...
...
Next Story

ఈ వీకెండ్ ఓటీటీల్లో తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 8 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే

ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడటానికి మంచి మూవీస్ కోసం చూస్తుంటే ఇప్పుడు చెప్పబోయే 8 సినిమాలు మిస్ కావద్దు. ఇవి తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.

Published on: Nov 13, 2025, 15:08:33 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

నవంబర్ రెండో వారంలో ఓటీటీ ప్రేక్షకుల కోసం వివిధ రకాల కథాంశాలతో సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. జెన్-జెడ్ ప్రేమకథలు, సరోగసీ ట్విస్ట్‌తో కూడిన రొమాంటిక్ డ్రామా, దెయ్యాలున్న బంగ్లా కథ వంటి ఆసక్తికర కథనాలు ఈ జాబితాలో ఉన్నాయి. అవి కూడా తెలుగుతోపాటు వివిధ భాషలకు చెందినవి కావడం విశేషం. మరి వీటిలో చూడాల్సిన టాప్ 8 మూవీస్ గురించి తెలుసుకోండి.

కే-ర్యాంప్ - ఆహా వీడియో ఓటీటీ

ఈ వీకెండ్ ఓటీటీల్లో తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 8 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే
ఈ వీకెండ్ ఓటీటీల్లో తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 8 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే

కిరణ్ అబ్బవరం లీడ్ రోల్లో నటించిన మూవీ కే ర్యాంప్ శనివారం (నవంబర్ 15) నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. కుమార్ (కిరణ్ అబ్బవరం) చదువు కోసం కేరళకు వెళ్తాడు. అక్కడ అతను మెర్సీ (యుక్తి తరేజా)ని కలుస్తాడు. మెర్సీకి కుమార్ ఎలా సహాయం చేస్తాడనేది ప్రధాన కథ. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద బాగా నడిచింది.

తెలుసు కదా - నెట్‌ఫ్లిక్స్

సిద్దూ జొన్నలగడ్డ నటించిన ఈ తెలుసు కదా మూవీ శుక్రవారం (నవంబర్ 14) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. సరోగసీ మార్గాన్ని ఎంచుకున్న ఆధునిక జంట వరుణ్ (సిద్ధు జొన్నలగడ్డ), అంజలి (రాశీ ఖన్నా) చుట్టూ తిరిగే రొమాంటిక్ డ్రామా ఇది. సరోగసీ కోసం మధ్యలో వరుణ్ మాజీ ప్రేయసి ఎంట్రీ ఇచ్చి ఈ ప్రాసెస్ ను సంక్లిష్టం చేస్తుంది.

డ్యూడ్ - నెట్‌ఫ్లిక్స్

డ్యూడ్ మూవీ కూడా శుక్రవారమే నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది. చిన్ననాటి స్నేహితులు, కజిన్స్ అయిన ఇద్దరు వ్యక్తులు స్టార్టప్‌ను నిర్వహిస్తుంటారు. వారిలో ఒకరికి ప్రేమ చిగురిస్తుంది. కానీ మరొకరు దాన్ని తిరస్కరిస్తారు. తరువాత అతను తన నిజమైన ప్రేమను గుర్తిస్తాడు. కానీ అప్పటికే ఆలస్యమవుతుంది. ఇది పరువు హత్యల వంటి సామాజిక అంశాలను కూడా చర్చిస్తుంది. ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు నటించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది.

అవిహితం - జియోహాట్‌స్టార్

రిటైర్ అయిన ఒక మాజీ నేరస్తుడు (గాంగ్‌స్టర్ బాస్) కోడమజ సుని కథ ఇది. అతడి పాత గ్యాంగ్ సభ్యులపై దాడి జరిగినప్పుడు.. సుని తన సొంతూరికి తిరిగి రావాల్సి వస్తుంది. పాత శత్రువు ఎవరు? ఎందుకు దాడి చేస్తున్నారు? అనేది ఈ చిత్రం కథాంశం. ఈ మలయాళ మూవీ నవంబర్ 14 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇన్‌స్పెక్షన్ బంగ్లా - జీ5

ఇదొక మలయాళ హారర్ కామెడీ వెబ్ సిరీస్. ఒక పాడుబడిన, దెయ్యాలున్నాయని గ్రామస్తులు భయపడే ప్రభుత్వ బంగ్లాకు పోలీస్ స్టేషన్‌ను మార్చమని స్థానిక పోలీసులను ఆదేశాలు వస్తాయి. SHO విష్ణు నేతృత్వంలోని ఈ పోలీసులు ఆ బంగ్లాలోని ఆత్మల కథను కనుగొనే ప్రయత్నం చేస్తారు.

ఎక్క - సన్ నెక్స్ట్

కన్నడ మూవీ ఎక్క (Ekka) గురువారం (నవంబర్ 14) సన్ నెక్ట్స్ ఓటీటీలోకి వచ్చేసింది. తన ఇంటిని తిరిగి పొందడానికి బెంగళూరుకు వెళ్లిన గ్రామీణ యువకుడు ముత్తు (యువ రాజ్‌కుమార్) కథ ఇది. కనిపించకుండా పోయిన తన స్నేహితుడిని వెతుక్కుంటూ వెళ్లిన అతను.. అనుకోకుండా ఒక గ్యాంగ్‌లో చిక్కుకుపోయి, తన జీవితాన్ని తలకిందులు చేసుకుంటాడు.

జాలీ ఎల్ఎల్‌బీ 3 - నెట్‌ఫ్లిక్స్

హిందీ సూపర్ హిట్ లీగల్ కామెడీ మూవీ జాలీ ఎల్ఎల్‌బీ 3 కూడా శుక్రవారం నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది. అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ఇది. బాక్సాఫీస్ దగ్గర రూ.170 కోట్లు వసూలు చేసింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks