ఈ దీపావళి వీకెండ్ ఓటీటీలో ఏం చూడాలా అని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు నుంచి కిష్కింధపురి, మలయాళం ఇండస్ట్రీ నుంచి మిరాజ్ (Mirage) లాంటివి డిజిటల్ జర్నీ స్టార్ట్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాయి. కన్నడ సినిమా నుంచి రొమాంటిక్ థ్రిల్లర్ ఎలుమలే వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కిష్కింధపురి నుంచి జీతూ జోసెఫ్ మిరాజ్ వరకు అక్టోబర్ మూడో వారంలో చూడదగ్గ లేటెస్ట్ తెలుగు, మలయాళం, కన్నడ సినిమాలేవో తెలుసుకోండి.
కిష్కింధపురి - జీ5 ఓటీటీ

అనుపమ పరమేశ్వరన్ కు ఈ వారం రెండు రిలీజ్ లు ఉన్నాయి. ఆమె మలయాళం సినిమా 'ది పెట్ డిటెక్టివ్' థియేటర్లలోకి వస్తుండగా, ఆమె తెలుగు సినిమా కిష్కింధపురి ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా జీ5 ఓటీటీలో శుక్రవారం (అక్టోబర్ 17) నుంచి స్ట్రీమింగ్ కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ హారర్ థ్రిల్లర్ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేశాడు.
ఆనందలహరి - ఆహా ఓటీటీ
ఆనందలహరి ఒక యంగ్ కపుల్ చుట్టూ తిరుగుతుంది. ఇదో కామెడీ వెబ్ సిరీస్. ఈస్ట్ గోదావరి అమ్మాయి, వెస్ట్ గోదావరి అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్ తో పాన్ గోదావరి అంటూ వస్తున్న సిరీస్ ఇది. ఆహా ఓటీటీలో శుక్రవారం (అక్టోబర్ 17) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో కొత్త వాళ్ళు లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు.
మిరాజ్ - సోనీలివ్ ఓటీటీ
దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన థ్రిల్లర్ సినిమా ఇది. సోనీ లివ్ ఓటీటీలోకి ఆదివారం (అక్టోబర్ 19) అడుగుపెడుతోంది. ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళీ లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ఇది. ఐఎండీబీలో 7కుపైగా రేటింగ్ ఉన్న ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఓటీటీలోకి దీనికి మరింత మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.
అభ్యంతర కుట్టావాలి - జీ5 ఓటీటీ
ఆసిఫ్ అలీ నటించిన మరో మలయాళం మూవీ అభ్యంతర కుట్టావాలి. ఈ సినిమా జీ5 ఓటీటీలోకి శుక్రవారం (అక్టోబర్ 17) వస్తోంది. ఆసిఫ్ అలీ లీడ్ చేసిన ఈ సినిమా.. చట్టాలు మగవాళ్లను బాధితులుగా మారుస్తున్నాయని మేకర్స్ ఓ భిన్నమైన దృక్పథాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఇంబమ్ - సన్ నెక్స్ట్
{{/usCountry}}ఆసిఫ్ అలీ నటించిన మరో మలయాళం మూవీ అభ్యంతర కుట్టావాలి. ఈ సినిమా జీ5 ఓటీటీలోకి శుక్రవారం (అక్టోబర్ 17) వస్తోంది. ఆసిఫ్ అలీ లీడ్ చేసిన ఈ సినిమా.. చట్టాలు మగవాళ్లను బాధితులుగా మారుస్తున్నాయని మేకర్స్ ఓ భిన్నమైన దృక్పథాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఇంబమ్ - సన్ నెక్స్ట్
{{/usCountry}}2023లో విడుదలైన ఈ మలయాళం సినిమా మొత్తానికి డిజిటల్ ప్రీమియర్ కానుంది. దీపక్ పరంబోల్ కార్టూనిస్ట్ నిధిన్ పాత్ర పోషించాడు. ఈ సినిమా శుక్రవారం (అక్టోబర్ 17) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. శ్రీజిత్ చంద్రన్ ఈ సినిమాను రాసి, డైరెక్ట్ చేశాడు.
ఎలుమలే - జీ5 ఓటీటీ
ఇదొక కన్నడ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. ఐఎండీబీలో ఏకంగా 9.2 రేటింగ్ ఉంది. పునీత్ రంగస్వామి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఓ క్యాబ్ డ్రైవర్, అతని లవర్ చుట్టూ తిరుగుతుంది. వాళ్లు అనుకోకుండా ఓ క్రైమ్ లో ఎలా ఇరుక్కుంటారన్నది ఇందులో చూడొచ్చు. శుక్రవారం (అక్టోబర్ 17) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
అందోందిట్టు కాలా - సన్ నెక్ట్స్ ఓటీటీ
కన్నడ రొమాంటిక్ డ్రామా అందోందిట్టు కాలా కూడా శుక్రవారం (అక్టోబర్ 17) సన్ నెక్ట్స్ ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమాకు కూడా ఐఎండీబీలో 9.2 రేటింగ్ నమోదైంది. ఓ ఫిల్మ్ మేకర్ కావాలని కలలు కనే ఓ యువకుడి చుట్టూ తిరిగే స్టోరీ ఇది.