...
...
Next Story

ధర్మేంద్రకు పద్మ విభూషణ్-మమ్ముట్టికి పద్మభూషణ్-రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్ లకు పద్మశ్రీ

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్రకు మరణానంతరం భారత దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ దక్కింది. మమ్ముట్టి పద్మభూషణ్ కు ఎంపికయ్యాడు. తెలుగు నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్ పద్మశ్రీలు అందుకోనున్నారు.

Published on: Jan 25, 2026, 19:16:44 IST
Advertisement

2026 పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాబితాలో 19 మంది మహిళా పురస్కార గ్రహీతలు, ఆరుగురు విదేశీయులు లేదా భారతీయ సంతతికి చెందినవారు, 16 మంది మరణానంతరం పురస్కారాలు అందుకున్నారు ఉన్నారు. ఈ అవార్డులు కళ, ప్రజా వ్యవహారాలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సైన్స్, ఇంజనీరింగ్, సామాజిక సేవ, సివిల్ సర్వీస్, వాణిజ్యం పరిశ్రమ వంటి విభిన్న రంగాల్లో సేవలు చేసిన వాళ్లకు దక్కాయి.

ధర్మేంద్రకు పద్మ విభూషణ్

ధర్మేంద్రకు పద్మవిభూషణ్, ధర్మేంద్రకు పద్మ భూషణ్
ధర్మేంద్రకు పద్మవిభూషణ్, ధర్మేంద్రకు పద్మ భూషణ్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్రకు పద్మ విభూషణ్ దక్కింది. మరణానంతరం ఆయనకు ఈ పురస్కారం లభించింది. గతేడాది చివర్లో ధర్మేంద్ర అనారోగ్యం కన్నుమూసిన సంగతి తెలిసిందే. మరోవైపు మలయాళ స్టార్ మమ్ముట్టిని పద్మభూషణ్ పురస్కారం వరించింది.

భారతీయ సినిమా, సంగీతానికి చేసిన సేవలకు గాను సీనియర్ నటుడు ధర్మేంద్ర, దిగ్గజ ప్లేబ్యాక్ సింగర్ అల్కా యాగ్నిక్, మలయాళ సినిమా దిగ్గజం మమ్ముట్టి, బెంగాలీ సినీ ఐకాన్ ప్రొసెన్‌జిత్ ఛటర్జీ, నటుడు ఆర్. మాధవన్, అనిల్ కె. రస్తోగి వంటి ప్రముఖులు 2026 పద్మ అవార్డుల కార్యక్రమంలో పద్మ పురస్కారాలు అందుకోనున్నారు.

తెలుగు నటులు

తెలుగు నటుల్లో రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్ కు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. ఆదివారం కేంద్రం 2026 సంవత్సరానికి పద్మ అవార్డులను ప్రకటించింది, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ విభాగాలలో 131 పౌర పురస్కారాలకు ఆమోదం తెలిపింది. ఈ జాబితాలో ప్రజా జీవితం, కళలు, సినిమా, సాహిత్యం, క్రీడలు, ప్రజా వ్యవహారాల రంగాల నుండి అనేక ప్రముఖ పేర్లు ఉన్నాయి. ఈ ఏడాది ఐదు పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe