుడిని ఎదుర్కొనే యువకుడి కథ ఇది. సంజయ్ దత్, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు.

డియర్ రాధి - Sun NXT

ఇదొక తమళ రొమాంటిక్ డ్రామా మూవీ. అమ్మాయిలంటే భయపడే (Gynophobia) ఒక ఐటీ ఉద్యోగి కథ ఇది. సన్ నెక్ట్స్ లోకి వస్తోంది.

ధీరం - Sun NXT

ఇదొక తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ. తెలుగులోనూ సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఓ ఇంట్లో ఉండే ముసలావిడ ఆత్మ చుట్టూ తిరిగే కథ.

లాలో: కృష్ణ సదా సహాయతే - Sony Liv

గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన గుజరాతీ మూవీ ఇది. రూ.50 లక్షల బడ్జెట్ తో వచ్చి ఏకంగా రూ.120 కోట్లు వసూలు చేసింది. సోనీ లివ్ ఓటీటీలో గుజరాతీ, హిందీల్లో వస్తోంది.

హలో బచ్చో - Netflix

'ఫిజిక్స్ వాలా' వ్యవస్థాపకుడు అలఖ్ పాండే స్ఫూర్తిదాయక ప్రయాణం ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్. వినీత్ కుమార్ సింగ్ ప్రధాన పాత్ర పోషించాడు. నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది.

జబ్ ఖులీ కితాబ్ - ZEE5

పంకజ్ కపూర్, డింపుల్ కపాడియా నటించిన హార్ట్ టచింగ్ రొమాంటిక్ కామెడీ. వృద్ధాప్యంలో ప్రేమ, క్షమాగుణం గురించి ఈ సినిమా చర్చిస్తుంది. జీ5 ఓటీటీలో చూడొచ్చు.

చిరయ్యా - JioHotstar

దివ్యా దత్తా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ వైవాహిక అత్యాచారం (Marital Rape), సామాజిక అన్యాయంపై చర్చను రేకెత్తిస్తుంది. జియోహాట్‌స్టార్లో ఈ హిందీ మూవీని చూడొచ్చు.

బాయ్‌ఫ్రెండ్ ఆన్ డిమాండ్ - Netflix

బ్లాక్‌పింక్ స్టార్ జిసూ, సెయో ఇన్-గుక్ నటించిన కొరియన్ రొమాంటిక్ కామెడీ. ఒక హైటెక్ యాప్ ద్వారా డిజిటల్ ప్రేమకథ ఎలా సాగిందనేది ఇందులో చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది.

వార్ మెషీన్ - Netflix

అలెన్ రిట్సన్ నటించిన సైన్స్ ఫిక్షన్ మిలిటరీ యాక్షన్ థ్రిల్లర్. రోబోటిక్ శక్తులతో జరిగే పోరాటం సినిమాను నెక్స్ట్ లెవల్‌లో చూపిస్తుంది. ఇది కూడా నెట్‌ఫ్లిక్స్ లోకే వస్తోంది.

టెడ్ సీజన్ 2 - JioHotstar

ఫేమస్ టెడ్డీ బేర్ కామెడీ వెబ్ సిరీస్ రెండవ సీజన్ అల్లరితో మొదలైంది. జియోహాట్‌స్టార్ లోకి రానుంది.

ది డైనోసార్స్ - Netflix

డైనోసార్ల పరిణామ క్రమాన్ని వివరించే 4 భాగాల డాక్యుమెంటరీ సిరీస్ ఇది. నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.

ఇక లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలోకి కిస్ ఆఫ్ ద స్పైడర్ వుమన్ అనే మరో సినిమా కూడా స్ట్రీమింగ్ కు వస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks