...
...
Next Story

Pawan Kalyan: ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ టీవీ ప్రీమియ‌ర్‌లో ట్విస్ట్‌..తార‌క్ బాట‌లోనే ప‌వ‌న్‌.. ఫ‌స్ట్ హిందీలోనే.. కార‌ణం ఇదే

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం సరికొత్త వ్యూహంతో బుల్లితెరపైకి వస్తోంది. థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయిన ఈ మూవీ.. తెలుగులో కాకుండా ఫస్ట్ హిందీలో వరల్డ్ శాటిలైట్ ప్రీమియర్ కాబోతుంది. దీని వెనుక ఉన్న కారణం ఏంటో చూసేయండి.

Published on: Jun 14, 2026, 19:08:32 IST
Advertisement

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ 2' వంటి క్రేజీ ప్రాజెక్టు అప్ డేట్ తో మెగా అభిమానులు ఇప్పటికే ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే, తాజాగా ఆయన నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ఇప్పుడు సినీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. థియేటర్లలో విడుదలైన సమయంలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్, ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ఉస్తాద్ భగత్ సింగ్ టీవీ ప్రీమియర్

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ టీవీ ప్రీమియ‌ర్‌లో ట్విస్ట్‌..తార‌క్ బాట‌లోనే ప‌వ‌న్‌
ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ టీవీ ప్రీమియ‌ర్‌లో ట్విస్ట్‌..తార‌క్ బాట‌లోనే ప‌వ‌న్‌

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టెలివిజన్ ప్రీమియర్ ఇవాళ (జూన్ 14) రాత్రే గ్రాండ్‌గా జరగనుంది. ​అయితే ఈ టెలివిజన్ డెబ్యూ వెనుక ఒక విచిత్రమైన ట్విస్ట్ ఉంది. ఒరిజినల్ తెలుగు కంటే ముందే ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌లో బుల్లితెరపై సందడి చేయబోతోంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' హిందీ వెర్షన్ ఆదివారం రాత్రి 8:00 గంటలకు ప్రముఖ జాతీయ టెలివిజన్ ఛానెల్ 'స్టార్ గోల్డ్' లో ప్రసారం కానుంది.

తెలుగులో ఎప్పుడు?

ఒరిజినల్ తెలుగు భాషలో తెరకెక్కిన పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ఫస్ట్ హిందీలో టీవీ ప్రీమియర్ కానుంది. మరోవైపు ఈ మూవీ తెలుగు ఛానెల్లో ఎప్పుడు వస్తుందనే దానిపై ఇంకా క్లారిటీ లేకపోవడం గమనార్హం. ఒరిజినల్ తెలుగు వెర్షన్ శాటిలైట్ ప్రసారానికి సంబంధించిన తేదీ, సమయాన్ని ఛానెల్ యాజమాన్యం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

తారక్ బాటలో

​ఇటీవల కాలంలో టాలీవుడ్ పెద్ద సినిమాల విషయంలో ఇదొక సరికొత్త ట్రెండ్‌గా మారుతోంది. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర: పార్ట్ 1' టెలివిజన్ విడుదల సమయంలోనూ ఇదే వ్యూహాన్ని అనుసరించారు. దేవరా హిందీ వెర్షన్‌ను మొదట జాతీయ టెలివిజన్ స్క్రీన్లపై ప్రసారం చేసి, ఆ తర్వాత తెలుగు వెర్షన్ ప్రసార తేదీని సస్పెన్స్‌లో ఉంచారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కూడా అదే బాటలో నడుస్తోంది.

నేషనల్ లెవల్ లో

​సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ సినిమా హిందీ టెలివిజన్ ప్రీమియర్ జరుగుతున్న రోజే శ్రీలీల పుట్టినరోజు (జూన్ 14) కావడం యాదృచ్ఛికం.

People Also Ask- తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

​ప్రశ్న: 'ఉస్తాద్ భగత్ సింగ్' టెలివిజన్ ప్రీమియర్ ఎప్పుడు, ఏ ఛానెల్‌లో రానుంది?

జవాబు: ఈ సినిమా హిందీ వెర్షన్ ఇవాళ (జూన్ 14) రాత్రి 8:00 గంటలకు 'స్టార్ గోల్డ్' ఛానెల్‌లో ప్రసారం కానుంది.

​ప్రశ్న: ఈ చిత్రం తెలుగు వెర్షన్ బుల్లితెరపై ఎప్పుడు ప్రసారమవుతుంది?

జవాబు: తెలుగు వెర్షన్ ప్రసారానికి సంబంధించిన తేదీని మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.

​ప్రశ్న: 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్ర దర్శకుడు, నిర్మాతలు ఎవరు?

జవాబు: హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks