...
...
Next Story

OTT Release: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌..పంకజ్ త్రిపాఠి, అదితి రావ్ హైదరి క్రేజీ కాంబో!

OTT Release: బాలీవుడ్ విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠి, అందాల భామ అదితి రావ్ హైదరి క్రేజీ కాంబోలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వచ్చేస్తోంది. ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమా పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి.

Published on: Oct 31, 2026, 21:47:16 IST
Advertisement

OTT Release: కుటుంబమంతా కలిసి కూర్చుని చూసే అచ్చమైన ఫ్యామిలీ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు, మాటలు లేకుండా ఆహ్లాదకరంగా సాగే చిత్రాలను ఓటీటీ ఆడియన్స్ ఎగబడి చూస్తుంటారు. సరిగ్గా అలాంటి ఒక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు పంకజ్ త్రిపాఠి, అదితి రావ్ హైదరి.

పరివారిక్ మనురంజన్ ఓటీటీ

డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌..పంకజ్ త్రిపాఠి, అదితి రావ్ హైదరి క్రేజీ కాంబో! (x/SonyLIV)
డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌..పంకజ్ త్రిపాఠి, అదితి రావ్ హైదరి క్రేజీ కాంబో! (x/SonyLIV)

పంకజ్ త్రిపాఠి, అదితి రావ్ హైదరి కాంబినేషన్‌లో వస్తున్న సోనీ లివ్ (Sony LIV) ఒరిజినల్ మూవీనే 'పారివారిక్ మనురంజన్'. దీపావళి పండుగ వాతావరణం ముగిసిన వెంటనే, నవంబర్ 13న మీ కుటుంబ సమేతంగా కలిసి చూసేందుకు ఈ సినిమా సిద్ధంగా ఉందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఓటీటీలో ఈ సినిమా డైరెక్ట్ గా నవంబర్ 13న రిలీజ్ కానుంది.

తొలిసారి పంకజ్, అదితి రావ్ హైదరి మ్యాజిక్

విభిన్నమైన పాత్రలతో మెప్పించే పంకజ్ త్రిపాఠి.. తనదైన గ్లామర్, యాక్టింగ్ తో ఆకట్టుకునే అదితి రావ్ హైదరి మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పంకజ్ త్రిపాఠి నటన ఎంతో సహజంగా ఉంటుందని, ఆయన హ్యూమర్ టైమింగ్ వల్ల ప్రతి సీన్ ఎంతో ఫన్ గా వచ్చిందని, ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని అదితి రావ్ హైదరి తెలిపారు.

ఇక పంకజ్ త్రిపాఠి సైతం ఈ ప్రాజెక్ట్ పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నారు. "ఇదొక సింపుల్ కథ. ఇందులోని పాత్రలు మనకు ఎంతో దగ్గరగా అనిపిస్తాయి. రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమర్.. అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరిన చిత్రమిది" అని పంకజ్ పేర్కొన్నారు.

భారీ నిర్మాణ సంస్థల కలయికలో..

ప్రస్తుతం ఓటీటీలో ఎక్కడ చూసినా యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ సిరీస్ ల హవా నడుస్తోంది. ఇలాంటి సమయంలో మనసుకు హాయినిచ్చే ఒక పూర్తి కుటుంబ కథ అనుభూతిని ఈ సినిమా ప్రేక్షకులకు పంచబోతోందని సోనీ లివ్ సంస్థ నమ్మకంగా చెబుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. నవంబర్ 13న మీ ఫ్యామిలీతో కలిసి ఈ 'పరివారిక్ మనురంజన్' ను ఎంజాయ్ చేసేందుకు క్యాలెండర్ లో డేట్ మార్క్ చేసుకోండి!

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks