...
...
Next Story

OTT Thriller: ఓటీటీలోకి ఉదయభాను కొత్త క్రైమ్ థ్రిల్లర్.. ప్రేమిస్తే భరత్ హీరో.. డైరెక్ట్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Thriller: ఓటీటీలోకి ఓ అదిరిపోయే తెలుగు థ్రిల్లర్ సినిమా రాబోతుంది. ఉదయభాను, భరత్ నివాస్, మేధ ప్రధాన కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది. ఓటీటీ లవర్స్ కు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు ఈ మూవీ రాబోతుంది.

Published on: Aug 29, 2026, 17:35:15 IST
Advertisement

OTT Thriller: తెలుగు ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓ మూవీ డైరెక్ట్ గా స్ట్రీమింగ్ కు రాబోతుంది. డిజిటల్ వీక్షకుల కోసం మరో ఆసక్తికరమైన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిద్ధమైంది. భరత్ నివాస్, ఉదయభాను, మేధ ముఖ్య పాత్రల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'పంచనామా' (Panchanama) నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. థియేట్రికల్ విడుదల లేకుండానే ఈ చిత్రాన్ని నేరుగా డిజిటల్ వేదికపైకి తీసుకొస్తున్నారు.

క్రైమ్ థ్రిల్లర్

ఓటీటీలోకి ఉదయభాను కొత్త క్రైమ్ థ్రిల్లర్.. ప్రేమిస్తే భరత్ హీరో.. డైరెక్ట్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? (x/ZEE5Telugu)
ఓటీటీలోకి ఉదయభాను కొత్త క్రైమ్ థ్రిల్లర్.. ప్రేమిస్తే భరత్ హీరో.. డైరెక్ట్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? (x/ZEE5Telugu)

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సస్పెన్స్ తో సాగుతూ ఈ తరహా సినిమాలు, సిరీస్ లు ఉత్కంఠ కలిగిస్తాయి. ఇప్పుడు అలాంటి ఎలిమెంట్లతోనే రెడీ అయిన మూవీ ‘పంచనామా’. ఈ క్రైమ్ థ్రిల్లర్ డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తుండటం విశేషం.

జీ5లో స్ట్రీమింగ్

ఈ క్రైమ్ థ్రిల్లర్ పంచనామా సినిమాను జీ5 ఓటీటీ ఒరిజినల్ మూవీగా తెరకెక్కించింది. 2026 సెప్టెంబర్ 11 నుంచి ఈ చిత్రం జీ5 వేదికగా ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు భాషలోనే ఈ చిత్రం వీక్షకులకు అందుబాటులోకి రానుంది.

‘‘సెప్టెంబర్ 11న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కానుంది. పంచనామా సినిమా సెప్టెంబర్ 11న కేవలం జీ5 తెలుగులో మాత్రం స్ట్రీమింగ్ అవుతుంది’’ అని జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. ఈ అనౌన్స్ మెంట్ వీడియో వైరల్ గా మారింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ కోసం వెయిట్ చేస్తున్నట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

స్టోరీ ఏంటంటే?

ఈ పంచనామా సినిమాలో ‘ప్రేమిస్తే’ భరత్ నివాస్ హీరోగా నటించాడు. అతను తనదైన శైలి నటనతో ఆకట్టుకోనుండగా, సుదీర్ఘ విరామం తర్వాత ఉదయభాను ఒక బలమైన పాత్రలో కనిపించనుండటం విశేషం. మేధ హీరోయిన్ గా అలరించనుంది.

నేర పరిశోధన నేపథ్యంతో వచ్చే సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు 'పంచనామా' ఒక మంచి సస్పెన్స్ అనుభూతిని అందిస్తుందని చిత్ర నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచి ట్విస్ట్ లతో ఈ మూవీ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe