...
...
Next Story

త్రిష ఒక్కదానిదే కాదు అతనిది కూడా తప్పే.. విజయ్ అన్న ఆ ఒక్క మాటకు కన్నీళ్లు ఆగలేదు: పార్థిబన్ కామెంట్స్

త్రిష, విజయ్ పై తాను చేసిన కామెంట్స్ కు మరోసారి వివరణ ఇచ్చాడు నటుడు పార్థిబన్. తప్పు త్రిష ఒక్కదానిది మాత్రమే కాదని, విజయ్ ది కూడా తప్పేనని అన్నాడు. అయితే విజయ్ రాజకీయాల కోసం చేసిన త్యాగం మాత్రం తనను కంటతడి పెట్టేలా చేసిందని చెప్పాడు.

Published on: Mar 11, 2026, 16:12:27 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్. పార్థిబన్ ఇటీవల నటి త్రిష, దళపతి విజయ్‌ల వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా త్రిషను ఉద్దేశించి అతడు చేసిన 'కుందవై' కామెంట్స్ పై నెటిజన్లు, మహిళా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఒక వీడియో విడుదల చేసిన పార్థిబన్.. బుధవారం (మార్చి 11) మరో వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన వైఖరిని స్పష్టం చేసే ప్రయత్నం చేశాడు.

త్రిషపై విమర్శలు.. పార్థిబన్ వివరణ

త్రిష ఒక్కదానిదే కాదు అతనిది కూడా తప్పే.. విజయ్ అన్న ఆ ఒక్క మాటకు కన్నీళ్లు ఆగలేదు: పార్థిబన్ కామెంట్స్
త్రిష ఒక్కదానిదే కాదు అతనిది కూడా తప్పే.. విజయ్ అన్న ఆ ఒక్క మాటకు కన్నీళ్లు ఆగలేదు: పార్థిబన్ కామెంట్స్

విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో.. అతనితో కలిసి త్రిష ఒక వివాహ వేడుకకు హాజరుకావడం విజయ్ రాజకీయ భవిష్యత్తుకు నష్టం కలిగిస్తుందని పార్థిబన్ గతంలో వ్యాఖ్యానించాడు. దీనిపై విమర్శలు రావడంతో అతడు స్పందిస్తూ.. "నేను కేవలం మహిళను (త్రిష) మాత్రమే తప్పుబడుతున్నానని అందరూ అడుగుతున్నారు. ఆ వీడియోలో నేను చెప్పిన దానిలో కొంత భాగాన్ని మాత్రమే చూసి స్పందిస్తున్నారు. అక్కడ తప్పు జరిగినా, ఒప్పు జరిగినా పురుషుడికి (విజయ్) కూడా సమాన బాధ్యత ఉంటుందని నేను నమ్ముతున్నాను" అని వివరణ ఇచ్చాడు.

ఎన్నికలు ముగిసే వరకు ఇలాంటి బహిరంగ ప్రదర్శనలు నివారించి ఉంటే బాగుండేదని తన అభిప్రాయమని అతడు చెప్పుకొచ్చాడు. త్రిషను తాను గతంలో ఎంతో ప్రశంసించానని, తన మాజీ భార్య సీతతో కలిసి తాము అవయవ దానం చేసినప్పుడు త్రిష తనకు ఎంతో మద్దతుగా నిలిచిందని గుర్తు చేసుకున్నాడు. "ఇప్పుడు జరుగుతున్న చేదు సంఘటనల పక్కన పెడితే, ఆమెపై నాకు ఇప్పటికీ గౌరవం ఉంది" అని పేర్కొన్నాడు.

విజయ్ ప్రసంగం చూసి కన్నీళ్లు వచ్చాయి

విజయ్ రాజకీయ ప్రవేశంపై కూడా పార్థిబన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "విజయ్ తన కిరీటాన్ని, సింహాసనాన్ని (సినిమా కెరీర్) వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సక్సెస్ అవుతారా లేక రజనీకాంత్, చిరంజీవి లాగే మళ్లీ సినిమాల్లోకి వస్తారా అనేది చూడాలి. ఆయన మొదటి బహిరంగ సభ చూసినప్పుడు నాకు భయమేసింది. కానీ ఆయన మాట్లాడుతుంటే గర్వంతో నా కళ్ళలో నీళ్లు తిరిగాయి" అని చెప్పుకొచ్చారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, విజయ్ తనను పార్టీలోకి ఆహ్వానించలేదన్న కోపంతో ఇలా మాట్లాడుతున్నానన్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశాడు.

'ఇకనైనా ఆపండి'.. నెటిజన్ల ఫైర్

ప్రస్తుతం విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇచ్చే ప్రక్రియలో ఉన్నారని, రాజకీయంగా 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ ద్వారా ఎన్నికల బరిలోకి దిగుతున్నారని సమాచారం. అతని చివరి సినిమా 'జననాయగన్' ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe