క్రిస్మస్ వీకెండ్ (డిసెంబర్ 27-28) సందర్భంగా ఓటీటీలో సందడి చేయడానికి కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. హిందీలో బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు కొల్లగొట్టిన హర్షవర్ధన్ రాణే సినిమా 'ఏక్ దీవానే కి దీవానియత్', తమిళ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మిడిల్ క్లాస్', తెలుగు మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా సహా కన్నడ, మలయాళ సినిమాలు ఇందులో ఉన్నాయి.

ఈ వారం ఓటీటీలో రకరకాల జానర్స్ సందడి చేస్తున్నాయి. ఒకవైపు పిచ్చెక్కిించే ప్రేమకథ, మరోవైపు మిడిల్ క్లాస్ కష్టాలు, ఇంకోవైపు హారర్ థ్రిల్లర్స్.. ఇలా అన్నీ ఉన్నాయి. ఈ వీకెండ్ మీరు చూడదగ్గ టాప్ మూవీస్ ఇవే.
ఆంధ్రా కింగ్ తాలూకా - నెట్‌ఫ్లిక్స్
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా ఈవారం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాని ఈ సినిమాను ఓటీటీలో చూడాలనుకుంటే ఈ వీకెండ్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. హీరో కోసం పడిచచ్చే ఓ వీరాభిమాని చుట్టూ తిరిగే కథ ఇది.
ఏక్ దీవానే కి దీవానియత్ - జీ5 ఓటీటీ
మన తెలుగు ఆడియెన్స్‌కు సుపరిచితుడైన హర్షవర్ధన్ రాణే నటించిన ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. విమర్శకులు దీన్ని 'టాక్సిక్ లవ్ స్టోరీ' అని విమర్శించినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా దుమ్ములేపింది. ఏకంగా రూ. 100 కోట్లు వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. గ్లామర్ బ్యూటీ సోనమ్ బజ్వా హీరోయిన్‌గా నటించింది.
మిడిల్ క్లాస్ - జీ5 ఓటీటీ
జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఒక సామాన్యుడి కథ. భార్య, ఇద్దరు పిల్లలతో కష్టాలు పడే కార్ల్ మార్క్స్ అనే వ్యక్తికి అనుకోకుండా రూ. కోటి చెక్ దొరుకుతుంది. ఆ చెక్ వాళ్ళ కష్టాలు తీరుస్తుందా? లేక కొత్త తలనొప్పులు తెస్తుందా? మునీష్కాంత్, విజయలక్ష్మి జంటగా నటించిన ఈ సినిమాలో మధ్యతరగతి కష్టాలను నవ్విస్తూనే కళ్లకు కట్టారు.
ఐ యామ్ గాడ్ (కన్నడ) - సన్ నెక్ట్స్ ఓటీటీ
{{/usCountry}}జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఒక సామాన్యుడి కథ. భార్య, ఇద్దరు పిల్లలతో కష్టాలు పడే కార్ల్ మార్క్స్ అనే వ్యక్తికి అనుకోకుండా రూ. కోటి చెక్ దొరుకుతుంది. ఆ చెక్ వాళ్ళ కష్టాలు తీరుస్తుందా? లేక కొత్త తలనొప్పులు తెస్తుందా? మునీష్కాంత్, విజయలక్ష్మి జంటగా నటించిన ఈ సినిమాలో మధ్యతరగతి కష్టాలను నవ్విస్తూనే కళ్లకు కట్టారు.
ఐ యామ్ గాడ్ (కన్నడ) - సన్ నెక్ట్స్ ఓటీటీ
{{/usCountry}}ఇదొక డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. కాలేజీ టాపర్ దేవా, బిందుల ప్రేమకథ ఒకవైపు.. మరోవైపు ముసుగు వేసుకున్న ఓ హంతకుడు చేసే హత్యలు ఇంకోవైపు. ఈ రెండింటికీ లింక్ ఏంటి అన్నదే సస్పెన్స్. రవి గౌడ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థ్రిల్లర్ లవర్స్‌కి మంచి ఛాయిస్.
నిధియుమ్ భూతవుమ్ (మలయాళం) - సన్ నెక్ట్స్ ఓటీటీ
ఈ మూవీ టైటిల్ అర్థం 'నిధి, భూతం'. ముగ్గురు కుర్రాళ్లు తమ మెకానిక్ షాపును ఒక పాత భవనంలోకి మారుస్తారు. అక్కడ దెయ్యాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంటుంది. ఆ తర్వాత వాళ్ళకి ఎదురైన భయానక అనుభవాలే ఈ సినిమా. సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.