Peddi One Week Collections: పెద్ది వారం కలెక్షన్లు ఇవే.. ఇండియాలో ఏ రోజు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా? ఆ వివాదాన్ని దాటి

Peddi One Week Collections: రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ బాక్సాఫీస దగ్గర ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. వివాదాన్ని దాటి ఈ మూవీ నిలబడింది. మరి ఈ వారంలో పెద్ది ఎన్ని కోట్లు సాధించింది? ఒక్కో రోజు ఎంత కలెక్షన్ వచ్చిందో ఇక్కడ చూసేయండి.

Published on: Jun 11, 2026, 05:54:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Peddi One Week Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ వేట మొదలై వారం ముగిసింది. జూన్ 4న రిలీజైన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi Movie) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం మొదటి వారం ముగిసేసరికి రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. ఫస్ట్ వీక్ లో ఇండియాలో పెద్ది నెట్ కలెక్షన్ల వివరాలు ఇక్కడున్నాయి.

పెద్ది వారం కలెక్షన్లు ఇవే.. ఇండియాలో ఏ రోజు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
పెద్ది వారం కలెక్షన్లు ఇవే.. ఇండియాలో ఏ రోజు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

‘పెద్ది’ ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ బ్రేక్‌డౌన్

భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన పెద్దికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ ఓ పల్లెటూరి క్రీడాకారుడిగా నటించాడు. మల్టీ స్పోర్ట్స్ ఆడే వ్యక్తిగా అదరగొట్టాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన పెద్ది మూవీ ఇండియాలో తొలి వారంలో రూ.187.25 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు సక్నిల్క్ తెలిపింది.

ఏ రోజు ఎంత?

పెద్ది సినిమా ఇండియాలో ఏ రోజు ఎలా పర్ఫార్మ్ చేసిందో ఈ క్రింది టేబుల్‌లో చూడవచ్చు:

రోజు నెట్ కలెక్షన్లు

ప్రీమియర్ షోలు (June 3) రూ.18.50 కోట్లు

డే 1 రూ.51.00 కోట్లు

వీకెండ్ (శని, ఆదివారం) రూ.61.25 కోట్లు

సోమ, మంగళ రూ. 22.05 కోట్లు

బుధ రూ. 14.45 కోట్లు

మొత్తం మొదటి వారం Total: రూ. 187.25 కోట్లు

ఆ వివాదాన్ని దాటి

థియేటర్లలో రిలీజైన తర్వాత పెద్ది మూవీకి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ నటనకు సినీ లవర్స్ ఫిదా అయ్యారు. కానీ వెంటనే వివాదం ముసురుకుంది. జాన్వీ కపూర్ ను సినిమాలో కేవలం గ్లామర్ బొమ్మగా చూపిస్తారా? అనే విమర్శలు వచ్చాయి. దీనిపై రియాక్టైన డైరెక్టర్ బుచ్చిబాబు క్షమాపణ కూడా చెప్పాడు. కొన్ని సీన్లు కూడా మూవీ నుంచి తీసేశారు. ఆ వివాదాన్ని దాటుకుని బాక్సాఫీస్ దగ్గర పెద్ది బలంగా నిలబడటం విశేషం.

రూ.1000 కోట్లు సాధ్యమేనా?

పెద్ది మూవీ లాంగ్ రన్ లో రూ.1000 కోట్లు సాధించడం సాధ్యమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.330 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో రూ.1000 కోట్ల క్లబ్ లో చేరాలంటే పెద్ది రీచ్ మరింత పెరగాలి.

ముఖ్యంగా నార్త్ లో పెద్ది కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. హిందీలో వసూళ్లు పెరిగితేనే పెద్ది సినిమా రూ.1000 కోట్లు అందుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అవకాశం లేదని ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

People Also Ask

పెద్ది మూవీ హిట్టా ఫ్లాపా?

పెద్ది మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు చూస్తే పెద్ది బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుందని అంటున్నారు.

పెద్దిని ఫ్యామిలీతో చూడొచ్చా?

పెద్ది మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు. సినిమాలోని వివాదాస్పద ముద్దు సీన్ లాంటి వాటిని డైరెక్టర్ తొలగించాడు.

పెద్ది కథ ఏంటీ?

ఇది విజయనగరం సరిహద్దుల్లోని ఒక వెనుకబడిన గ్రామానికి చెందిన యువకుడి కథ. క్రీడల (Sports) ద్వారా తన సమాజానికి దక్కాల్సిన హక్కులను, కనీస వసతులను ఒక లీగల్ పోరాటం ద్వారా ఎలా సాధించాడనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More