Padma Awards 2026: దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల (Padma Awards) ప్రదానోత్సవం మంగళవారం (జూన్ 23) సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో నిర్వహించిన రెండవ సివిల్ ఇన్వెస్టిచర్ వేడుకలో సినీ, సంగీత, నాటక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు.

ఈ ప్రతిష్టాత్మక వేడుకలో మలయాళ లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి, ప్రముఖ సింగర్ అల్కా యాగ్నిక్ పద్మభూషణ్ అందుకోగా.. వర్సటైల్ యాక్టర్ ఆర్ మాధవన్ పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు.
పద్మభూషణ్‌తో మెరిసిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి
74 ఏళ్ల మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి విశిష్ట ప్రముఖుల సమక్షంలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. మమ్ముట్టి అవార్డు స్వీకరిస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఆయన కుమారుడు, పాన్ ఇండియా నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఎంతో గర్వంగా చప్పట్లు కొడుతూ తండ్రిని ఎంకరేజ్ చేయడం వేడుకలోనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
మలయాళ చిత్ర పరిశ్రమలో 400 కంటే ఎక్కువ సినిమాల్లో నటించి లెజెండ్ గా ఎదిగిన మమ్ముట్టి.. ఇప్పటివరకు మూడు సార్లు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. 1989 లో 'ఓరు వడక్కన్ వీరగథ', 'మతిలుకల్' చిత్రాలకు గాను ఆయన మొదటి నేషనల్ అవార్డు అందుకోగా.. ఆ తర్వాత 'విధేయన్', 'పొంతన్ మాద' సినిమాలకు రెండోసారి విజేతగా నిలిచారు. 1999 లో బి.ఆర్. అంబేద్కర్ బయోపిక్ 'డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్' లో ఆయన చేసిన అద్భుత నటనకు మూడవసారి జాతీయ అవార్డు దక్కింది.
సింగర్ అల్కా యాగ్నిక్‌కు పద్మభూషణ్ గౌరవం
భారతీయ సంగీత ప్రపంచంలో తన మధురమైన గొంతుతో దశాబ్దాల పాటు అలరించిన సీనియర్ గాయని అల్కా యాగ్నిక్ (Alka Yagnik) పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. బాలీవుడ్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ సాంగ్స్ పాడిన ఆమె ఖాతాలో.. 'ఖల్నాయక్' లోని చోలి కే పీచే, 'దడ్కన్' లోని దిల్ నే యే కహా హై దిల్ సే, 'హమ్ తుమ్' టైటిల్ ట్రాక్, 'కుచ్ కుచ్ హోతా హై' వంటి ఎవర్ గ్రీన్ మెలోడీస్ ఉన్నాయి.
మాధవన్‌కు పద్మశ్రీ పురస్కారం
{{/usCountry}}భారతీయ సంగీత ప్రపంచంలో తన మధురమైన గొంతుతో దశాబ్దాల పాటు అలరించిన సీనియర్ గాయని అల్కా యాగ్నిక్ (Alka Yagnik) పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. బాలీవుడ్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ సాంగ్స్ పాడిన ఆమె ఖాతాలో.. 'ఖల్నాయక్' లోని చోలి కే పీచే, 'దడ్కన్' లోని దిల్ నే యే కహా హై దిల్ సే, 'హమ్ తుమ్' టైటిల్ ట్రాక్, 'కుచ్ కుచ్ హోతా హై' వంటి ఎవర్ గ్రీన్ మెలోడీస్ ఉన్నాయి.
మాధవన్‌కు పద్మశ్రీ పురస్కారం
{{/usCountry}}టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితుడైన స్టార్, ధురంధర్ మూవీ యాక్టర్ ఆర్ మాధవన్ (R Madhavan) రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకునే సమయంలో ఎంతో ఎమోషనల్ గా కనిపించారు. ఈ వేడుకకు ఆయన భార్య సరిత, కుమారుడు వేదాంత్ కూడా హాజరయ్యారు. మాధవన్ స్టేజ్ పైకి వెళ్లగానే భార్యాకొడుకులు ఇద్దరూ లేచి నిలబడి సంతోషంతో చప్పట్లు కొట్టారు. అవార్డు అందుకున్న అనంతరం మాధవన్ పీఎం నరేంద్ర మోదీని కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
ఈ పురస్కారంపై మాధవన్ స్పందిస్తూ.. "దీన్ని నేను కేవలం ఒక అవార్డులా కాకుండా సమాజం పట్ల నాకున్న బాధ్యతగా భావిస్తున్నాను. ఈ గౌరవాన్ని ఎంతో నిబద్ధతతో, వినయంతో కాపాడుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను. ఈ గుర్తింపునకు నా హృదయం కృతజ్ఞతలతో నిండిపోయింది" అని ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.
తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన మాధవన్.. రీసెంట్ గా రణవీర్ సింగ్ గ్లోబల్ బ్లాక్‌బస్టర్ యాక్షన్ మూవీ 'ధురంధర్: ది రివెంజ్' లో పవర్‌ఫుల్ రోల్ లో కనిపించారు. ఆయన మొదటిసారి లాంచ్ చేసిన డైరెక్టోరియల్ డెబ్యూ 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' చిత్రానికి గాను బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా జాతీయ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.
కాగా ఈ ఏడాది మొత్తం 131 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా.. అందులో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. మొదటి విడత ప్రదానోత్సవ వేడుక మే 25న జరిగింది.