...
...
Next Story

Pallaburusu OTT: సడెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన ప‌ళ్ల‌బురుసు-ఇవాళే ఓటీటీలోకి-20 రోజుల్లోనే స్ట్రీమింగ్‌-బ్ర‌ష్ కొనివ్వ‌లేద‌ని!

Pallaburusu OTT: తెలుగులో వాస్తవ కథలతో, నేచురాలిటీకి దగ్గరగా ఉండే స్టోరీలతో తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఇలాంటి రూటెడ్ స్టోరీతో వచ్చిన సినిమానే ‘పళ్లబురుసు’. ఈ చిత్రం 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చి సర్ ప్రైజ్ చేసింది. పూర్తి ఓటీటీ వివరాలపై లుక్కేయండి.

Published on: Sep 2, 2026, 10:29:18 IST
Advertisement

Pallaburusu OTT: తెలుగు ఓటీటీ లవర్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ వచ్చేసింది. ఎవరూ ఊహించని విధంగా లేటెస్ట్ తెలుగు మూవీ ‘పళ్లబురుసు’ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోపే మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అక్కినేని నాగార్జున మెచ్చిన ఈ మూవీ ఓటీటీ అప్డేట్ వైరల్ గా మారింది.

పళ్లబురుసు మూవీ

సడెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన ప‌ళ్ల‌బురుసు-ఇవాళే ఓటీటీలోకి-20 రోజుల్లోనే స్ట్రీమింగ్‌-బ్ర‌ష్ కొనివ్వ‌లేద‌ని!
సడెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన ప‌ళ్ల‌బురుసు-ఇవాళే ఓటీటీలోకి-20 రోజుల్లోనే స్ట్రీమింగ్‌-బ్ర‌ష్ కొనివ్వ‌లేద‌ని!

ఇటీవల తెలుగు సినిమాల్లో రూటెడ్ స్టోరీస్ కు జనాలు జై కొడుతున్నారు. అదే సమయంలో తెలంగాణ పల్లెల్లోని జీవితాలు, అనుబంధాలు, సహజ కథలు వెండితెరపై వెలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి రూటెడ్ స్టోరీతో వచ్చిన సినిమానే ‘పళ్లబురుసు’. టూత్ బ్రష్ ను తెలంగాణలో పళ్లబురుసు అని పిలుస్తారు.

నాగార్జున మెచ్చిన మూవీ

పళ్లబురుసు సినిమాకు ఇంత పాపులారిటీ రావడం వెనుక ప్రధాన కారణం ఉంది. అక్కినేని నాగార్జునకు ఈ స్టోరీ చాలా బాగా నచ్చింది. అందుకే అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై ఈ సినిమాను థియేటర్లకు తీసుకొచ్చారు. అయితే థియేటర్లో మాత్రం ఊహించిన రిజల్ట్ రాలేదు.

పళ్లబురుసు ఓటీటీ

ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైన పళ్లబురుసు మూవీ 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 2) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాతు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ పళ్లబురుసు మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

కథ ఏమిటంటే?

మన చుట్టూ ఉండే మనుషులు మధ్య జరిగే కథనే పళ్లబురుసు సినిమా. తెలంగాణలోని ఓ ఊర్లో శంభు అనే ముసలాయన ఉంటాడు. అతనికి పంటి నొప్పి వస్తుంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే మందులు ఇస్తాడు. అయితే వేపపుల్లతో కాకుండా టూత్ బ్రష్ తో బ్రష్ చేసుకోమని చెప్తాడు. దీంతో కొడుకు తిరుపతిని పళ్లబురుసు కొనివ్వమని ఆ తండ్రి అడుగుతాడు.

పళ్లబురుసు సినిమాలో ఎంతో టాలెంట్ ఉన్న సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ నటించారు. వీళ్లతో పాటు గోమతి, ప్రజ్వల్ యాద్మ, అంజి మామ, సుజాత, రమేశ్ తదితరులు సినిమాలో పాత్రలు పోషించారు. ఈ పళ్లబురుసు మూవీని ఉదయ్ చౌహాన్ తెరకెక్కించాడు. లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ కావాలనుకునేవాళ్లకు పళ్లబురుసు ఓటీటీలో మంచి ఆప్షన్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks