మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు సాన. కానీ, తాజాగా నవంబర్ 30న జరిగిన సఃకుటుంబనాం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు బుచ్చిబాబు. ఈ సందర్భంగా సఃకుటుంబనాం ట్రైలర్‌ను బుచ్చిబాబు సాన విడుదల చేశారు.
రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు

సఃకుటుంబనాం సినిమాలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు. హెచ్‌ఎన్‌జి సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై మహాదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా ఈ సినిమాను నిర్మించారు. సఃకుటుంబనాం సినిమాకు ఉదయ్ శర్మ రచన, దర్శకత్వం వహించారు.
డిసెంబర్ 12న థియేట్రిక్ రిలీజ్
డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు సఃకుటుంబానాం సినిమా రానుంది. రామ్ చరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందంతోపాటు శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్నారు.
సఃకుటుంబనాం ట్రైలర్ లాంచ్
మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా మధు దాసరి డిఓపిగా పనిచేశారు. ఎడిటర్‌గా శశాంక్ మలి చేశారు. విడుదల తేదీ దగ్గరవుతున్న సందర్భంగా ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదగా సఃకుటుంబానాం చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశారు.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను
ఈ సందర్భంగా బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. బ్రహ్మానందం గారు, రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన నాన్నకు ప్రేమతో, ఆర్య 2 చిత్రాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఇప్పుడు వారి పక్కన నిలబడి డైరెక్టర్‌గా మాట్లాడడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను" అని అన్నారు.
సుకుమార్ ఐడియాలో
"నా స్నేహితుడు విక్రమ్ ఒక లైన్ సినిమాగా చేయాలి అనుకున్నాడు. కానీ ఆయన చనిపోవడం జరిగింది. అదే లైన్‌ను తన స్నేహితుడు ఉదయ్ ఒక కథగా మార్చి ఆ కథను సినిమాగా చేస్తున్నాను అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఈ సినిమా సుకుమార్ గారి ఐడియాలో ఉండబోతుంది" అని బుచ్చిబాబు సాన తెలిపారు.
మంచి పేరు తీసుకురావాలని
{{/usCountry}}"నా స్నేహితుడు విక్రమ్ ఒక లైన్ సినిమాగా చేయాలి అనుకున్నాడు. కానీ ఆయన చనిపోవడం జరిగింది. అదే లైన్‌ను తన స్నేహితుడు ఉదయ్ ఒక కథగా మార్చి ఆ కథను సినిమాగా చేస్తున్నాను అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఈ సినిమా సుకుమార్ గారి ఐడియాలో ఉండబోతుంది" అని బుచ్చిబాబు సాన తెలిపారు.
మంచి పేరు తీసుకురావాలని
{{/usCountry}}"సఃకుటుంబానాం చిత్రం మంచి విజయం సాధించాలని నటీనటులకు, నిర్మాతకు, సాంకేతిక బృందానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్" అని తన స్పీచ్ ముగించారు పెద్ది దర్శకుడు బుచ్చిబాబు సాన.
నిర్మాత కామెంట్స్
ఇదే ఈవెంట్‌లో నిర్మాత మహదేవ్ గౌడ్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. సఃకుటుంబానాం హెచ్‌ఎన్‌జి బ్యానర్‌పై తొలి చిత్రం. ఈ సినిమా కథ నాకు చాలా నచ్చి కావలసిన నటీనటులను, టెక్నీషియన్స్‌ను అందరిని కష్టపడి ఈ చిత్రంలో పాలుపంచుకునేలా చేశాము. ఈ సినిమాలో అందరూ సపోర్ట్ చేసి మంచి విజయాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాను" అని అన్నారు.