ఆ హీరో అభిమానుల వల్లే మా సినిమాకు ఈ పరిస్థితి.. రౌడీయిజంపై పోరాటం చేస్తున్నాం: డైరెక్టర్ సంచలన కామెంట్స్
పరాశక్తి మూవీ డైరెక్టర్ సుధ కొంగర చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దళపతి విజయ్ పేరును ప్రస్తావించకుండానే అతని ఫ్యాన్స్ ఫ్యాన్స్ చేస్తున్న నెగటివ్ ప్రచారం వల్లే తమ సినిమా పరాశక్తికి నష్టం వాటిల్లిందని ఆమె అనడం గమనార్హం.
ఈ సంక్రాంతి తమిళ సినిమా ఇండస్ట్రీకి చేదు అనుభవాన్నే మిగిల్చింది. బాక్సాఫీస్ దగ్గర పోటీ అనుకుంటే.. అది కాస్తా బయట ఫ్యాన్స్ వార్ కు దారి తీసింది. దళపతి విజయ్ మూవీ జన నాయగన్ వాయిదా పడటం, రిలీజైన పరాశక్తి మూవీకి నెగటివ్ రివ్యూలు రావడం, ఇప్పుడు దళపతి విజయ్ అభిమానులనే లక్ష్యంగా చేసుకుంటూ సుధా కొంగర చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.

వాళ్ల వల్లే ఇలా..
సంక్రాంతికి తెలుగులో వరుస సినిమాలతో సందడి నెలకొంటే.. తమిళనాట వరుస వివాదాలు అక్కడి అభిమానులకు మింగుడు పడటం లేదు. అక్కడి సినిమాల రిలీజ్ కావడానికే తంటాలు పడుతుంటే.. ఇప్పుడు పరాశక్తి డైరెక్టర్ సుధ కొంగర.. వాటికి మరింత ఆజ్యం పోసే కామెంట్స్ చేసింది. తమ సినిమాపై కావాలని ఓ హీరో అభిమానులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె అనడం గమనార్హం.
ఆమె నేరుగా విజయ్ పేరు ప్రస్తావించకపోయినా.. ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండి వాయిదా పడిన హీరో సినిమా అంటూ పరోక్షంగా అతన్ని టార్గెట్ చేసింది. ఇప్పుడు వాళ్ల రౌడీయిజంతో పోరాటం చేస్తున్నామని సుధ చెప్పింది. వాళ్ల చేసిన తప్పు వల్లే సినిమా వాయిదా పడిందని, ఇప్పుడు వాళ్ల నెగటివ్ ప్రచారానికి తమ సినిమా బలవుతోందని ఆమె తెలిపింది.
“ఇది రాజకీయపరమైన కారణం కాదు. సినిమా రిలీజ్ వాయిదా పడిన ఓ నటుడి అభిమాలే ఇలా చేస్తున్నారు. అదీ వాళ్ల తప్పిదం వల్లే వాయిదా పడింది. ఈ రౌడీయిజానికి వ్యతిరేకంగానే మేము పోరాడుతున్నాం” అని సుధ ఓ ఇంటర్యూలో కామెంట్ చేసింది.
మండిపడుతున్న విజయ్ ఫ్యాన్స్
అయితే సుధ కొంగర చేసిన కామెంట్స్ పై విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆమెను టార్గెట్ చేశారు. అభిమానులు, ప్రేక్షకుల రివ్యూలపై కూడా ఆమె రౌడీయిజం అనే ముద్ర వేయడం దారుణమని పలువురు ట్వీట్లు చేస్తున్నారు. అవును.. మేమే కోలీవుడ్ ను నడిపిస్తున్నాం.. అర్థమైందా అని కేరళ విజయ్ ఫ్యాన్స్ క్లబ్ అనే ఎక్స్ అకౌంట్ ట్వీట్ చేయడం గమనార్హం.
నిజానికి ఆకాశమే నీ హద్దురా లాంటి సినిమా తీసిన సుధ కొంగర డైరెక్ట్ చేసిన ఈ పరాశక్తి సినిమాకు తొలి షో నుంచే నెగటివ్ రివ్యూలు వచ్చాయి. చాలా దారుణంగా ఉందంటూ రివ్యూలు, రేటింగ్స్ కన్ఫమ్ చేశాయి. దీంతో మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడు డైరెక్టర్ సుధ కొంగర చేసిన కామెంట్స్ మాత్రం కోలీవుడ్ లో వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


