Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోగ్యం పట్ల ఆందోళనతో ఉన్న ఫ్యాన్స్ కు ఇది కాస్త ఊరటనిచ్చే విషయం. సర్జరీ తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారి బయట కనిపించారు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కు ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఆయన్ని పరామర్శించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ ఇంటికి వెళ్లారు.
పవన్ ఇంటికి చంద్రబాబు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం (మే 2) ఆయన ఇంటికి వెళ్లారు. ఇటీవల పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని పరీక్షించిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స నిర్వహించారు. అప్పటి నుంచి పవన్ ఇంట్లో ఉండి కోలుకుంటున్నారు.
ఆరోగ్యంపై ఆరా
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను చంద్రబాబు కలిశారు. ఇవాళ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా కొణదెల స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాసేపు ముచ్చటించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది.
ఫొటోలు వైరల్
ఆపరేషన్ తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారి కనిపించడం వైరల్ గా మారింది. చంద్రబాబుతో పవన్ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోల్లో పవన్ కల్యాణ్ కాస్త నీరసంగా ఉన్నట్లు కనిపించారు.
{{/usCountry}}ఆపరేషన్ తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారి కనిపించడం వైరల్ గా మారింది. చంద్రబాబుతో పవన్ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోల్లో పవన్ కల్యాణ్ కాస్త నీరసంగా ఉన్నట్లు కనిపించారు.
{{/usCountry}}పవన్ కల్యాణ్ కు ఏప్రిల్ 18న హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్లో సర్జరీ జరిగింది. ఆయనకు సైనసైటిస్ సర్జరీ చేశారు. ముక్కుకు సంబంధించిన ఆపరేషన్ ఇది. ఈ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీని డాక్టర్లు సక్సెస్ ఫుల్ గా చేశారు. అప్పటి నుంచి పవన్ కల్యాణ్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్
పవన్ కల్యాణ్ చివరగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయింది. పెట్టిన బడ్జెట్ ను కూడా తిరిగి రాబట్టలేకపోయింది. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో పవన్ కల్యాణ్ నటించారు.
ప్రస్తుతం సర్జరీ నుంచి కోలుకుంటున్న పవన్ కల్యాణ్ ఇంకా కొత్త సినిమాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన లైనప్ లో రెండు సినిమాలు ఉన్నట్లు సమాచారం.