Ustaad Bhagat Singh Release Date: ఉగాదికి ఉస్తాద్ ఊచకోత- వారం ముందుగానే థియేటర్లకు ఉస్తాద్ భగత్ సింగ్- కొత్త రిలీజ్ డేట్
Ustaad Bhagat Singh Release Date: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ ఇది. పవన్ అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ముందుగానే థియేటర్లకు రాబోతుంది. టాక్సిక్ రిలీజ్ పోస్ట్ పోన్ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ను ఓ వారం ముందుకు తీసుకు వచ్చారు.
బ్రేకింగ్ న్యూస్.. ఒక వారం ముందుగానే థియేటర్లలో ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ ను ప్రీ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్ మార్చి 26న కాకుండా ఓ వారం ముందుగా అంటే మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ ను థియేటర్లకు తెస్తున్నారు. టాక్సిక్ మూవీ పోస్ట్ పోన్ నేపథ్యంలో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ మారింది. ఈ మూవీ మార్చి 26, 2026న కాదు మార్చి 19, 2026న రిలీజ్ కానుంది. ఈ మేరకు ఇవాళ (మార్చి 5) మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో అనౌన్స్ మెంట్ పోస్టు పెట్టింది.
ఉగాదికి ఉస్తాద్ ఊచకోత
‘‘ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత. బాక్సాఫీస్ దగ్గర మాసివ్ సెలబ్రేషన్స్ కోసం మన ఉస్తాద్ ఒక వారం ముందే వస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19, 2026న గ్రాండ్ గా రిలీజ్ కానుంది’’ అని ఎక్స్ లో రిలీజ్ పోస్టర్ ను మైత్రి మూవీ మేకర్స్ పోస్టు చేసింది.
టాక్సిక్ వాయిదాతో
నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మార్చి 26న రిలీజ్ చేస్తామని ముందు మేకర్స్ ప్రకటించారు. కానీ మార్చి 19న రావాల్సిన యశ్ సినిమా టాక్సిక్ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. అదే రోజు ఉగాది. దీంతో ఈ ఛాన్స్ ను ఉపయోగించుకోవడం కోసం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ ను ముందుకు జరిపారని టాక్.
ధురంధర్ 2 ఉన్నా
మార్చి 19న ధురంధర్ 2, టాక్సిక్ బాక్సాఫీస్ ఫైట్ తప్పదనిపించింది. ధురంధర్ 2 కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. కానీ ఇప్పుడు రేసులో నుంచి టాక్సిక్ తప్పుకుంది. ఇరాన్ పై అమెరికా యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లోని భయానక పరిస్థితుల నేపథ్యంలో టాక్సిక్ మూవీ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు.
ఇప్పుడు టాక్సిక్ లేకపోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉగాది రేసులోకి వచ్చింది. మార్చి 19న ధురంధర్ 2 తెలుగులోనూ రిలీజ్ అవుతున్నా, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై పెద్దగా ఎఫెక్ట్ పడదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి హరీష్ శంకర్ డైరెక్టర్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


