...
...
Next Story

OTT Telugu: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ డ్రామా.. పెళ్లయిన మూడు రోజులకే భార్య పంచాయితీ.. ఇక్కడ చూసేయండి

OTT Telugu: ఇప్పటికే ఓ ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు కామెడీ డ్రామా.. ఇప్పుడు మరో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది. నవ్వుల విందుతో పాటు మంచి మెసేజ్ కూడా ఈ మూవీ ఇప్పుడు రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు లేటు, వెంటనే ఓ లుక్కేయండి.

Published on: Jun 24, 2026 12:31 PM IST
Advertisement

OTT Telugu: థియేటర్లలో బోల్తా కొట్టినా ఓటీటీలో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్న ‘పాపం ప్రతాప్’ మూవీ ఇప్పుడు మరో ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది. ఈ తెలుగు కామెడీ డ్రామా ఈ రోజు నుంచి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. దీని పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

పాపం ప్రతాప్ ఓటీటీ

మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ డ్రామా (x)
మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ డ్రామా (x)

తెలుగులో తిరువీర్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన కామెడీ డ్రామా ‘పాపం ప్రతాప్’. ఈ మూవీ ఏప్రిల్ 17, 2026న థియేటర్లలో రిలీజైంది. ప్రమోషన్స్ పరంగా ఈ మూవీ టీమ్ బాగానే ప్రయత్నించింది. కానీ తీరా థియేటర్లలో ఈ సినిమాకు అనుకున్నంత రీచ్ దక్కలేదు. దీంతో 20 రోజులకే ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రైమ్ వీడియోలో

ఈటీవీ విన్ ఓటీటీలో పాపం ప్రతాప్ మూవీకి మంచి వ్యూయర్ షిప్ దక్కింది. ఈ కామెడీ డ్రామాను తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ మరో ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

గ్లోబల్ రీచ్

ఫస్ట్ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన పాపం ప్రతాప్ మూవీకి లోకల్ లో క్రేజ్ దక్కింది. ఇప్పుడు ఈ సినిమా ప్రైమ్ వీడియోలకు రావడంతో గ్లోబల్ వైడ్ గా రీచ్ అయ్యే అవకాశముంది. పదే పదే థ్రిల్లర్లు చూసే ఫ్యాన్స్ కు ఈ పాపం ప్రతాప్ మంచి కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రిలీఫ్ అందిస్తుందని చెప్పొచ్చు.

గోదావరిలోని లంక గ్రామంలో వీరయ్య (అజయ్ ఘోష్) పురుగుల మందు వ్యాపారం చేస్తుంటాడు. అతని కొడుకు ప్రతాప్ (తిరువీర్) చిన్నప్పటి నుంచీ తన క్లాస్‌మేట్ బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను ఎంతో ప్రేమిస్తాడు. బుజ్జమ్మకు కూడా ప్రతాప్ అంటే ఇష్టమే. ఈ ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు.

అదే ట్విస్ట్

శోభనం తర్వాత ఊరి పెద్దలతో బుజ్జమ్మ పంచాయితీ పెట్టిస్తుంది. తన భర్త రాత్రి ఇబ్బంది పెడుతున్నాడని అంటుంది. కానీ పూర్తి ప్రాబ్లెం ఏంటో అందరికి షాక్ ఇస్తుంది. భర్త ప్రతాప్‌ను తన సమస్య ఏంటో తనే తెలుసుకుని, సరిదిద్దుకోవాలని చెప్తుంది. దాంతో ప్రతాప్‌పై ఊరందరిలో అనుమానం మొదలవుతుంది.

ఆ తర్వాత ఏమైంది? ప్రతాప్‌లో ఉన్న సమస్య ఏంటీ? దాన్ని ప్రతాప్ తెలుసుకున్నాడా? ఈ క్రమంలో ప్రతాప్ గురించి ఊరంతా ఏమనుకున్నారు? బుజ్జమ్మను ప్రతాప్ ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe