పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ 'ఆరా ఆఫ్ ఉస్తాద్' (Auraa of Ustaad) పాటను ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ పాటకు సంబంధించిన ఉత్సాహభరితమైన ప్రోమోను రిలీజ్ చేశారు.
'ఆరా ఆఫ్ ఉస్తాద్'.. పండుగ లాంటి పాట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ టీమ్ ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపేందుకు ఒక అదిరిపోయే అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల తేదీని ప్రకటిస్తూ గురువారం (ఫిబ్రవరి 19) ఒక చిన్న ప్రోమోను విడుదల చేశారు. ఇందులో పవన్ ఓ చేతిలో తుపాకీ, మరో చేతిలో ఓ రేడియోతో స్టైలిష్ గా నడుస్తూ రావడం చూడొచ్చు.
ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ కు "ఆరా ఆఫ్ ఉస్తాద్" అనే పవర్ ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ఈ పూర్తి పాటను ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు తనదైన శైలిలో అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ పాటకు ఆస్కార్ విన్నర్, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం సమకూర్చాడు. అలాగే దేవి శ్రీ ప్రసాద్, ఎస్.పి. అభిషేక్, 'ది ఇండియన్ కోరల్ ఎన్‌సెంబల్' బృందం కలిసి ఈ పాటను ఎంతో ఎనర్జిటిక్‌గా పాడారు.
అదిరిపోయిన ప్రోమో
తాజాగా విడుదలైన ఈ ప్రోమో చూస్తుంటే.. ఇది పవర్ స్టార్ అభిమానులకు ఒక పండుగలా ఉండబోతుందని స్పష్టమవుతోంది. ఈ చిన్న ప్రోమోలో చూపించిన యానిమేషన్ విజువల్స్ చాలా నీట్‌గా, ఒక మంచి క్వాలిటీ లిరికల్ వీడియోను అందించబోతున్నట్లు కనిపిస్తోంది. అలాగే ఈ ప్రోమోలో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన కొన్ని గ్లింప్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అభిమానులతో పవన్‌కు ఉన్న బంధాన్ని గుర్తు చేసేలా అతని మేనరిజాన్ని ఈ యానిమేషన్ లో పొందుపరచడం విశేషం.
ఉస్తాద్ భగత్‌సింగ్ విశేషాలు
{{/usCountry}}తాజాగా విడుదలైన ఈ ప్రోమో చూస్తుంటే.. ఇది పవర్ స్టార్ అభిమానులకు ఒక పండుగలా ఉండబోతుందని స్పష్టమవుతోంది. ఈ చిన్న ప్రోమోలో చూపించిన యానిమేషన్ విజువల్స్ చాలా నీట్‌గా, ఒక మంచి క్వాలిటీ లిరికల్ వీడియోను అందించబోతున్నట్లు కనిపిస్తోంది. అలాగే ఈ ప్రోమోలో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన కొన్ని గ్లింప్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అభిమానులతో పవన్‌కు ఉన్న బంధాన్ని గుర్తు చేసేలా అతని మేనరిజాన్ని ఈ యానిమేషన్ లో పొందుపరచడం విశేషం.
ఉస్తాద్ భగత్‌సింగ్ విశేషాలు
{{/usCountry}}ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల, రాశీ ఖన్నా ఫీమేల్ లీడ్స్‌గా నటిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు దశరథ్ స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం.
ఈ సినిమాను మార్చి 26న థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గతేడాది చివర్లో పవన్ కల్యాణ్ ఓజీ మూవీతో తన కెరీర్లోనే అత్యధిక వసూళ్ల సినిమా ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఉస్తాద్ భగత్‌సింగ్ పై అంచనాలు మరింత పెరిగాయి.