...
...
Next Story

OTT Movies: ఓటీటీల్లో ఈవారం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో మిస్ కాకుండా చూడాల్సిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. తెలుగులో మూడు

మార్చి నెల తొలి వారంలోనే ఓటీటీ ప్రియుల కోసం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. విజయ్ సేతుపతి నటించిన ప్రయోగాత్మక మూవీ 'గాంధీ టాక్స్' నుంచి బిగ్ బాస్ విజేత నిఖిల్ నటించిన 'విక్రమ్ ఆన్ డ్యూటీ' వరకు.. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సౌత్ మూవీస్ వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Published on: Mar 2, 2026, 21:05:15 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ప్రతి వారం లాగే ఈ మార్చి మొదటి వారం కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. జీ5 (ZEE5), సన్ నెక్స్ట్ (Sun NXT), ఆహా (aha), జియోహాట్‌స్టార్ వంటి ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పై విడుదలవుతున్న ఆ సినిమాలు, వెబ్ సిరీస్‌ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

గాంధీ టాక్స్ (తమిళం - మూకీ సినిమా)

OTT Movies: ఓటీటీల్లో ఈవారం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో మిస్ కాకుండా చూడాల్సిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. తెలుగులో మూడు
OTT Movies: ఓటీటీల్లో ఈవారం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో మిస్ కాకుండా చూడాల్సిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. తెలుగులో మూడు

ప్లాట్‌ఫామ్: ZEE5

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, అదితి రావ్ హైదరీ, అరవింద్ స్వామి నటించిన ఈ మూవీ ఒక అద్భుతమైన ప్రయోగం. ఎటువంటి మాటలు లేని ఈ 'సైలెంట్ మూవీ' కేవలం నటీనటుల హావభావాలు, ఏఆర్ రెహమాన్ సంగీతం ఆధారంగా సాగుతుంది. నిరుద్యోగి అయిన మహదేవ్ (విజయ్ సేతుపతి) జీవితం ఒక ధనవంతుడితో ఎలా ముడిపడింది అనేదే ఈ చిత్ర కథ. ఈ సినిమా మార్చి 6 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.

విక్రమ్ ఆన్ డ్యూటీ

ప్లాట్‌ఫామ్: జియోహాట్‌స్టార్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేత నిఖిల్ మలియక్కల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ ఇది. విక్రమ్ వాసు అనే సిట్ (SIT) అధికారిగా నిఖిల్ కనిపించనున్నాడు. ఒక కఠినమైన కేసును ఛేదించే క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు, అతని గతం గురించి ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సాగుతుంది. జియోహాట్‌స్టార్ లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

ఓం శాంతి శాంతి:

ప్లాట్‌ఫామ్: ఆహా

మలయాళ సూపర్ హిట్ 'జయ జయ జయ జయ హే' సినిమాకు ఇది అధికారిక తెలుగు రీమేక్ ఈ ఓం శాంతి శాంతి శాంతి: మూవీ. ఒక చదువుకున్న యువతి, సంకుచిత మనస్తత్వం గల భర్త నుంచి ఎదురయ్యే గృహహింసను ఎలా ఎదుర్కొంది? తిరిగి అతనికి ఎలా బుద్ధి చెప్పింది? అనే అంశాన్ని హాస్యాన్ని జోడించి ఈ సినిమాలో చూపించారు. ఆహా వీడియోలో బుధవారం (మార్చి 4) నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది.

దేవగుడి

రాయలసీమ నేపథ్యంలో సాగే మాస్ ఫ్యాక్షన్ డ్రామా ఇది. రఘు కుంచె, రఘు బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలైనప్పటికీ, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. మంగళవారం (మార్చి 3) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తోంది.

ధీరం

ప్లాట్‌ఫామ్: సన్ నెక్స్ట్ (Sun NXT)

ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. కోళికోడ్ నగరంలో వరుస హత్యలకు పాల్పడుతున్న ఒక సీరియల్ కిల్లర్‌ను ఏసీపీ స్టాలిన్ జోసెఫ్ ఎలా పట్టుకున్నారనేది ఉత్కంఠభరితంగా ఉంటుంది. సన్ నెక్ట్స్ ఓటీటీలో శుక్రవారం (మార్చి 6) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe