...
...
Next Story

OTT Bold: ఓటీటీని ఊపేస్తున్న బోల్డ్ వెబ్ సిరీస్..నాలుగు డిఫరెంట్ ఎపిసోడ్లు..హాట్ తో పాటు హార్ట్ ను తాకేలా.. మీరు చూశారా?

OTT Bold: తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఓ బోల్డ్ సిరీస్ ను ఓటీటీని షేక్ చేస్తోంది. నాలుగు ఎపిసోడ్లతో ఉన్న ఈ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. హాట్ నెస్ మాత్రమే కాదు హార్ట్ టచ్ చేసే మెసేజ్ లతో ఈ సిరీస్ హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సిరీస్ ను మీరు చూశారా?

Published on: Jul 7, 2026, 13:34:57 IST
Advertisement

OTT Bold: ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా బోల్డ్ తో పాటు మెసేజ్ లు అందించే కంటెంట్ హిట్ అవుతుంది. ఇప్పుడదే ఫార్ములాను నిజం చేస్తూ ‘ష్ సీజన్ 3’ ఓటీటీలో అదరగొడుతోంది. ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది. ఈ బోల్డ్ వెబ్ సిరీస్ లో మంచి మెసేజ్ కూడా ఉంది.

ష్ సీజన్ 3

ఓటీటీని ఊపేస్తున్న బోల్డ్ వెబ్ సిరీస్..నాలుగు డిఫరెంట్ ఎపిసోడ్లు..హాట్ తో పాటు హార్ట్ ను తాకేలా (x/ahatamil)
ఓటీటీని ఊపేస్తున్న బోల్డ్ వెబ్ సిరీస్..నాలుగు డిఫరెంట్ ఎపిసోడ్లు..హాట్ తో పాటు హార్ట్ ను తాకేలా (x/ahatamil)

ఓటీటీలో రీజియనల్ బోల్డ్ సిరీస్ ల్లో ‘ష్’ సిరీస్ కు ఓ ప్రత్యేకత ఉంది. డిఫరెంట్ స్టోరీలతో ఆంథాలజీ సిరీస్ గా సాగే ష్ ఫ్రాంఛైజీ మంచి మెసేజ్ లను కూడా అందిస్తుంది. ఇప్పుడు ఈ సిరీస్ లోని మూడో సీజన్ కూడా అలాగే అదరగొడుతోంది. ఆహా వీడియో ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో ఈ ష్ సీజన్ 3 స్ట్రీమింగ్ అవుతోంది.

నాలుగు కథలు

ష్ సీజన్ 3 నాలుగు ఎపిసోడ్లు ఇప్పుడు ఆహా వీడియోలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ నాలుగు ఎపిసోడ్లు దేనికదే వేరుగా ఉంటుంది. ఈ సీజన్ లో కూడా లవ్, లస్ట్, కామం, బోల్డ్.. ఇలా కేవలం పెద్దవాళ్లకు మాత్రమే పరిమితమైన అంశాలే ఉన్నాయి. కానీ ఇందులోనూ ప్రతి ఎపిసోడ్ ను దేనికదే ప్రత్యేకంగా రెడీ చేశారు.

కొత్త ముఖాలు

ష్ సీజన్ 3లో గత సీజన్లతో పోలిస్తే కొత్త ముఖాలు కనిపిస్తాయి. బిగ్ బాస్ దివి, పూనమ్ బజ్వా, కిరణ్ రాథోడ్, దివ్య గణేషన్, తమిజ్వాని, శ్యామల్ తదితరులు ఇందులో నటించారు. ఓ వైపు సినిమాలు, మరో ఓటీటీ ఫిల్మ్స్ తో దూసుకుపోతున్న తెలుగు అమ్మాయి దివి ఈ సీజన్ లో తనదైన బోల్డ్ యాక్టింగ్ తో అదరగొట్టింది.

బోల్డ్ కంటెంట్ మాత్రమే కాదు

ఇక రెండో ఎపిసోడ్ లో నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఓ నైట్ ఔట్ ప్లాన్ చేస్తారు. ఇందులో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. ఈ రెండు జోడీలు ఏకాంతగా గడపాలని ప్లాన్ చేసుకుంటాయి. కానీ అంతలోనే పేరెంట్స్ వస్తారు. ఆ తర్వాత తమ పిల్లలపై పేరేంట్స్ పెట్టుకున్న నమ్మకం, నిజమైన ప్రేమ గురించి తెలిసొస్తుంది.

ఇక సినిమా హీరోయిన్ కోసం వేట కొనసాగించే డైరెక్టర్, రైడ్ లో కలిసే ఓ అమ్మాయితో సాగే మూడు, నాలుగు ఎపిసోడ్లు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe