OTT Release: ప్రపంచవ్యాప్తంగా సౌత్ ఇండియన్ సినిమాలకు, నటీనటులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు థియేటర్లలో, అటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సౌత్ సినిమాల హవా కొనసాగుతోంది. థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న పలు భారీ చిత్రాలు, కంటెంట్ ఓరియెంటెడ్ కథలు ఇప్పుడు నవంబర్ నెలలో డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి.

మీరు గనక అద్భుతమైన యాక్షన్, థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామాలను ఇంట్లోనే కూర్చుని ఆస్వాదించాలనుకుంటే.. ఈ నెలలో ఓటీటీలో విడుదల కానున్న ఈ 5 టాప్ సౌత్ సినిమాల లిస్ట్ మీకోసమే. ఏ సినిమా ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1. ఐ యామ్ గేమ్ (I Am Game - మలయాళం)
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ 'ఐ యామ్ గేమ్'. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదలైంది. థియేట్రికల్‌గా పెద్దగా సక్సెస్ కానప్పటికీ, ఓటీటీలో ఈ తరహా జానర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సినిమా నవంబర్ 6 నుంచి జియోహాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్ కానుంది.
2. జైలర్ 2 (Jailer 2 - తమిళం)
సూపర్ స్టార్ రజనీకాంత్ మాస్ అవతార్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే రీతిలో రూ. 800 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ కలెక్షన్లు రాబట్టిన 'జైలర్ 2' కోసం ఓటీటీ ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన ఎన్నో అగ్ర హీరోల సినిమాలను కలెక్షన్ల పరంగా వెనక్కి నెట్టిన ఈ యాక్షన్ బ్లాక్‌బస్టర్ నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది.
3. రణబాలి (Ranabali - తెలుగు)
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ చిత్రం 'రణబాలి'. 19వ శతాబ్దపు బ్రిటీష్ వలస పాలన, దక్షిణ భారతదేశంలో సంభవించిన భయంకరమైన 'మద్రాసు కరువు' వంటి చారిత్రక నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్‌ను పలకరించేందుకు నవంబర్ 13న నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులోకి రానుంది.
4. హైకూ (Haiku - తమిళం)
{{/usCountry}}విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ చిత్రం 'రణబాలి'. 19వ శతాబ్దపు బ్రిటీష్ వలస పాలన, దక్షిణ భారతదేశంలో సంభవించిన భయంకరమైన 'మద్రాసు కరువు' వంటి చారిత్రక నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్‌ను పలకరించేందుకు నవంబర్ 13న నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులోకి రానుంది.
4. హైకూ (Haiku - తమిళం)
{{/usCountry}}యువరాజ్ చిన్నస్వామి దర్శకత్వంలో రూపొందిన బ్యూటిఫుల్ రొమాంటిక్ డ్రామా 'హైకూ'. ఏగన్, శ్రీదేవి ఆపళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 23న థియేటర్లలోకి వచ్చింది. సున్నితమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం, ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను ఇష్టపడే వారి కోసం నవంబర్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది.
5. 418 (తెలుగు)
హారర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు '418' ఒక బెస్ట్ ఆప్షన్. కీర్తన్ నాడగౌడ దర్శకత్వంలో చైత్ర జె ఆచార్ నటించిన ఈ చిత్రం ఒక ఇంటెన్స్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. భయపెట్టే అంశాలతో పాటు మెదడుకు మేత పెట్టే సైకలాజికల్ అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ తెలుగు థ్రిల్లర్ నవంబర్ 20న నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో విడుదల కానుంది.