OTT Trending: బ్లాక్ బస్టర్ మూవీ ఇరుముడి జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటు ఓటీటీలోనూ, అటు థియేటర్లలోనూ ఈ చిత్రం అదరగొడుతోంది. ఓటీటీలో ట్రెండింగ్ నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లిన ఇరుముడి సినిమా.. థియేటర్లకూ జనాలను రప్పిస్తోంది.
ఇరుముడి ఓటీటీ

థియేటర్లలో రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ ఇద్దరి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘ఇరుముడి’ ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. శుక్రవారం (సెప్టెంబర్ 18) ఈ చిత్రం ఓటీటీలో రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇరుముడి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇప్పుడీ మూవీ ట్రెండింగ్ నంబర్ వన్ ప్లేసుకు దూసుకెళ్లింది.
ఒక్క రోజులోనే
ఓటీటీలో ఇరుముడి హవా మామూలుగా లేదు. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత ఒక్క రోజులోనే ఇరుముడి ఇండియాలో నంబర్ వన్ మూవీగా ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. శనివారం రాత్రి వరకే ఈ సినిమా నంబర్ వన్ ప్లేస్ ను దక్కించుకుంది. జనాలు ఈ మూవీని ఎంతలా ఎగబడి చూస్తున్నారో చెప్పేందుకు ఇదే నిదర్శనం.
అన్ని భాషల్లోనూ
ఇరుముడి సినిమాలోని తండ్రీకూతుళ్ల అనుబంధం, అయ్యప్ప దీక్ష నేపథ్యం, గ్రామీణ వాతావరణంలో సాగే బలమైన భావోద్వేగాలు థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిపీట్ ఆడియన్స్ థియేటర్లకు రావడం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.
ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లో తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఆడియన్స్ ఈ మూవీని ఆదరిస్తున్నారు.
ఆ విమర్శలు
{{/usCountry}}ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లో తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఆడియన్స్ ఈ మూవీని ఆదరిస్తున్నారు.
ఆ విమర్శలు
{{/usCountry}}అయితే ఈ ఇరుముడి చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టిన వెంటనే సోషల్ మీడియాలో ఒక వర్గం నెటిజన్లు దీనిపై నెగెటివ్ ప్రచారానికి తెరలేపారు. థియేట్రికల్ నంబర్లు ఫేక్ అని, సినిమాకు ఊరికే ఎక్కువ హైప్ ఇచ్చారని, ఇదొక ఓవర్‌రేటెడ్ మూవీ అని కామెంట్లు చేస్తూ ట్రోల్ చేశారు. కానీ ఈ విమర్శలు, నెగెటివిటీని ఏమాత్రం లెక్కచేయకుండా 'ఇరుముడి' నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ చార్ట్స్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
బిగ్ స్క్రీన్లు పెట్టుకొని
ఇరుముడి మూవీని జనాలు బాగా ఓన్ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకొని మరీ థియేటర్లలో ఆదరించారు. అందుకే ఈ మూవీ ఏకంగా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలు ఈ మూవీపై ఆదరణ కురిపిస్తూనే ఉన్నారు.
ఇప్పుడు గణేషుడి మంటపాలు, ఊర్లోని కూడళ్లు, ప్రధాన ఏరియాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని మరీ జనాలు ఇరుముడిని కలిసి చూస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.