...
...
Next Story

OTT Crime Thriller: ఆ చేతులు ఎవరివి? ఒకే రోజు మూడు హత్యలు.. ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్

OTT Crime Thriller: ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓ అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రాబోతుంది. నెక్ట్స్ లెవల్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ తో సిరీస్ పై హైప్ మరింత పెరిగింది.

Published on: Sep 6, 2026, 14:54:45 IST
Advertisement

OTT Crime Thriller: ఓటీటీలో కొత్త కంటెంట్ కు కొదవే ఉండదు. డిఫరెంట్ స్టోరీలు, వేర్వేరు జోనర్లలతో కొత్త సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఓ కొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అదే.. ‘పంచనామా’ సిరీస్. తాజాగా దీని ట్రైలర్ రిలీజైంది.

పంచనామా ఓటీటీ

ఆ చేతులు ఎవరివి? ఒకే రోజు మూడు హత్యలు.. ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్
ఆ చేతులు ఎవరివి? ఒకే రోజు మూడు హత్యలు.. ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్

ఓటీటీలోకి తెలుగు క్రైమ్ మిస్టర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ ‘పంచనామా’ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. సెప్టెంబర్ 11 నుంచి ఈ సిరీస్ జీ5 ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సిరీస్ ను మూడు హత్యల ఇన్వెస్టిగేషన్ సిరీస్ గా తెరకెక్కించినట్లు దీని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

ట్రైలర్ వైరల్

క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పంచనామా ట్రైలర్ ను మేకర్స్ ఇవాళ (సెప్టెంబర్ 6)న రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ తో ఈ తెలుగు వెబ్ సిరీస్ పై హైప్ మరింత పెరిగింది. ఇందులో ‘ప్రేమిస్తే’ భరత్ హీరోగా నటించాడు. ‘‘ఈ మిస్టీరియస్ మర్డర్స్ వెనుక ఎవరి చేతులు ఉన్నాయి? సెప్టెంబర్ 11 న పంచనామా సిరీస్ జీ5 తెలుగులో స్ట్రీమింగ్ కానుంది’’ అని జీ5 తెలుగు ఓటీటీ ఎక్స్ లో పోస్టు చేసింది. ఆదివారం రిలీజైన ఈ ట్రైలర్ అదిరిపోయింది.

ఆ చేతులు ఎవరివో?

ట్రైలర్ లోని సీన్స్ ఇంటెన్సివ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ముగ్గురు కాలేజీ ఫ్రెండ్స్ చనిపోతారు. అయితే ఇవి హత్యలు అనే అనుమానంతో పోలీసులు ఎంక్వైరీ కొనసాగిస్తారు. ఆ సమయంలోనే ఓ రెండు చేతులు పోలీసులకు దొరుకుతాయి. అసలు ఆ చేతులు ఎవరివి? వాటికి, మూడు హత్యలకు సంబంధం ఏంటీ? అనేది ఈ పంచనామా సిరీస్ లో చూడాల్సిందే.

ఉదయభాను ప్రొడక్షన్

సెప్టెంబర్ 11న ఈ పంచనామా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరి ఈ సిరీస్ లోని ట్విస్ట్ లు ఏంటీ? థ్రిల్ ఏ మేరకు ఉండబోతుందో? వేచి చూడాల్సిందే. క్రైమ్, ఇన్వెస్టిగేటివ్, మిస్టరీ థ్రిల్లర్లను చూడాలనుకునే వాళ్లకు ఈ పంచనామా సిరీస్ పర్ఫెక్ట్ వాచ్ కానుందని చెప్పొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks