Telugu Web Series: ఓటీటీలో రచ్చ చేస్తున్న తెలుగు వెబ్ సిరీస్.. రేపు మరో ఓటీటీలోకి.. పెళ్లికి ముందు గతాన్ని మరిచే హీరో

Telugu Web Series: ఈటీవీ విన్ ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన ఓ తెలుగు వెబ్ సిరీస్ రచ్చ చేస్తోంది. ఈ సిరీస్ పేరు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లోకీ అడుగుపెడుతుండటం విశేషం. ఇంతకీ ఆ సిరీస్ కథేంటి? నెట్‌ఫ్లిక్స్ లో ఎప్పటి నుంచి చూడొచ్చో తెలుసుకోండి.

Published on: Jul 9, 2026, 17:01:54 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telugu Web Series: తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ సాధారణంగా ఏదైనా ఒక ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం సాధరణమే. అయితే ఇప్పటికే ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ‘గుర్తుకొస్తున్నాయి’ అనే సిరీస్ మాత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోకి కూడా రాబోతోంది. రేపటి నుంచి అంటే జులై 10 నుంచి ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది.

Telugu Web Series: ఓటీటీలో రచ్చ చేస్తున్న తెలుగు వెబ్ సిరీస్.. రేపు మరో ఓటీటీలోకి.. పెళ్లికి ముందు గతాన్ని మరిచే హీరో
Telugu Web Series: ఓటీటీలో రచ్చ చేస్తున్న తెలుగు వెబ్ సిరీస్.. రేపు మరో ఓటీటీలోకి.. పెళ్లికి ముందు గతాన్ని మరిచే హీరో

నెట్‌ఫ్లిక్స్‌లోకి ‘గుర్తుకొస్తున్నాయి’

ఈటీవీ విన్ ఓటీటీలో గత వారం రిలీజైన వెబ్ సిరీస్ ఈ ‘గుర్తుకొస్తున్నాయి’. ఓటీటీలోకి అడుగుపెట్టిన రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ తో దూసుకెళ్లింది. ఇప్పటికీ యువత మనసు కొల్లగొడుతూ ఆ ఓటీటీలో రికార్డలు తిరగరాస్తోంది.

అయితే ఈ మధ్యే ఈటీవీ విన్ కంటెంట్ ను తన ప్లాట్‌ఫామ్ పై కూడా స్ట్రీమింగ్ చేస్తున్న నెట్‌ఫ్లిక్స్ ఈ ‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్ ను కూడా స్ట్రీమింగ్ చేయబోతోంది. “కాలంలో వెనక్కి వెళ్లాల్సిన టైమ్ వచ్చేసింది.. జులై 10 నుంచి ‘గుర్తుకొస్తున్నాయి’ని తెలుగులో నెట్‌ఫ్లిక్స్ లో చూడండి. త్వరలోనే హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలోనూ అందుబాటులోకి వస్తుంది” అనే క్యాప్షన్ తో నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది.

‘గుర్తుకొస్తున్నాయి’ అసలు కథేంటంటే..?

గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ లో ‘బేబీ’ ఫేమ్ విరాజ్ హీరోగా నటించాడు. యశశ్రీ రావు హీరోయిన్. సంతోష్ (విరాజ్), వైశాలి (యశశ్రీ) స్కూల్ లో క్లాస్ మేట్స్. వీళ్లు లవ్ చేసుకుంటారు. వైశాలి తండ్రి ఏమో అదే స్కూల్ హెడ్ మాస్టర్ రఘునాథ్ (ప్రియదర్శిని రామ్). రఘునాథ్ ను ఒప్పించి మరీ సంతోష్ పెళ్లికి రెడీ అవుతాడు.

అయితే గోవాలో బ్యాచిలర్స్ పార్టీ కోసం తన ఫ్రెండ్స్ గణేష్, శ్రీకాంత్, ఆనంద్ తో కలిసి సంతోష్ వెళ్తాడు. ఆ క్రమంలో యాక్సిడెంట్ కావడంతో సంతోష్ గతాన్ని మర్చిపోతాడు. మరి సంతోష్ కు గతం గుర్తొచ్చిందా? వైశాలితో పెళ్లి జరిగిందా? అన్నదే గుర్తుకొస్తున్నాయి సిరీస్ స్టోరీ.

‘గుర్తుకొస్తున్నాయి’ సక్సెస్ కారణం

ఈటీవీ విన్ ఓటీటీలో గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ సక్సెస్ కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దీనికి రిలీజ్ కంటే ముందే మంచి హైప్ నెలకొంది. ఇక స్పెషల్ గా ప్రీమియర్ షోలు కూడా వేశారు. థియేటర్లో ఈ ప్రీమియర్ షోలు చూసిన ఆడియన్స్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. సిరీస్ అదిరిపోయిందని, ప్యూర్ నోస్టాల్జియా ఫీల్ వచ్చిందని అన్నారు. ఈ సిరీస్ సక్సెస్ కు ముఖ్య కారణం ఆ నోస్టాల్జియా ఫీలింగ్ అని చెప్పొచ్చు.

యాక్సిడెంట్ కారణంగా గతం మర్చిపోయిన హీరోకు అతని ఫ్రెండ్స్ కలిసి పాత జ్ణాపకాలు గుర్తు చేసేందుకు ట్రై చేస్తారు. ఈ క్రమంలోనే వచ్చే స్కూల్ డేస్, చిన్నప్పటి నుంచి కొనసాగే లవ్ సీన్లు ఆకట్టుకుంటున్నాయి. 90స్ కిడ్స్ కు కనెక్ట్ అయ్యేలా ఈ ఎపిసోడ్లు సాగుతాయి. ఇవి ప్రస్తుతం యూత్ ను బాగా ఎంగేజ్ చేస్తున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More