...
...
Next Story

OTT Telugu: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో రెండు తెలుగు సినిమాలు.. ఒకటి 100 కోట్ల బ్లాక్‌బస్టర్.. మరొకటి కంబ్యాక్ హీరో మూవీ

OTT Telugu: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో రెండు లేటెస్ట్ తెలుగు సినిమాలు అడుగు పెట్టబోతున్నాయి. వీటిలో ఒకటి రూ.100 కోట్ల బ్లాక్‌బస్టర్ మా ఇంటి బంగారం కాగా.. మరొకటి ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు. ఈ రెండు మూవీస్ తో ఈ వీకెండ్ తెలుగు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ దక్కనుంది.

Published on: Jul 16, 2026, 15:18:04 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Telugu: ఓటీటీలో ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీ కోసమే రెండు లేటెస్ట్ తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని గంటల్లో అంటే ఈరోజు అర్ధరాత్రి దాటగానే ఈ రెండు మూవీస్ స్ట్రీమింగ్ రాబోతున్నాయి. వీటిలో ఒకటి మా ఇంటి బంగారం కాగా.. మరొకటి వడ్డే నవీన్ నటించిన ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు.

వడ్డే నవీన్ కంబ్యాక్ మూవీ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'

OTT Telugu: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో రెండు తెలుగు సినిమాలు.. ఒకటి 100 కోట్ల బ్లాక్‌బస్టర్.. మరొకటి కంబ్యాక్ హీరో మూవీ
OTT Telugu: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో రెండు తెలుగు సినిమాలు.. ఒకటి 100 కోట్ల బ్లాక్‌బస్టర్.. మరొకటి కంబ్యాక్ హీరో మూవీ

'పెళ్లి', కోరుకున్న ప్రియుడు, మనసిచ్చి చూడు లాంటి క్లాసిక్ హిట్స్‌తో ఆ రోజుల్లో యూత్‌ను ఊపేసిన వడ్డే నవీన్ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత లీడ్ రోల్‌లో అలరించేందుకు రెడీ అయ్యారు. ఆయన నటించిన కొత్త యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' ఈ శుక్రవారం అంటే జులై 17 నుంచి జీ5 ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వస్తోంది. ఈ సినిమాలో రాశీ సింగ్ ఫీమేల్ లీడ్‌గా నటించింది.

ఇంటిల్లిపాదీ కలిసి హాయిగా నవ్వుకునే సరదా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయని జీ5 మేకర్స్ అనౌన్స్ చేశారు. "రేపటి నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌కి ట్రాన్స్‌ఫర్ ఫిక్స్" అంటూ స్పెషల్ పోస్టర్‌తో ప్రమోషన్స్ హీటెక్కించారు. వడ్డే నవీన్ కంబ్యాక్ సినిమా కావడంతో అప్పట్లో ఆయన ఫ్యాన్స్ ఈ సినిమా కోసం డిజిటల్ స్పేస్‌లో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

జియోహాట్‌స్టార్‌లో సమంత 'మా ఇంటి బంగారం'

మరోవైపు గ్లోబల్ బ్యూటీ సమంత నటించిన లేటెస్ట్ ప్రాజెక్ట్ 'మా ఇంటి బంగారం' కూడా జులై 17 నుంచే జియోహాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ రిలీజ్ సందర్భంగా సమంత ఐకానిక్ డ్యాన్స్ సీన్స్, హిట్ సాంగ్స్‌తో కట్ చేసిన 'థస్సాదియ్యా' స్పెషల్ థా థా థా మ్యాషప్ వీడియోను హాట్‌స్టార్ టీమ్ రిలీజ్ చేసింది.

ఈ వారం ఓటీటీ స్పేస్ లో ఒకే రోజు రెండు డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు రిలీజ్ అవుతుండటంతో డిజిటల్ ఆడియన్స్ కు పండగే అని చెప్పాలి. ఒకవైపు సీనియర్ హీరో వడ్డే నవీన్ గ్రాండ్ కంబ్యాక్, ఇంకోవైపు లేడీ సూపర్ స్టార్ సమంత క్యూట్ యాక్టింగ్ రెండూ ఒకేసారి అలరించబోతున్నాయి.

వీకెండ్ ప్లాన్స్ చేసుకునే ఆడియన్స్ కు ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులు పర్ఫెక్ట్ ఛాయిస్ గా మారబోతున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన టీజర్లు, ప్రమోషనల్ కంటెంట్ వైరల్ అవ్వడంతో జూలై 17 స్ట్రీమింగ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe