OTT Release: దళపతి విజయ్ ఫేర్‌వెల్ మూవీ 'జన నాయగన్' థియేటర్లలో రచ్చ లేపడానికి రెడీ అవుతున్న వేళ.. డిజిటల్ స్క్రీన్స్ పై కూడా ఈ వారం ఓటీటీ పండగ షురూ కాబోతోంది. జులై 24న నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఆహా, సోనీ లీవ్ ప్లాట్‌ఫామ్స్ లో ఏకంగా ఐదు క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. వీకెండ్ లో ఇంట్లోనే కూర్చుని సరికొత్త కంటెంట్ ఎంజాయ్ చేయాలనుకునే యాక్షన్, రొమాన్స్, కామెడీ లవర్స్ కోసం ఈ వారం లిస్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
ఆహాలో 'దీవానా' రొమాంటిక్ రైడ్

టాలీవుడ్ యంగ్ టాలెంట్ హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేఖలై లీడ్ రోల్స్ లో నటించిన ప్యూర్ లవ్ స్టోరీ 'దీవానా'. ఈ సినిమాతో శ్రీకాంత్ సంఘిశెట్టి డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. హర్షిత్ రెడ్డి గతంలో పలు షార్ట్ ఫిలిమ్స్ తో డిజిటల్ స్పేస్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
యూత్‌ఫుల్ ఎమోషన్స్ తో సాగే ఈ రొమాంటిక్ డ్రామా జులై 24 నుంచి లోకల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' (Aha)లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మరికొద్ది గంటల్లోనే రాబోతోంది. ఆహా ఓటీటీ ఎప్పుడూ తెలుగు నేటివిటీ ఉన్న చిన్న చిత్రాలను బాగా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి.. ఈ లవ్ స్టోరీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో విక్రాంత్ మాస్సే 'ముసాఫిర్ కేఫే'
'12th ఫెయిల్' సినిమాతో నేషనల్ వైడ్‌గా సంచలన విజయం అందుకున్న వర్సటైల్ యాక్టర్ విక్రాంత్ మాస్సే ఇప్పుడు ఒక ఇంటెన్స్ రొమాంటిక్ వెబ్ సిరీస్‌తో మన ముందుకు వస్తున్నాడు. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ గా వస్తున్న 'ముసాఫిర్ కేఫే' జులై 24 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా హిందీలో స్ట్రీమింగ్ కానుంది.
రుచిర్ అరుణ్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌ను టెరిబ్లీ టైనీ టేల్స్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీస్ రాయడంలో ఈ ప్రొడక్షన్ హౌస్ కి మంచి పేరుంది. ఇందులో విక్రాంత్ సరసన వేదికా పింటో, మహిమా మక్వానా కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పించనున్నారు.
ప్రైమ్ వీడియోలో కేకే మీనన్ కామెడీ ధమాకా
{{/usCountry}}రుచిర్ అరుణ్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌ను టెరిబ్లీ టైనీ టేల్స్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీస్ రాయడంలో ఈ ప్రొడక్షన్ హౌస్ కి మంచి పేరుంది. ఇందులో విక్రాంత్ సరసన వేదికా పింటో, మహిమా మక్వానా కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పించనున్నారు.
ప్రైమ్ వీడియోలో కేకే మీనన్ కామెడీ ధమాకా
{{/usCountry}}బాలీవుడ్ అసాధారణ నటుడు కేకే మీనన్ లీడ్ రోల్ లో వస్తున్న సరికొత్త హిందీ వెబ్ సిరీస్ 'ఆదర్శ్ బాల్ విద్యాలయ'. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 24 నుంచి డిజిటల్ ప్రీమియర్ కాబోతున్న ఈ సిరీస్‌ను హిమాంక్ గౌర్ డైరెక్ట్ చేశారు.
ఈ సిరీస్ క్రియేటర్స్ బిస్వాపతి సర్కార్, సమీర్ సక్సేనా గతంలో టీవీఎఫ్ (TVF) లో ఎన్నో బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్‌లను అందించారు. ఈ ఫన్నీ ఎంటర్‌టైనర్‌లో అర్చనా పూరన్ సింగ్, నవీన్ కస్తూరియా, అభిమన్యు సింగ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఓ గవర్నమెంట్ స్కూల్ బ్యాక్‌డ్రాప్ లో వచ్చే క్లీన్ కామెడీ సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం గ్యారెంటీ.
అర్జున్ దాస్, అన్నా బెన్ 'కాన్ సిటీ' క్రైమ్ కామెడీ
తన బేస్ వాయిస్‌తో తెలుగు రాష్ట్రాల్లో కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న అర్జున్ దాస్, జాతీయ అవార్డు విన్నర్ అన్నా బెన్ కలిసి నటించిన క్రైమ్ కామెడీ మూవీ 'కాన్ సిటీ'. డెబ్యూ డైరెక్టర్ హరీష్ దురైరాజ్ తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ పాన్-ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది.
నెట్‌ఫ్లిక్స్ లో జులై 24 నుంచి తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో ఈ సినిమా డిజిటల్ డెబ్యూ ఇస్తోంది. సస్పెన్స్ తో పాటు డార్క్ హ్యూమర్ ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక క్రేజీ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అర్జున్ దాస్ ఇంటెన్స్ యాక్టింగ్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ కానుంది.
సోనీ లీవ్‌లో టొవినో థామస్ 'పల్లిచట్టంబి'
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన హై-బడ్జెట్ యాక్షన్ డ్రామా 'పల్లిచట్టంబి' బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. కయదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక పవర్‌ఫుల్ కామియో రోల్ లో కనిపించడం విశేషం.
డిజో జోస్ ఆంటోనీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సోనీ లీవ్ (SonyLIV) ప్లాట్‌ఫామ్ జులై 24 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోంది. మలయాళంతో పాటు తెలుగు వర్షన్ కూడా అదే రోజు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయిన యాక్షన్ లవర్స్ ఓటీటీలో ఈ సినిమాను ట్రై చేయవచ్చు.
ఏ ఓటీటీలో ఏవంటే?
* దీవానా (తెలుగు మూవీ) : ఆహా ఓటీటీ
* ముసాఫిర్ కెఫే (హిందీ వెబ్ సిరీస్) : నెట్‌ఫ్లిక్స్
* ఆదర్శ్ బాల్ విద్యాలయ (హిందీ వెబ్ సిరీస్): ప్రైమ్ వీడియో
* కాన్ సిటీ (మూవీ) : నెట్‌ఫ్లిక్స్
* పల్లిచట్టంబి (మలయాళం థ్రిల్లర్) : సోనీ లివ్ ఓటీటీ
* థియేటర్ రిలీజ్: జన నాయగన్ (జులై 23)