...
...
Next Story

OTT: ఇటు ఓటీటీ.. అటు థియేటర్లు.. ఈ రెండు రోజుల్లో సినిమాలు, వెబ్ సిరీస్ జాతర.. మొత్తంగా 17.. తెలుగు ఆడియెన్స్‌కూ పండగే

OTT: ఇటు ఓటీటీ, అటు థియేటర్లలో ఈ వీకెండ్ సినిమాలు, వెబ్ సిరీస్ జాతర ఉండనుంది. రెండు రోజుల్లోనే ఏకంగా 17 సినిమాలు, సిరీస్ రానుండటం విశేషం. మరి అవేంటి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

Published on: Sep 24, 2026, 15:07:51 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT: ఈ రెండు రోజుల్లో అంటే సెప్టెంబర్ 24, 25 తేదీల్లో బాక్సాఫీస్ దగ్గర, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అసలైన జాతర షురూ కాబోతోంది. నాచురల్ స్టార్ నాని పవర్‌ఫుల్ పీరియాడిక్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్' థియేటర్లను షేక్ చేయడానికి వచ్చేయగా.. అటు హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ 'హార్ట్ ఆఫ్ ది బీస్ట్' సైతం బిగ్ స్క్రీన్ పై రచ్చ చేయడానికి రెడీ అయింది. దీనికి తోడు ఓటీటీల్లో ఏకంగా 13 కొత్త సినిమాలు, క్రేజీ వెబ్ సిరీస్‌లు డిజిటల్ లవర్స్‌ని అలరించేందుకు క్యూ కట్టాయి.

థియేటర్లు, ఓటీటీలో వీకెండ్ రచ్చ

OTT: ఇటు ఓటీటీ.. అటు థియేటర్లు.. ఈ రెండు రోజుల్లో సినిమాలు, వెబ్ సిరీస్ జాతర.. మొత్తంగా 17.. తెలుగు ఆడియెన్స్‌కూ పండగే
OTT: ఇటు ఓటీటీ.. అటు థియేటర్లు.. ఈ రెండు రోజుల్లో సినిమాలు, వెబ్ సిరీస్ జాతర.. మొత్తంగా 17.. తెలుగు ఆడియెన్స్‌కూ పండగే

- థియేటర్ రిలీజ్: ది ప్యారడైజ్

- హాలీవుడ్ రిలీజ్: హార్ట్ ఆఫ్ ద బీస్ట్ (బ్రాడ్ పిట్)

- థియేటర్లలోకి తమిళ మూవీ: డోరోతి (కీర్తి సురేష్, కార్తీక్ సుబ్బరాజ్)

- బాలీవుడ్ రిలీజ్: ది వన్: ఫోర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ (సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా)

- ఓటీటీ ప్లాట్‌ఫామ్స్: నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్

- టాప్ ఓటీటీ థ్రిల్లర్లు: షక్: ట్రస్ట్ నో వన్, హుంకార్, డెల్యూషన్, మ్యాంగో పచ్చ

- ఓటీటీలో మొత్తం రిలీజెస్: 13 సినిమాలు, వెబ్ సిరీస్

థియేటర్లలో నాని 'ది ప్యారడైజ్' హంగామా!

'దసరా' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల - నాచురల్ స్టార్ నాని కాంబోలో వచ్చిన 'ది ప్యారడైజ్' సినిమా సెప్టెంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో ల్యాండ్ అయింది. సీనియర్ నటుడు మోహన్ బాబు, సోనాలి కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాపై ఇండస్ట్రీలో ఊహించని అంచనాలు ఉన్నాయి.

అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఈ మూవీ విఫలమైనట్లు తొలి షో నుంచే పలువురు ప్రేక్షకులు రివ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ దారుణంగా ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు. నాని కెరీర్లోనే చెత్త సినిమా అంటూ మరికొందరు రివ్యూలు ఇవ్వడం గమనార్హం.

బిగ్ స్క్రీన్ పై హాలీవుడ్, కీర్తి సురేష్

ఇక సోషల్ మీడియా సెన్సేషన్ అంజలి అరోరా, దేవ్ శర్మ జంటగా నటించిన భక్తిరస చిత్రం 'మహాకావ్య శ్రీ రామాయణ కథ - శ్రీ రామ్ కి' కూడా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

మరోవైపు సెప్టెంబర్ 25న కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన 90ల నాటి రూరల్ బ్యాక్‌డ్రాప్ డ్రామా 'డోరోతీ' రిలీజ్ కానుంది. కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ కులం, హింస కాన్సెప్ట్‌తో వస్తోంది.

ఇక సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భటియా కాంబోలో వస్తున్న అడ్వెంచర్ ఫాంటసీ ఫిలిం 'ది వన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' కూడా సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది.

ఓటీటీలో 13 సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాతర

డిజిటల్ ఆడియన్స్ కోసం నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్ వేదికలుగా సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్లు క్యూ కట్టాయి. నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 24న పరిణీతి చోప్రా, జెన్నిఫర్ వింగెట్, తాహిర్ రాజ్ భసిన్ కాంబోలో 'షక్: ట్రస్ట్ నో వన్' మిస్టరీ సిరీస్ స్ట్రీమింగ్ అయింది. దీంతో పాటు సైకలాజికల్ డ్రామా 'డెల్యూజన్', డాక్టర్ క్యారెక్టర్ చుట్టూ తిరిగే హారర్ వెబ్ సిరీస్ 'మై సాడ్ డెడ్' కూడా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

జియోహాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 25న ఫాతిమా సనా షేక్, మహమ్మద్ జీషాన్ అయ్యూబ్ నటించిన ఇంటెన్స్ క్రైమ్ డ్రామా 'హుంకార్' రిలీజ్ కానుంది. ప్రముఖ కవి రామ్‌ధారీ సింగ్ దిన్‌కర్ కవితల స్ఫూర్తితో రూపొందిన ఈ సిరీస్ 17 ఏళ్ల అమ్మాయి కథ ఆధారంగా తెరకెక్కింది. అలాగే కన్నడ క్రైమ్ యాక్షన్ మూవీ 'మాంగో పచ్చ' కూడా ఇదే రోజు ల్యాండ్ అవుతోంది.

హాలీవుడ్ క్లాసిక్ లవర్స్ కోసం 'ది గాడ్‌ఫాదర్ కోడా', ఎఫ్‌బీఐ మిషన్ ఆధారంగా తెరకెక్కించిన 'యునాబాంబర్', స్పానిష్ మిస్టరీ థ్రిల్లర్ 'ది ఫైనల్ ప్రాబ్లెమ్' కూడా ఈ వీకెండ్ ఓటీటీ వాచ్‌లిస్ట్‌లో సిద్ధంగా ఉన్నాయి. వీకెండ్ వెకేషన్ ప్లాన్ చేసుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీస్ట్ అని చెప్పొచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks