OTT Trending: ఒక్కో ఎపిసోడ్ ఒక్కో మిస్టరీ.. ఓటీటీలో ట్రెండింగ్ నంబర్ వన్.. క్రైమ్ థ్రిల్లర్ లవర్స్‌కు పండగే!
OTT Trending: తెలుగు ఓటీటీ లవర్స్ తప్పకుండా చూడాల్సిన సిరీస్ ఇది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అదరగొడుతోంది. ఓటీటీ రిలీజ్ అప్పటి నుంచే ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్ లతో అలరిస్తోంది.
ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ వెబ్ సిరీస్ లను ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. కానిస్టేబుల్ కనకం, నయనం లాంటి తెలుగు వెబ్ సిరీస్ లకు ఓటీటీలో ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పుడు అలాంటి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ ఓటీటీలో అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతోంది. ట్రెండింగ్ లో కొనసాగుతోంది ఈ సిరీస్.

విక్రమ్ ఆన్ డ్యూటీ ఓటీటీ
తెలుగు వెబ్ సిరీస్ ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ అదరగొడుతోంది. ఓటీటీ ట్రెండింగ్ లో నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అదిరే ట్విస్ట్ లు, ఉత్కంఠ రేపే మలుపులతో థ్రిల్ అందిస్తోంది. ఈ పాపులర్ వెబ్ సిరీస్ ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
అయిదు భాషల్లో
జియోహాట్‌స్టార్ ఒరిజినల్ వెబ్ సిరీస్ గా రిలీజ్ అయిన విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ మొత్తం అయిదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విక్రమ్ ఆన్ డ్యూటీ ఆడియన్స్ కు అందుబాటులో ఉంది. మార్చి 6న ఈ విక్రమ్ ఆన్ డ్యూటీ సిరీస్ జియోహాట్‌స్టార్‌లో రిలీజైంది.
ట్రెండింగ్ నం 1
విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ ఓటీటీలో ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఓటీటీలో రిలీజైనప్పటి నుంచి టాప్ ప్లేస్ లో ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ట్రెండ్ అవుతోంది. ఇందులో బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మలియక్కల్ హీరో. బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి కీలక పాత్ర పోషించింది. ఈ సిరీస్ కు బ్రహ్మ రుద్ర డైరెక్టర్.
క్రైమ్ థ్రిల్లర్
విక్రమ్ ఆన్ డ్యూటీ సిరీస్ పూర్తిగా క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. సస్పెన్స్, ట్విస్ట్ లతో ఈ సిరీస్ సాగుతోంది. ప్రస్తుతం 4 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ రిలీజ్ కానుంది. రియల్ క్రైమ్ ఇన్సిడెంట్ల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
పోలీస్ ఆఫీసర్ గా
విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ లో నిఖిల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. విక్రమ్ వాసు అనే క్యారెక్టర్ చేశాడు. నిర్భయ కేసు, డ్రమ్ములో మర్డర్ లాంటి రియల్ ఇన్సిడెంట్లను ఆధారంగా చేసుకుని ఎపిసోడ్లు తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక ఎపిసోడ్ లో ఒక క్రైమ్ కేసు సాల్వ్ చేయడం ఉంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్ లు మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












