OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 6 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషలే, ఒకేదాంట్లో 3- తెలుగులో 2 మాత్రమే ఇంట్రెస్టింగ్!

OTT Release Movies Today: థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే టైమ్ లేని ఓటీటీ ప్రియుల కోసం ఇవాళ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ సరికొత్త వినోదంతో ముందుకు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌తో పాటు పలు ఓటీటీల్లో క్రేజీ తెలుగు సిరీస్‌లతో సహా ఆరు సరికొత్త కంటెంట్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అవేంటో చూద్దాం.

Published on: Jul 2, 2026, 20:23:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Today OTT Release Movies: ప్రతి వారం కొత్త సినిమాలతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ముస్తాబవుతుంటాయి. అయితే, ఇవాళ (జూలై 2) ఒక్కరోజు 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్ డ్రామా, కామెడీ వంటి జోనర్లలో నేడు ఓటీటీలోకి వచ్చేసిన ఆ సినిమాలేంటో లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 6 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషలే, ఒకేదాంట్లో 3- తెలుగులో 2 మాత్రమే ఇంట్రెస్టింగ్!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 6 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషలే, ఒకేదాంట్లో 3- తెలుగులో 2 మాత్రమే ఇంట్రెస్టింగ్!

సూపర్ సుబ్బు ఓటీటీ

తెలుగు ఓటీటీ ప్రపంచంలో ఇవాళ రెండు భిన్నమైన జోనర్లు పోటీ పడుతున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తెలుగు రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక బోల్డ్ అండ్ వినూత్న డార్క్ కామెడీ డ్రామా సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చింది.

'సూపర్ సుబ్బు' పేరుతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ గ్రామీణ ప్రాంతంలో సెక్స్ ఎడ్యుకేషన్ అంశం చుట్టూ తిరుగుతుంది. తెలుగు డిజిటల్ స్పేస్‌లో ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుండటంతో ఆడియన్స్‌లో దీనిపై మంచి ఆసక్తి నెలకొంది.

పగ-ప్రతీకారాల చుట్టూ

మరోవైపు, అమెజాన్ ప్రైమ్ వీడియో పక్కా లోకల్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌ను నమ్ముకుంది. 'ఇసకపట్నం' పేరుతో వచ్చిన రివేంజ్ డ్రామా వెబ్ సిరీస్ నేటి నుంచే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓడరేవు నగరం నేపథ్యంలో సాగే అండర్ వరల్డ్ మాఫియా, రాజకీయ కుట్రలు, పగ-ప్రతీకారాల చుట్టూ ఈ సిరీస్‌ను ఆసక్తికరంగా మలిచారు. రస్టిక్ క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఈ వీకెండ్ ఇదొక పర్ఫెక్ట్ ఆప్షన్ కానుంది.

అంతర్జాతీయ డ్రామాలు.. మైండ్ బెండింగ్ జపనీస్ థ్రిల్లర్

గ్లోబల్ కంటెంట్ ప్రియుల కోసం నెట్‌ఫ్లిక్స్ ఈసారి రెండు విభిన్న వెబ్ సిరీస్‌లను ఒకే రోజు విడుదల చేసింది. అందులో మొదటిది 'హ్యుమన్ వెపర్'. జపనీస్ భాషలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఫాంటసీ డ్రామా సిరీస్ సరికొత్త కాన్సెప్ట్‌తో సాగుతుంది. సైన్స్ ఫిక్షన్‌తో పాటు అద్భుతమైన ఫాంటసీ ఎలిమెంట్స్ ఈ సిరీస్‌లో ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

అలాగే, ఇంగ్లీష్ కామెడీ డ్రామా ఇష్టపడే వారి కోసం 'సర్వైవల్ ఆఫ్ ది థికెస్ట్' (Survival of the Thickest) సీజన్ 3ని కూడా నెట్‌ఫ్లిక్స్ నేడే స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. గత రెండు సీజన్లకు మంచి ఆదరణ దక్కడంతో ఈ కొత్త సీజన్‌పై భారీ క్రేజ్ ఉంది.

ప్రాంతీయ వినోదం.. పంజాబీ సినిమాలు

తెలుగు, గ్లోబల్ కంటెంట్‌తో పాటు ప్రాంతీయ సినిమాలను ఆదరించే వారి కోసం కూడా ఈ వారం ప్రత్యేక ఆప్షన్లు ఉన్నాయి. పంజాబీ రొమాంటిక్ డ్రామాగా మంచి గుర్తింపు తెచ్చుకున్న 'రబ్ ద రేడియో 3' సినిమా చౌపల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.

అలాగే, కేబుల్‌వన్ ఓటీటీ యాప్‌లో 'ఏక్ అనోఖి దుల్హాన్ సావి' అనే పంజాబీ డ్రామా చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. విభిన్నమైన కథాంశాలు, వినోదాన్ని కోరుకునే వారు తమకు నచ్చిన ప్లాట్‌ఫామ్‌లలో ఈ సరికొత్త సినిమాలను, సిరీస్‌లను చూసి ఎంజాయ్ చేయవచ్చు.

నేటి ఓటీటీ రిలీజ్ సినిమాల జాబితా:

సినిమా / సిరీస్ పేరుభాష / జోనర్ఓటీటీ ప్లాట్‌ఫామ్ఓటీటీ రిలీజ్ డేట్
సూపర్ సుబ్బుతెలుగు (రూరల్ సెక్స్ ఎడ్యుకేషన్ డార్క్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)నెట్‌ఫ్లిక్స్జూలై 2
హ్యుమన్ వెపర్జపనీస్ (సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఫాంటసీ డ్రామా వెబ్ సిరీస్)నెట్‌ఫ్లిక్స్జూలై 2
సర్వైవల్ ఆఫ్ ది థికెస్ట్ (సీజన్ 3)ఇంగ్లీష్ (కామెడీ డ్రామా వెబ్ సిరీస్)నెట్‌ఫ్లిక్స్జూలై 2
ఇసకపట్నంతెలుగు (పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ రివేంజ్ డ్రామా వెబ్ సిరీస్)అమెజాన్ ప్రైమ్జూలై 2
రబ్ ద రేడియో 3పంజాబీ (రొమాంటిక్ డ్రామా సినిమా)చౌపల్ ఓటీటీజూలై 2
ఏక్ అనోఖి దుల్హాన్ సావిపంజాబీ (డ్రామా చిత్రం)కేబుల్‌వన్ ఓటీటీజూలై 2

ఇంట్రెస్టింగ్‌గా 2 తెలుగులో

ఇలా ఇవాళ (జూలై 2) 6 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో చూసేందుకు అన్నీ చాలా స్పెషల్‌గానే ఉన్నాయి. అయితే, తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన సూపర్ సుబ్బు, ఇసకపట్నం మాత్రం మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. కాగా, ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఏకంగా 3 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More