OTT Telugu Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు టెక్ థ్రిల్లర్- సిస్టమ్ చేసే తప్పుకి మనుషుల బతుకు బలి- ఎక్కడ చూడాలంటే?
Digital Death OTT Streaming: చాందిని చౌదరి నటించిన తెలుగు టెక్ సస్పెన్స్ థ్రిల్లర్ 'డిజిటల్ డెత్'. సాంకేతిక లోపం వల్ల బతికుండగానే ఓ యువతిని ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయినట్లు చూపిస్తే ఆమె ఎదుర్కొన్న నరకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మరి డిజిటల్ డెత్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Digital Death OTT Release Today: మనం బతికే ఉన్నామని నిరూపించుకోవడానికి మన శ్వాస సరిపోదు, ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ రికార్డుల్లో 'అలైవ్' అని ఉండాలి. ఒకవేళ పొరపాటున కంప్యూటర్ స్క్రీన్‌పై మన పేరు పక్కన 'డెడ్' అని వస్తే? మన ఉనికినే సిస్టమ్ తుడిచేస్తే పరిస్థితి ఏంటి?

డిజిటల్ డెత్ ఓటీటీ
సరిగ్గా ఇదే విలక్షణమైన పాయింట్‌తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'డిజిటల్ డెత్' (Digital Death). టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ చాందిని చౌదరి లీడ్ రోల్‌లో నటించిన డిజిటల్ డెత్ ఓటీటీలోకి ఇవాళ (జూలై 5) వచ్చేసింది.
మనదేశంలో టెక్నికల్ గ్లిచ్ లేదా క్లరికల్ తప్పుల వల్ల బతికున్న వృద్ధులకు పెన్షన్లు ఆగిపోవడం, బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ కావడం వంటి ఘటనలను పేపర్లలో తరచూ చూస్తూనే ఉంటాం. తాము బతికే ఉన్నామంటూ ఆఫీసుల చుట్టూ తిరిగే బాధితుల వేదన అంతా ఇంతా కాదు. దర్శకుడు రామ్ మన్నార్ ఈ సినిమాలో సరిగ్గా అదే పాయింట్‌ను ఒక సీరియస్ థ్రిల్లర్‌లా మార్చి కళ్లకు కట్టారు.
ఆకట్టుకునే డిజిటల్ మాయాజాలం
సాంకేతిక లోపం వల్ల బతికుండగానే ఓ యువతిని ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయినట్లు చూపిస్తే ఆమె ఎదుర్కొన్న నరకం ఆధారంగా డిజిటల్ డెత్ తెరకెక్కింది. ఒక సాధారణ యువతి జీవితంలో సాంకేతిక లోపం ఎలాంటి తుఫాను తెచ్చిందో ఈ సినిమా చూపిస్తుంది. ఆఫీస్ రికార్డులు, బ్యాంకులు, చివరికి సమాజం కూడా ఆమె ఉనికిని ప్రశ్నిస్తాయి. డేటా తప్పుగా చూపిస్తోందని ఎంత మొత్తుకున్నా చుట్టూ ఉన్న ప్రపంచం సిస్టమ్‌ను నమ్ముతుందే తప్ప మనిషిని నమ్మదు.
"డిజిటల్ మాయాజాలంలో మనుషుల కంటే స్క్రీన్‌లపై ఉన్న డేటానే సమాజం ఎక్కువగా నమ్ముతోంది" అని చిత్ర బృందం ఈ కథాంశంపై పేర్కొంది. ఈ డిజిటల్ తప్పు నుంచి, వ్యవస్థ చేసిన ఘోరం నుంచి తన గుర్తింపును ఆమె ఎలా కాపాడుకుంది? తనేంటో సమాజానికి ఎలా నిరూపించింది? అనే అంశాలు ఉత్కంఠ రేపుతాయి. చాందిని చౌదరి ఈ డిఫరెంట్ క్యారెక్టర్‌లో ఎంతో ప్యాషనేట్‌గా నటించింది.
పటిష్టమైన సాంకేతిక బృందం
తెలుగు టెక్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన డిజిటల్ డెత్ సినిమాలో చాందిని చౌదరితో పాటు ఆదిత్య, సన, సీనియర్ నటుడు ఎస్.ఎస్. కంచి, సి.వి.ఎల్. నరసింహారావు, వినీత, మాధవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ కడియాల, అనిల్ కడియాల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వై.ఆర్. కృష్ణ అద్భుతమైన విజువల్స్ అందించారు.
ఎస్. సుహాస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథలోని గంభీరతను పెంచింది. బాబు శృంగవరపు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా, రాకేష్ కొయ్యలమూడి (నాని) ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఓటీటీలో వైవిధ్యమైన తెలుగు కంటెంట్‌ను కోరుకునే వారికి 'డిజిటల్ డెత్' ఒక మంచి ఛాయిస్.
ఈటీవీ విన్ ఓటీటీలో
కేవలం వినోదం మాత్రమే కాకుండా, మనం టెక్నాలజీపై ఎంతలా ఆధారపడుతున్నామో ఈ చిత్రం ఆలోచింపజేస్తుంది. ఇలాంటి డిఫరెంట్ థ్రిల్లర్ సినిమా డిజిటల్ డెత్ ఓటీటీలోకి నేడు వచ్చేసింది. ఈటీవీ విన్‌లో జూలై 5 నుంచి డిజిటల్ డెత్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ కథా సుధాలో భాగంగా ఇవాళ డిజిటల్ డెత్ ఓటీటీ రిలీజ్ అయింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


