...
...
Next Story

OTT Weekend: ఈ రెండు ఓటీటీల్లోనే వీకెండ్ 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్.. తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ కూడా..

OTT Weekend: అక్టోబర్ చివరి వీకెండ్ లో (అక్టోబర్ 28 నుంచి 30) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు నెట్‌ఫ్లిక్స్, సోనీలివ్ లలో సరికొత్త సినిమాలు, సిరీస్‌లు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమయ్యాయి. కీర్తి సురేష్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'అక్క' నుంచి విజయ్ సేతుపతి యాక్షన్ థ్రిల్లర్ 'బత్తా' వరకు లైనప్‌లో ఉన్నాయి.

Published on: Oct 28, 2026, 16:44:32 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Weekend: ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్ గ్రాండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లభించనుంది. కామెడీ, గ్యాంగ్‌స్టర్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్, వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్లతో ప్రముఖ డిజిటల్ స్పాట్‌లైట్ హబ్‌లు నెట్‌ఫ్లిక్స్, సోనీలివ్‌లు సిద్ధమయ్యాయి. అక్టోబర్ 28 నుంచి 30 మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ 5 బిగ్గెస్ట్ ఓటీటీ రిలీజ్‌ల పూర్తి వివరాలు ఇవే.

1. అక్క (Akka - Netflix Series) — అక్టోబర్ 30

OTT Weekend: ఈ రెండు ఓటీటీల్లోనే వీకెండ్ 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్.. తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ కూడా.. (Instagram / Netflix India)
OTT Weekend: ఈ రెండు ఓటీటీల్లోనే వీకెండ్ 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్.. తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ కూడా.. (Instagram / Netflix India)

నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్, విలక్షణ నటి రాధికా ఆప్టే కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'అక్క'. 1980ల నాటి 'పెర్నూరు' అనే ఊహాజనిత రాజ్యం నేపథ్యంలో వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సిరీస్‌తో ధర్మరాజ్ శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఇందులో కీర్తి సురేష్ 'భవాని'గా, రాధికా ఆప్టే 'రుద్ర'గా కనిపించనున్నారు. అధికారం, పగ, ప్రతీకారం, తమ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఇద్దరు పవర్‌ఫుల్ మహిళల మధ్య సాగే రక్తపాతం, హోరాహోరీ పోరాటం ఈ సిరీస్ ప్రధాన కథాంశం. తన్వి అజ్మీ, మహేష్ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

2. డిండోరా: సీజన్ 1 (Dhindora Season 1) — అక్టోబర్ 28

యూట్యూబ్ సెన్సేషన్, కామెడీ స్టార్ భువన్ బామ్ (Bhuvan Bam) నటించిన బ్లాక్‌బస్టర్ కామెడీ సిరీస్ 'డిండోరా'. ఒరిజినల్‌గా యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన ఈ షో మొదటి సీజన్ ఇప్పుడు అధికారికంగా నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టింది.

ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబంలో తండ్రి బబ్లూకు ఏకంగా రూ. 11 కోట్ల లాటరీ తగలడంతో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? ఆకస్మికంగా వచ్చిన కోట్ల రూపాయల సంపద వల్ల ఆ కుటుంబంలో ఎలాంటి హస్యస్పద పరిస్థితులు, గందరగోళాలు నెలకొన్నాయనేదే ఈ షో కథ. ఇందులో భువన్ బామ్ స్వయంగా పలు విభిన్న పాత్రలలో అలరించడం విశేషం.

3. బత్తా (Baththa - Vijay Sethupathi Film) — అక్టోబర్ 29

లిజోమోల్ జోస్, మాస్టర్ సాయి పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 29 నుంచి తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

4. మీఠే మే క్యా హై (Meethe Mein Kya Hai) —అక్టోబర్ 30

దీపావళి పండుగ వాతావరణంలో మనస్పర్ధలు ఉన్న ఒక కుటుంబం తిరిగి ఎలా ఒకటైంది అనే ఫీల్-గుడ్ ఎమోషనల్ కథాంశంతో రూపొందిన ఫ్యామిలీ డ్రామా 'మీఠే మే క్యా హై'. రిత్విక్ భౌమిక్, రోహిణి హట్టంగడి, అయేషా రజా మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కుటుంబ సమేతంగా వీక్షించడానికి నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 30 నుంచి అందుబాటులోకి రానుంది.

5. ఇమ్మోర్టల్ (Immortal - SonyLIV Film) — అక్టోబర్ 30

సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ (G.V. Prakash Kumar), కయాదు లోహర్ జంటగా నటించిన తమిళ రొమాంటిక్ మైథాలజికల్ హారర్ థ్రిల్లర్ 'ఇమ్మోర్టల్'. మరియప్పన్ చిన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పక్క ఇంట్లో ఉండే ఒక అందమైన యువతిపై ప్రేమ పెంచుకున్న కథానాయకుడి జీవితంలోకి ఎలాంటి భయంకరమైన ఆత్మలు, సూపర్‌నేచురల్ శక్తులు ప్రవేశించాయనేది ప్రధాన కథ. సీట్-ఎడ్జ్ హారర్ అనుభవాన్ని పంచే ఈ చిత్రం అక్టోబర్ 30 నుంచి సోనీలివ్ (SonyLIV) లో ప్రసారం కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks