Pawan Kalyan on Vijay: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ తన విలక్షణమైన వ్యక్తిత్వాన్ని మరోసారి చాటుకున్నారు. సినిమాల్లో అగ్రతారలుగా వెలిగి, రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నటుల విషయంలో పవన్ వైఖరి ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది.

ఇటీవల ఒక మీడియా సమావేశంలో తమిళ హీరో 'దళపతి' విజయ్ రాజకీయ ప్రవేశం గురించి పవన్‌కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. రాజకీయాల్లో విజయ్ రాణించాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి అని ప్రశ్నించగా పవన్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది.
"నేను సలహాలు ఇచ్చే మనిషిని కాదు"
విజయ్ రాజకీయాల్లోకి రావడం, త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతుండటంపై పవన్ ఎంతో వినమ్రంగా స్పందించారు. ఆయన ఒంటరిగా పోటీ చేయాలా లేక ఎవరితోనైనా కలవాలా.. మీరిచ్చే సలహా ఏంటి అని ప్రశ్నించగారు.
దీనికి పవన్ స్పందిస్తూ.. "నేను ఎవరికీ సలహాలు ఇవ్వడానికి ఇష్టపడను. వాళ్లు అడిగితే తప్ప. ప్రతి ఒక్కరికీ తమదైన ఆలోచనా విధానం ఉంటుంది. తమ సొంత బాటను ఎలా నిర్మించుకోవాలో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో అందరికీ తెలిసే ఉంటుంది" అని పవన్ పేర్కొన్నారు. ఒక సీనియర్ రాజకీయవేత్తగా కాకుండా, ఒక సహచర నటుడిగా విజయ్ వ్యక్తిగత సామర్థ్యంపై పవన్ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
విజయ్ ఇమేజ్‌పై ప్రశంసలు
సలహాలు ఇవ్వనని చెబుతూనే, విజయ్‌కు ఉన్న మాస్ ఇమేజ్‌ను పవన్ ప్రస్తావించారు. విజయ్ ఒక పెద్ద స్టార్ అని, అలాంటి ప్రభావవంతమైన వ్యక్తులు ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని పవన్ కొనియాడారు.
"సమాజం కోసం పనిచేయాలనే సంకల్పంతో ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే అది ఎప్పుడూ ప్రశంసనీయమే. ఏ రూపంలో ప్రజలకు సేవ చేసినా అది గౌరవప్రదమైన విషయమే" అని ఆయన వ్యాఖ్యానించారు.
పరస్పర గౌరవం.. ఆరోగ్యకర రాజకీయాలు
సాధారణంగా ఒక స్టార్ హీరో రాజకీయాల్లోకి వస్తుంటే ఇండస్ట్రీలో ఉన్న ఇతర హీరోలు తమ పైచేయి చూపాలని ప్రయత్నిస్తుంటారు. కానీ పవన్ కల్యాణ్ విషయంలో అది భిన్నంగా కనిపిస్తుంది. తమిళనాడులోనే కమల్ హాసన్ గతంలో విజయ్ పై అడిగిన ప్రశ్నకు కాస్త పరుషంగా స్పందించిన విషయం తెలిసిందే.
{{/usCountry}}సాధారణంగా ఒక స్టార్ హీరో రాజకీయాల్లోకి వస్తుంటే ఇండస్ట్రీలో ఉన్న ఇతర హీరోలు తమ పైచేయి చూపాలని ప్రయత్నిస్తుంటారు. కానీ పవన్ కల్యాణ్ విషయంలో అది భిన్నంగా కనిపిస్తుంది. తమిళనాడులోనే కమల్ హాసన్ గతంలో విజయ్ పై అడిగిన ప్రశ్నకు కాస్త పరుషంగా స్పందించిన విషయం తెలిసిందే.
{{/usCountry}}విజయ్ తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న వేళ, పవన్ కల్యాణ్ అందించిన ఈ నైతిక మద్దతు ఇద్దరి అభిమానుల్లోనూ జోష్ నింపింది. ఎదుటివారి నిర్ణయాలను గౌరవిస్తూనే, వారి ఎదుగుదలను ఆకాంక్షించే పవన్ తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుండగా, విజయ్ తమిళనాడులో తన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఇద్దరు 'పవర్ హౌస్' స్టార్స్ ప్రజా సేవలో ఎలాంటి ఫలితాలు సాధిస్తారో చూడాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. దళపతి విజయ్ రాజకీయ పార్టీ పేరు ఏమిటి?
దళపతి విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ పేరు 'తమిళగ వెట్రి కళగం' (TVK).
2. విజయ్‌కి పవన్ కల్యాణ్ ఏమని సలహా ఇచ్చారు?
పవన్ కల్యాణ్ తాను ఎవరికీ సలహాలు ఇచ్చే వ్యక్తిని కాదని, ప్రతి ఒక్కరూ తమ సొంత నిర్ణయాలు తీసుకోగలరని చెబుతూ విజయ్ రాజకీయ నిర్ణయాన్ని గౌరవించారు.
3. విజయ్ ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు?
విజయ్ తన పార్టీ తరపున 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.