Anna Konidala: చిరంజీవిని అందుకే నేను అన్నయ్య అని పిలుస్తా.. నా భర్త నుంచి అరువు తెచ్చుకున్నా: పవన్ భార్య ఎమోషనల్ పోస్ట్

Anna Konidala: పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల ఇన్‌స్టాగ్రామ్ లోకి రాగానే వరుసగా పోస్టులు చేస్తోంది. ఇందులో చిరంజీవిని అన్నయ్య అని ఎందుకు పిలుస్తానో చెబుతూ చేసిన ఎమోషనల్ పోస్ట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

Published on: Mar 26, 2026, 15:55:19 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Anna Konidala: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల సోషల్ మీడియా ఎంట్రీ ఇప్పుడు నెట్టింట పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గానే ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన ఆమెకు.. పవన్ కళ్యాణ్ స్వయంగా ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికిన విషయం మనందరికీ తెలిసిందే. తన భర్తతో కలిసి ఉన్న ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ ఆమె తన మొదటి పోస్ట్ పెట్టింది.

Anna Konidala: చిరంజీవిని అందుకే నేను అన్నయ్య అని పిలుస్తా.. నా భర్త నుంచి అరువు తెచ్చుకున్నా: పవన్ భార్య ఎమోషనల్ పోస్ట్
Anna Konidala: చిరంజీవిని అందుకే నేను అన్నయ్య అని పిలుస్తా.. నా భర్త నుంచి అరువు తెచ్చుకున్నా: పవన్ భార్య ఎమోషనల్ పోస్ట్

అయితే ఇప్పుడు తన సెకండ్ పోస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబులను ట్యాగ్ చేస్తూ ఆమె పెట్టిన ఒక ఎమోషనల్ మెసేజ్ అందరి హృదయాలను హత్తుకుంటోంది. మెగా ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని, ముఖ్యంగా ఆ ఇద్దరు అన్నయ్యలతో తనకున్న బాండింగ్‌ను ఆమె చాలా అందంగా అక్షరాల్లో పెట్టింది.

మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన కొత్తలో అలా..

పవన్ భార్య అన్నా కొణిదెల దాదాపు పదిహేనేళ్ల కిందట తాను మెగా ఫ్యామిలీలోకి ఎలా అడుగుపెట్టింది, అప్పుడు తన పరిస్థితి ఏంటి అనే విషయాలను చాలా హార్ట్ టచింగ్‌గా చెప్పుకొచ్చింది.

"సరిగ్గా పదిహేనేళ్ల క్రితం నేను ఒక కొత్త కుటుంబంలోకి అడుగుపెట్టాను. అప్పటికే ఆ కుటుంబంలో ఉన్న వాళ్లంతా ఒకరికొకరు ఎంతో అన్యోన్యంగా, ఒక గట్టి బంధంతో కలిసిపోయి ఉన్నారు. అలాంటి పెద్ద కుటుంబంలో నేను ఎలా ఇమిడిపోవాలో, వాళ్లతో ఎలా కలిసిపోవాలో నాకు అస్సలు అర్థం కాలేదు. ఇంట్లో ఉన్నవాళ్లను ఏమని పిలవాలో కూడా నాకు తెలిసేది కాదు" అని ఆమె ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది.

భర్త మాటల్నే అరువు తెచ్చుకున్నా..

ఎవరిని ఏమని పిలవాలో తెలియని ఆ అయోమయ స్థితిలో తాను తన భర్త పవన్ కళ్యాణ్ వాడే మాటల్నే అరువు తెచ్చుకున్నానని ఆమె చెప్పింది. పవన్ కళ్యాణ్ తన అన్నయ్యలను ఎలాగైతే 'అన్నయ్య', 'చిన్న అన్నయ్య' అని పిలుస్తాడో.. తాను కూడా వాళ్లను సరిగ్గా అలాగే పిలవడం మొదలుపెట్టిందట.

"మొదట్లో వాళ్లను అలా పిలవాలంటే నాకు కొంచెం భయంగా, సందేహంగా అనిపించేది. చాలా జాగ్రత్తగా, ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని పిలిచేదాన్ని. కానీ రోజులు గడిచేకొద్దీ ఆ పిలుపు నా మనసులోంచి రావడం మొదలైంది. ఆ బంధం నా హృదయానికి హత్తుకుంది" అని అన్నా ఎమోషనల్ అయింది.

భాషతో సంబంధం లేని బంధం..

తెలుగు సంప్రదాయం ప్రకారం భర్త వాళ్ల అన్నయ్యలను బావగారు అని పిలవాలనే విషయం తనకు చాలా రోజుల తర్వాత తెలిసిందని ఆమె చెప్పింది.

"నిజానికి వాళ్లను పిలవడానికి మన భాషలో ఇంకో సరైన పదం ఉందని నాకు చాలా కాలం తర్వాత తెలిసింది. కానీ ఆ విషయం తెలిసే సమయానికే.. మా మధ్య ఉన్న ఆ బాండింగ్ భాషకు అతీతంగా మారిపోయింది. నాకు సొంత అన్నయ్య అంటూ ఎవరూ లేరు. కానీ ఈ జీవితం చాలా సైలెంట్‌గా నాకు ఇద్దరు అద్భుతమైన అన్నయ్యలను బహుమతిగా ఇచ్చింది" అంటూ చిరంజీవి, నాగబాబులను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మెగా ఫ్యామిలీలో ఉన్న ఆ ప్రేమను, అన్నదమ్ముల మధ్య ఉన్న ఆ అనుబంధాన్ని పవన్ కళ్యాణ్ భార్య ఇంత అందంగా అర్థం చేసుకోవడం చూసి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. వదినమ్మ పోస్ట్ సూపర్ అంటూ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More