...
...
Next Story

OTT Releases: ఇవాళ ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన సినిమాలు.. నెట్‌ఫ్లిక్స్ నుంచి సన్ నెక్స్ట్ వరకు.. అదిరే థ్రిల్లర్లు!

OTT Releases: ఓటీటీ లవర్స్ కు పండుగే! ఈ శుక్రవారం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కు అదిరిపోయే కొత్త కంటెంట్ వచ్చేసింది. డిఫరెంట్ జోనర్లలో థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు మూవీస్ రెడీ అయ్యాయి. మరి ఇవాళ ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఏవో ఓ లుక్కేయండి.

Published on: Aug 28, 2026, 08:37:13 IST
Advertisement

OTT Releases: డిజిటల్ వినోదాన్ని కోరుకునే ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి. ఫ్రైడేను ఫన్ డేగా మార్చేశాయి. వేర్వేరు భాషల సినిమాలు ఈ రోజు (ఆగస్టు 28) స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్, జియో హాట్‌స్టార్, ఆహా, సన్ నెక్స్ట్‌లలో అదరగొడుతున్న ఆ టాప్ సినిమాలు, సిరీస్‌ల పూర్తి వివరాలివే.

న్యూటన్స్ థర్డ్ లా (Netflix)

ఇవాళ ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన సినిమాలు.. నెట్‌ఫ్లిక్స్ నుంచి సన్ నెక్స్ట్ వరకు.. అదిరే థ్రిల్లర్లు!
ఇవాళ ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన సినిమాలు.. నెట్‌ఫ్లిక్స్ నుంచి సన్ నెక్స్ట్ వరకు.. అదిరే థ్రిల్లర్లు!

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లోకి 'న్యూటన్స్ థర్డ్ లా' (Newton's 3rd Law) మూవీ వచ్చేసింది. ఈటీవీ విన్ లోనూ రిలీజైంది. సుమంత హీరోగా నటించిన ఈ క్రైమ్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్స్ కు అదిరిపోయే ఎక్స్ పీరియన్స్ అందిస్తోంది.

తెలుగు ఒరిజినల్‌గా తెరకెక్కిన ఈ న్యూటన్స్ థర్డ్ లా చిత్రం.. ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఓటీటీలోకి వచ్చేసింది. సస్పెన్స్ డ్రామాను కోరుకునే వారికి ఈ సినిమా మంచి ఎంపికగా నిలవనుంది.

అన్బే డయానా (SonyLIV)

ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ (SonyLIV) లో 'అన్బే డయానా' (Anbe Diana) మూవీ ముందుగానే స్ట్రీమింగ్ వచ్చేసింది. రాత్రి నుంచి ఈ మూవీ ఓటీటీ లవర్స్ ను అలరిస్తోంది. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వంటి ఐదు ప్రధాన భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

హిందూ యువకుడు, క్రిస్టియన్ యువతి మధ్య ప్రేమ, పెళ్లి అనే స్టోరీతో ఈ అన్బే డయానా తెరకెక్కింది. చాలా కాలం తర్వాత సీనియర్ నటి రోజా ఈ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు.

హరుడు (Aha Video)

యూత్‌ఫుల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 'పార్ట్ టైమర్స్' (Part Timers) అనే తెలుగు వెబ్ సిరీస్ జియోహాట్‌స్టార్ (JioHotstar)లోకి వచ్చేసింది. ఇందులో బిగ్ బాస్ రన్నరప్ తనూజ పుట్టస్వామి ఓ లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ సిరీస్ తో ఆమె ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది.

ఆల్ఫా (Netflix)

హిందీలో రూపొందిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' (ALPHA). ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైంది. ఆలియా భట్, శర్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు ఈ మూవీలో నటించారు. యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ తెరకెక్కింది.

అంకం అట్టహాసం (Sun NXT)

తీవ్రమైన పగ, ప్రతీకారాల నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ క్రైమ్ డ్రామా 'అంకం అట్టహాసం' (Ankam Attahasam) కూడా ఓటీటీ డెబ్యూ చేసింది. సన్ నెక్స్ట్ (Sun NXT) ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks