...
...
Next Story

OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 4 సినిమాలు- తెలుగులో 2 ఇంట్రెస్టింగ్- క్రైమ్ థ్రిల్లర్ నుంచి స్పై యాక్షన్ వరకు!

OTT Movies Today: ఓటీటీ ప్రేక్షకులకు ఈ గురువారం అసలైన వినోదం మొదలైంది. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో మే 14న క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో క్రైమ్ థ్రిల్లర్ నుంచి స్పై యాక్షన్ వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ సినిమాలేంటో లుక్కేద్దాం.

Published on: May 14, 2026, 13:01:02 IST
Advertisement

OTT Release Movies Today: ప్రస్తుత ఓటీటీ కాలంలో సినిమా ప్రియులు థియేటర్ల కంటే డిజిటల్ ప్లాట్‌పామ్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. విభిన్న భాషల కథలను తమ మాతృభాషలో వీక్షించే సౌలభ్యం ఉండటంతో, ప్రతి వారం కొత్త ఓటీటీ రిలీజ్ కోసం జనం వేచి చూస్తుంటారు.

ఓటీటీ స్ట్రీమింగ్

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 4 సినిమాలు- తెలుగులో 2 ఇంట్రెస్టింగ్- క్రైమ్ థ్రిల్లర్ నుంచి స్పై యాక్షన్ వరకు!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 4 సినిమాలు- తెలుగులో 2 ఇంట్రెస్టింగ్- క్రైమ్ థ్రిల్లర్ నుంచి స్పై యాక్షన్ వరకు!

అలా, ఇవాళ (మే 14 గురువారం) ఒక్కరోజు ఓటీటీ ప్రపంచంలోకి నాలుగు సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ల నుంచి స్పై యాక్షన్ సినిమాల వరకు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల వినోదాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌లో 'నెమిసిస్' హంగామా

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తన అంతర్జాతీయ కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసే క్రమంలో 'నెమిసిస్' (Nemesis) వెబ్ సిరీస్‌ను తీసుకువచ్చింది. ఇంగ్లీష్‌ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్‌ను తెలుగులో డబ్ చేసి ఈరోజే ఓటీటీ రిలీజ్ చేశారు. ఇంగ్లీష్, తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా నెమిసిస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

నేర పరిశోధన, ఉత్కంఠభరితమైన మలుపులతో సాగే ఈ డ్రామా ఓటీటీ సిరీస్, సస్పెన్స్ కథలను ఇష్టపడే వారికి ఒక మంచి ఎంపిక. దీనితో పాటు జపనీస్ వెబ్ సిరీస్ 'సోల్‌మేట్' (Soulmate) కూడా నేటి నుంచే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. భావోద్వేగపూరితమైన కథలను ఇష్టపడే వారు ఈ జపనీస్ సిరీస్‌ను వీక్షించవచ్చు.

జియో హాట్‌స్టార్‌లో ఆర్య 'మిస్టర్ ఎక్స్'

తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం డబ్బింగ్ వెర్షన్స్ కూడా మే 14 నుంచి అందుబాటులోకి వచ్చాయి. దీంతో సౌత్ భాషల ప్రేక్షకులు ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయొచ్చు. స్పై సినిమాలకు ఉండే క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇతర భాషా చిత్రాలు

ఇక చౌపల్ (Chaupal) ఓటీటీలో పంజాబీ కామెడీ డ్రామా చిత్రం 'హయే ని బేబే మేరియే' (Haye Ni Bebe Meriye) విడుదలైంది. కాస్త భిన్నమైన కామెడీని కోరుకునే వారు ఈ చిత్రాన్ని చూడొచ్చు.

ఫైనల్‌గా చెప్పాలంటే, క్రైమ్, థ్రిల్లర్, యాక్షన్.. ఇలా అన్ని రకాల జోనర్ల సినిమాలు ఇవాళ ఓటీటీలోకి వచ్చేశాయి. వీటిలో రెండు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా తెలుగులో ఓటీటీ రిలీజ్ అయిన నెమిసిస్, మిస్టర్ ఎక్స్ తెలుగులో మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe