మరణానికి కొన్ని నెలల ముందు.. భార్య హేమా మాలినితో సూపర్ హిట్ సాంగ్ కు ధర్మేంద్ర డ్యాన్స్.. వీడియో వైరల్

బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర 2025 నవంబర్ లో కన్నుమూశారు. అయితే మరణానికి కొన్ని నెలల ముందు భార్య హేమా మాలినితో కలిసి సూపర్ హిట్ సాంగ్ కు ఆయన డ్యాన్స్ చేసిన వీడియో తెగ వైరల్ గా మారింది. 

Published on: Jan 21, 2026, 06:06:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్​కు ఎంతో ప్రియమైన జంట ధర్మేంద్ర, హేమా మాలిని. వీరిద్దరూ తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ అభిమానులను కట్టిపడేశారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి 1991లో వచ్చిన 'ఆస్ పాస్' చిత్రంలోని 'దరియా మే ఫేంక్ దో చాబీ' పాటకు డ్యాన్స్ చేసిన అరుదైన వీడియో నెట్టింట్లో వైరల్​ అవుతోంది. అభిమానులకు ఇది అమితానందాన్నిస్తోంది.

భార్య హేమ మాలినితో ధర్మేంద్ర
భార్య హేమ మాలినితో ధర్మేంద్ర

ధర్మేంద్ర మరణానికి ముందు

ఆర్​జే అనిరుధ్​ ఇటీవల ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో హేమా మాలిని, ధర్మేంద్ర ఒకే రంగు (ఊదా) దుస్తుల్లో, పాటను ఎంతో ఉత్సాహంగా ఆస్వాదిస్తూ కనిపించారు. ధర్మేంద్ర మరణించడానికి కేవలం నాలుగు నెలల ముందు ఈ వీడియో తీసినట్లు అనిరుధ్​ తెలిపారు. ధర్మేంద్ర నవంబర్ 24, 2025న కన్నుమూశారు. ఈ వీడియోలో కూర్చుని ఉన్న హేమా మాలిని, ధర్మేంద్ర పాటకు కాళ్లను కదిపారు.

కెనడా కాన్సర్ట్ కోసం

తన కెనడా కాన్సర్ట్ పర్యటన కోసం ధర్మేంద్ర ఆశీర్వాదం తీసుకోవడానికి అనిరుధ్ వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆయన తన క్యాప్షన్‌లో.. 'హలో హాయ్ ఆయె హాయ్.. డ్రీమ్ గర్ల్స్ డ్రీమ్ రన్ కచేరీ డైరీస్! 'తుమ్ జో చలే గయే తో హోగి బడి ఖరాబీ.. ఈ మాటలు ధర్మజీకి ఎంత సరైనవో! హేమా మాలిని జీ, ధర్మేంద్ర జీ లతో మర్చిపోలేని క్షణాలు. మేము కలిసి 'ఆస్ పాస్' చిత్రంలోని సూపర్​హిట్ పాట 'దరియా మే ఫేంక్ దో చాబీ' పాడాము! ఈ భావోద్వేగ సంగీత సమావేశం ధర్మాజీ మరణించడానికి 4 నెలల ముందు జరిగింది’’ అని అనిరుధ్ రాసుకొచ్చాడు.

బ్లాక్ బస్టర్ చిత్రాలు

‘‘నా కెనడా కచేరీ పర్యటన కోసం,హేమాజీతో బుక్​ చేసుకోవడానికి ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇది జరిగింది! అప్పుడు ఎవరికి తెలుసు, అది ఆయనతో చివరి కలయిక అవుతుందని! హేమాజీ ధర్మేంద్రజీతో కలిసి నటించిన 'షోలే', 'సీతా ఔర్ గీతా', 'ది బర్నింగ్ ట్రైన్', 'అలీబాబా ఔర్ 40 చోర్', 'రాజా జానీ', 'నయా జమానా' వంటి అన్ని బ్లాక్​బస్టర్​ చిత్రాల గురించిన అద్భుతమైన కబుర్లను పంచుకున్నారు’’ అని అనిరుధ్ రాశారు.

‘‘'డ్రీమ్ గర్ల్' హేమా మాలిని జీతో కలిసి చారిత్రాత్మక కచేరీ పర్యటనను సహ-నిర్మాణం చేయడానికి, హోస్ట్​ చేయడానికి, రాయడానికి, దర్శకత్వం వహించడానికి ఎంతో గౌరవంగా ఉంది. 'ది డ్రీమ్ గర్ల్'స్ డ్రీమ్ రన్ కచేరీ' హేమా మాలినితో! హేమా మాలిని కథ, హేమా మాలిని మాటల్లో. లెజెండరీ ధర్మేంద్ర జీకి ప్రత్యేక నివాళితో. మార్చి నుంచి, కెనడాలో ప్రారంభం! మార్చి 21న టొరంటోలో. మార్చి 29న వాంకోవర్​లో!" అని అనిరుధ్ పోస్ట్ ఎండ్ చేశాడు.

ఫ్యాన్స్ రియాక్షన్

ఈ వీడియో చూసిన అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ఒక అభిమాని, 'అత్యంత మధురమైన జ్ఞాపకాలు' అని కామెంట్​ చేశారు. మరొకరు, 'ధర్మేంద్ర జీ, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం' అని రాశారు. ఇంకొకరు, 'వారి సంతోషకరమైన ముఖాలు వెలకట్టలేనివి' అని అన్నారు. మరో అభిమాని, 'ఆస్ పాస్ నాకెంతో ఇష్టమైన సినిమా, బాలీవుడ్​లో నా ఎప్పటికీ ఇష్టమైన జంట' అని పేర్కొన్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More