...
...
Next Story

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ జోష్..డబ్బింగ్ మొదలెట్టిన పవన్ కల్యాణ్.. పక్కనే తమన్.. సర్ ప్రైజ్ అంటూ సస్పెన్స్

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ జోష్ కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీకి హరీష్ శంకర్ డైెరెక్టర్. తన అప్ కమింగ్ సినిమా కోసం పవన్ కల్యాణ్ డబ్బింగ్ మొదలెట్టాడు. మరోవైపు సర్ ప్రైజ్ అంటూ ఫ్యాన్స్ ను హరీష్ శంకర్ ఊరిస్తున్నాడు.

Published on: Mar 7, 2026, 19:39:01 IST
Advertisement

మరికొన్ని రోజుల్లోనే థియేటర్లలో ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా స్టార్ట్ కాబోతుంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 19న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ డబ్బింగ్ ను పవన్ కల్యాణ్ స్టార్ట్ చేస్తాడు. ఈ విషయాన్ని మూవీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో అనౌన్స్ చేశారు.

ఉస్తాద్ భగత్ సింగ్

హరీష్ శంకర్, పవన్ కల్యాణ్, తమన్ (x/UBSTheFilm)
హరీష్ శంకర్, పవన్ కల్యాణ్, తమన్ (x/UBSTheFilm)

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. దీనికి హరీష్ శంకర్ డైరెక్టర్. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా పవన్ కల్యాణ్ నటించాడు. బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్-పవన్ కల్యాణ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

పవన్ కల్యాణ్ డబ్బింగ్

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి పవన్ కల్యాణ్ డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. ‘‘ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ పర్యవేక్షణలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. టెర్రిఫిక్ స్కోర్ ఇచ్చేందుకు తమన్ కష్టపడుతున్నాడు. మీరు ఎదురు చూస్తున్న సర్ ప్రైజ్ ఈ రోజు ఎప్పుడైనా రావొచ్చు’’ అని మూవీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు.

పక్కన తమన్

ఇవాళ (మార్చి 7) ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సర్ ప్రైజ్ వస్తుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ‘బిగ్ డే’ అని హరీష్ శంకర్ ఉదయం ఎక్స్ లో పోస్టు పెట్టాడు. దీంతో ఆ సర్ ప్రైజ్ ఏంటా అని అందరూ ఆత్రుతతో ఉన్నారు.

రిలీజ్ డేట్

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని ఫస్ట్ మార్చి 27, 2026న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ రీసెంట్ గా మార్చి 19నే థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఉగాదికి ఉస్తాద్ ఊచకోత అని అప్ డేట్ పంచుకున్నారు. మార్చి 19న ఉగాది. అయితే ఆ రోజు రిలీజ్ కావాల్సిన యశ్ మూవీ టాక్సిక్ జూన్ 4కు వాయిదా పడింది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ డేట్ ను వారం ప్రీ పోన్ చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks