Sign in

OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 16 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషలే, 7 మరింత ఇంట్రెస్టింగ్- హారర్ టు క్రైమ్!

OTT Release Movies Telugu: గత వారం తెలుగులో 16 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. వాటిలో మరింత ఇంట్రెస్టింగ్‌గా 7 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ప్రైమ్, జీ5, లయన్స్ గేట్ ప్లే తదితర ఓటీటీల్లో డిఫరెంట్ జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

Published on: Jul 6, 2026, 05:32:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 16 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో స్పై యాక్షన్, డార్క్ కామెడీ, హారర్, రొమాంటిక్, రివేంజ్ వంటి విభిన్న జోనర్లలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో చూద్దాం.

ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 16 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషలే, 7 మరింత ఇంట్రెస్టింగ్- హారర్ టు క్రైమ్!
ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 16 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషలే, 7 మరింత ఇంట్రెస్టింగ్- హారర్ టు క్రైమ్!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

వరస్ట్ నైబర్ ఎవర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 1

ఎనోలా హోమ్స్ 3 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పై యాక్షన్ మిస్టరీ అడ్వెంచర్ రొమాంటిక్ డ్రామా సినిమా)- జూలై 1

సూపర్ సుబ్బు (తెలుగు రూరల్ సెక్స్ ఎడ్యుకేషన్ డార్క్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 2

ఈటీవీ విన్ ఓటీటీ

గుర్తుకొస్తున్నాయి (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- జూలై 3

డిజిటల్ డెత్ (తెలుగు టెక్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- జూలై 5

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ఎలీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ డార్క్ సెటైరికల్ కామెడీ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 1

ఇసకపట్నం (తెలుగు పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ రివేంజ్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 2

ప్రాజెక్ట్ హెయిల్ మేరీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ డ్రామా చిత్రం)- జూలై 3

జియో హాట్‌స్టార్ ఓటీటీ

మాలీవుడ్ టైమ్స్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- జూలై 3

ప్రీతమ్ అండ్ పెడ్రో (తెలుగు డబ్బింగ్ హిందీ సైబర్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 3

వీరభద్రుని రహస్యం - ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ మర్మదేశం (తెలుగు హారర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- జూలై 3

టాప్ తెలుగు ఇన్‌ఫ్ల్యూయెన్సర్ (తెలుగు రియాలిటీ కాంపిటీషన్ షో)- ఆహా ఓటీటీ- జూలై 3

హ్యాంగ్ మ్యాన్ (తెలుగు యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జూలై 3

కరక్కం (తెలుగు డబ్బింగ్ మలయాళ మ్యూజికల్ హారర్ కామెడీ మూవీ)- సోనీ లివ్ ఓటీటీ- జూలై 3

సిలో సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- జూలై 3

హాఫ్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ డార్క్ డ్రామా వెబ్ సిరీస్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూలై 3

ఓటీటీలోకి తెలుగులో 16 సినిమాలు

ఇలా గత వారం (జూన్ 29 నుంచి జూలై 5) తెలుగులో ఏకంగా 16 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. చూసేందుకు ఈ సినిమాలన్నీ స్పెషలే. కానీ, తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన సూపర్ సుబ్బు, గుర్తుకొస్తున్నాయి, డిజిటల్ డెత్, టాప్ తెలుగు ఇన్‌ఫ్ల్యూయెన్సర్, వీరభద్రుని రహస్యం, ఇసకపట్నం, హ్యాంగ్ మ్యాన్‌తో కలిపి 7 మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More