ఈవారం ఓటీటీ అభిమానులకు పండగే. ఎందుకంటే ఈ ఏడాది ఇండియన్ సినిమాలో రెండు అతిపెద్ద బ్లాక్‌బస్టర్ సినిమాలు ఒకే రోజు డిజిటల్ ప్రీమియర్ కాబోతున్నాయి. వీటిలో ఒకటి కాంతార ఛాప్టర్ 1 కాగా.. మరొకటి మలయాళం మూవీ లోకా: ఛాప్టర్ 1. ఈ రెండు మూవీస్ వేర్వేరు ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్నాయి.
ఒక్క రోజు.. రెండు బ్లాక్‌బస్టర్లు..

ఈవారం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే ఈ శుక్రవారం అంటే అక్టోబర్ 31న చాలా సినిమాలే రాబోతున్నాయి. అయితే వీటిలో అందరి దృష్టి మాత్రం రెండు సినిమాలపైనే ఉంది. వీటిలో ఒకటి కాంతార ఛాప్టర్ 1. ఈ నెల 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. అది కూడా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.800 కోట్లకుపైగా వసూళ్లతో ఈ ఏడాది అత్యధిక వసూళ్ల ఇండియన్ సినిమాగా నిలిచినా.. అప్పుడే డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ సినిమా అక్టోబర్ 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఇక మరొకటి మలయాళం ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్ల సూపర్ హీరో మూవీ లోకా: ఛాప్టర్ 1. తెలుగులో కొత్త లోక పేరుతో రిలీజైంది. కల్యాణి ప్రియదర్శన్ ఫిమేల్ సూపర్ హీరో పాత్ర పోషించింది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకుపైగా వసూలు చేసి.. ఈ ఘనత సాధించిన తొలి మలయాళం మూవీగా నిలిచింది. ఇప్పుడీ సినిమా శుక్రవారం (అక్టోబర్ 31) నుంచే జియోహాట్‌స్టార్ లో ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
కాంతార, లోకా.. రెండూ రెండే
కాంతార ఛాప్టర్ 1, లోకా ఛాప్టర్ 1.. ఈ సౌత్ ఇండియన్ మూవీస్ ఈ ఏడాది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంచలన విజయాలు సాధించాయి. కాంతార ఛాప్టర్ 1 ఓ ప్రీక్వెల్ కాగా.. లోకా ప్రాంఛైజీలో తొలి సినిమా. రెండూ పూర్తిగా వేర్వేరు జానర్లకు చెందిన మూవీస్. అయితే ఇవి రెండూ బాక్సాఫీస్ దుమ్ము దులిపాయి.
{{/usCountry}}కాంతార ఛాప్టర్ 1, లోకా ఛాప్టర్ 1.. ఈ సౌత్ ఇండియన్ మూవీస్ ఈ ఏడాది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంచలన విజయాలు సాధించాయి. కాంతార ఛాప్టర్ 1 ఓ ప్రీక్వెల్ కాగా.. లోకా ప్రాంఛైజీలో తొలి సినిమా. రెండూ పూర్తిగా వేర్వేరు జానర్లకు చెందిన మూవీస్. అయితే ఇవి రెండూ బాక్సాఫీస్ దుమ్ము దులిపాయి.
{{/usCountry}}ఈ రెండు సినిమాలూ తెలుగులోనూ థియేటర్లలో రిలీజై.. ఇక్కడా వసూళ్ల వర్షం కురిపించాయి. దీంతో ఈ రెండు మూవీస్ డిజిటల్ ప్రీమియర్ పై ఎంతగానో ఆసక్తి నెలకొంది. అయితే ఒకే రోజు ఇవి రెండూ రానుండటం మాత్రం సినిమా లవర్స్ కు ఓ పండగలాంటి వార్తే అని చెప్పొచ్చు.