ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే. ముఖ్యంగా బాలకృష్ణ ఫ్యాన్స్‌కి ఇది పెద్ద గుడ్ న్యూస్. బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపిన 'అఖండ 2: తాండవం' ఈ వారమే ఓటీటీలోకి వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్, జీ5, అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఈ శుక్రవారం (జనవరి 9) నుండి స్ట్రీమింగ్ కానున్న తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల పూర్తి లిస్ట్ ఇదే.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావిడి మొదలవ్వక ముందే ఓటీటీలో సందడి మొదలైంది. బాలయ్య 'అఖండ 2' నుంచి కవిన్ నటించిన థ్రిల్లర్ 'మాస్క్' వరకు.. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాల వివరాలు ఇక్కడ చూడండి.
అఖండ 2: తాండవం - నెట్‌ఫ్లిక్స్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ఈ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అఖండ 2 మూవీ శుక్రవారం (జనవరి 9) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనిని అధికారికంగా ఆ ఓటీటీ వెల్లడించింది. బయో వార్‌ఫేర్ (జీవాయుధాల) ముప్పు నుంచి భారతదేశాన్ని కాపాడటానికి అఖండ మళ్ళీ వస్తాడు. దేవుడిపై నమ్మకాన్ని పునరుద్ధరించే ఈ పోరాటంలో బాలయ్య విశ్వరూపం చూడొచ్చు.
జిగ్రీస్ - సన్ నెక్ట్స్
ఇక గతేడాది నవంబర్ లో రిలీజైన జిగ్రీస్ అనే తెలుగు కామెడీ మూవీ కూడా సన్ నెక్ట్స్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా నలుగురు ఫ్రెండ్స్ చేతిలో ఒక్క రూపాయి లేకుండా గోవా ట్రిప్ కు వెళ్లి ఎలాంటి తంటాలు పడతారు అన్నది చూపించింది. నవ్వులు పంచడంతోపాటు ఎమోషనల్ గానూ ఆకట్టుకుంది.
మాస్క్ - జీ5 ఓటీటీ
'డాడా', 'స్టార్' సినిమాలతో ఆకట్టుకున్న కవిన్ నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఈ మాస్క్. ఈ సినిమా శుక్రవారం (జనవరి 9) జీ5 ఓటీటీలోకి వస్తోంది. రూ. 440 కోట్ల భారీ దొంగతనం చుట్టూ తిరిగే కథ ఇది. కేవలం ఏడు రోజుల్లో ఆ డబ్బును తిరిగి రాబట్టడానికి చేసే సాహసం, అందులో ఉండే ట్విస్టులే ఈ సినిమా.
బాల్టి - ప్రైమ్ వీడియో
{{/usCountry}}'డాడా', 'స్టార్' సినిమాలతో ఆకట్టుకున్న కవిన్ నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఈ మాస్క్. ఈ సినిమా శుక్రవారం (జనవరి 9) జీ5 ఓటీటీలోకి వస్తోంది. రూ. 440 కోట్ల భారీ దొంగతనం చుట్టూ తిరిగే కథ ఇది. కేవలం ఏడు రోజుల్లో ఆ డబ్బును తిరిగి రాబట్టడానికి చేసే సాహసం, అందులో ఉండే ట్విస్టులే ఈ సినిమా.
బాల్టి - ప్రైమ్ వీడియో
{{/usCountry}}కేరళ-తమిళనాడు బోర్డర్‌లో జరిగే క్రైమ్ డ్రామా ఈ బాల్టీ. ఇదో మలయాళం మూవీ. శుక్రవారమే ప్రైమ్ వీడియోలోకి వస్తోంది. నలుగురు టాలెంటెడ్ కబడ్డీ ప్లేయర్స్ స్థానిక గూండాల గొడవలో ఇరుక్కుంటారు. స్నేహం, ప్రేమ, విధేయతలకు పరీక్ష పెట్టే క్రైమ్ వరల్డ్ కథ ఇది. షేన్ నిగమ్, శాంతను భాగ్యరాజ్, ప్రీతి అస్రాని, సెల్వరాఘవన్ నటించారు.
అంగమ్మల్ - సన్ నెక్ట్స్
విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ సినిమా ఈ అంగమ్మల్. ఇది శుక్రవారం సన్ నెక్ట్స్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. తమిళనాడులోని ఒక గ్రామీణ వితంతువు బ్లౌజ్ (రవికె) వేసుకోవడానికి నిరాకరిస్తుంది. తన కొడుకు ఒక ధనవంతుల ఇంటి అమ్మాయిని పరిచయం చేయాలనుకున్నప్పుడు.. తల్లి వ్యక్తిగత నిర్ణయం ఎలాంటి గొడవలకు దారితీసింది అనేదే ఈ ఎమోషనల్ డ్రామా.
ఫ్రీడం ఎట్ మిడ్‌నైట్ సీజన్ 2 - సోనీ లివ్
భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రను కళ్లకు కట్టే వెబ్ సిరీస్ ఇది. సోనీ లివ్ లో జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. గతేడాది వచ్చిన తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దేశ విభజన నాటి పరిస్థితులను ఈ రెండో సీజన్ కళ్లకు కట్టనుంది.