OTT Today: ఒకే రోజు ఒకే ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాలు.. ఒకటి కోర్ట్ రూమ్ థ్రిల్లర్, మరొకటి యాక్షన్ డ్రామా

ఒకే ఓటీటీలోకి ఒకే రోజు రెండు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిలో ఒకటి కోర్ట్ రూమ్ థ్రిల్లర్ కాగా.. మరొకటి యాక్షన్ డ్రామా. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Published on: Mar 03, 2026 4:42 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీ తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఈరోజు అంటే మంగళవారం (మార్చి 3) సన్ నెక్ట్స్ ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాలు అడుగుపెట్టాయి. అందులో ఒకటి సుమారు ఏడాదిన్నర తర్వాత రావడం విశేషం. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాలేంటన్నది ఇక్కడ చూడండి.

OTT Today: ఒకే రోజు ఒకే ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాలు.. ఒకటి కోర్ట్ రూమ్ థ్రిల్లర్, మరొకటి యాక్షన్ డ్రామా
OTT Today: ఒకే రోజు ఒకే ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాలు.. ఒకటి కోర్ట్ రూమ్ థ్రిల్లర్, మరొకటి యాక్షన్ డ్రామా

సన్ నెక్ట్స్‌లో రెండు తెలుగు సినిమాలు

సన్ నెక్ట్స్ ఓటీటీలోకి ఒకే రోజు రెండు తెలుగు సినిమాలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే వెల్లడించింది. వీటిలో కోర్ట్ రూమ్ థ్రిల్లర్ వంచన, ఫ్యాక్షన్ ఆధారంగా రూపొందిన యాక్షన్ డ్రామా దేవగుడి మరొకటి. ఈ రెండు సినిమాల గురించి సన్ నెక్ట్స్ ట్వీట్ చేస్తూ.. “మీ నెక్ట్స్ బింజ్ వాచ్ ఇప్పుడే మొదలైంది. ఈ కొత్తగా వచ్చిన సినిమాలను సన్ నెక్ట్స్ లో ఇప్పుడే చూడండి” అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది.

వంచన మూవీ విశేషాలు

తెలుగులో వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ కోర్టు రూమ్ థ్రిల్లర్ వంచన. ఈ సినిమా నవంబర్ 8, 2024న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు సుమారు ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఐఎండీబీలో ఈ సినిమాకు 7.5 రేటింగ్ ఉంది. ఒక చర్చి ఫాదర్ దారుణ హత్యకు గురవడంతో ఈ వంచన మూవీ కథ ప్రారంభమవుతుంది.

ఆ హత్య కేసులో అనుమానితుడిగా అతని డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే ఆ డ్రైవర్ నిర్దోషి అని నమ్మిన యువ క్రిమినల్ లాయర్ కృష్ణ.. ఈ కేసును వాదించేందుకు సిద్ధమవుతాడు. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో లాయర్ కృష్ణకు ఎదురైన సవాళ్లు ఏంటి? అసలైన హంతకుడు ఎవరు? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా సాగుతుంది.

ఈ వంచన సినిమాకు ఉమా మహేష్ దర్శకత్వం వహించడమే కాకుండా, ప్రధాన పాత్రలోనూ నటించాడు. నటుడిగా అక్కడక్కడా తడబడినప్పటికీ, దర్శకుడిగా స్క్రీన్ ప్లే విషయంలో తన ప్రతిభను చాటుకున్నాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కోర్టు రూమ్ సీన్లు.. లాయర్, జడ్జి మధ్య జరిగే వాదోపవాదాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తక్కువ బడ్జెట్‌లో నిర్మించినప్పటికీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ సినిమాకు బలాన్నిచ్చాయి.

దేవగుడి మూవీ విశేషాలు

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా 'దేవగుడి'. బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పూర్తిగా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. ఒక శక్తివంతమైన ఫ్యాక్షన్ కుటుంబం, వారి ప్రత్యర్థుల మధ్య జరిగే పోరాటమే ఈ మూవీ ప్రధానాంశం.

వీరారెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన ధర్మ, ఆ కుటుంబాన్ని శత్రువుల నుండి ఎలా కాపాడాడు? రాఘవ రెడ్డితో ధర్మకు ఉన్న అనుబంధం ఎటువంటి మలుపులు తిరిగింది? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ కథను మలిచారు.

ఈ సినిమాలో అభినవ్ శౌర్య, తోషి అలహరి, అనుశ్రీ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు రఘు కుంచె గురించే. నటుడిగా మారిన అతడు ఈ మూవీలో ఒక కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు. రఘు కుంచె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ రొటీన్ ఫ్యాక్షన్ డ్రామాకు ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచాయని విమర్శకులు పేర్కొన్నారు.