Peddi Mega Blockbuster Event: బాక్సాఫీస్ దగ్గర నాన్‌స్టాప్ వసూళ్ల జాతరతో రూ. 400 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi). థియేటర్లలో ఈ సినిమా సాధించిన చారిత్రాత్మక విజయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి మేకర్స్ పక్కా ప్లాన్ రెడీ చేశారు.

ఈ పెద్ది సినిమా భారీ బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ ఈరోజు (మంగళవారం) హైదరాబాద్ లో మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ పేరుతో ఒక ప్రతిష్టాత్మక సక్సెస్ మీట్ ను నిర్వహించబోతోంది. దీనికి చిరంజీవి చీఫ్ గెస్టుగా రానుండటం విశేషం.
చీఫ్ గెస్టుగా మెగాస్టార్
ఈ గ్రాండ్ సక్సెస్ మీట్ కు సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ మెగా ఫ్యాన్స్ లో అమితమైన ఉత్సాహాన్ని నింపింది. హైదరాబాద్ లోని ప్రముఖ సాంస్కృతిక వేదిక శిల్పకళా వేదికలో ఈరోజు అంటే జూన్ 23 సాయంత్రం 6 గంటల నుండి ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ మెగా సెలబ్రేషన్స్ కు టాలీవుడ్ బాస్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కాబోతుండటం విశేషం. ఒకే స్టేజ్ పై మెగాస్టార్, గ్లోబల్ స్టార్ లు కలవబోతుండటంతో టాలీవుడ్ లో ఈ ఈవెంట్ పై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది.
ఈ వేడుకలో హీరో రామ్ చరణ్ తో పాటు సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా, చిత్ర నిర్మాతలు, ప్రధాన నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొని ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు.
బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పెద్ది
'రంగస్థలం' తర్వాత రామ్ చరణ్ వన్-మ్యాన్ షో పెర్ఫార్మెన్స్ కు బుచ్చిబాబు మార్క్ ఎమోషనల్ టేకింగ్ తోడవడంతో 'పెద్ది' వరల్డ్‌వైడ్ గా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అల్లు అర్జున్ 'పుష్ప', ప్రభాస్ 'సలార్' రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టింది. రీసెంట్ గానే ఈ సినిమాకు దాదాపు 6 నిమిషాల ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేసి ‘రీలోడెడ్ వర్షన్’ను కూడా థియేటర్లలోకి తీసుకురావడంతో కలెక్షన్ల వేగం మరింత పెరిగింది.
{{/usCountry}}'రంగస్థలం' తర్వాత రామ్ చరణ్ వన్-మ్యాన్ షో పెర్ఫార్మెన్స్ కు బుచ్చిబాబు మార్క్ ఎమోషనల్ టేకింగ్ తోడవడంతో 'పెద్ది' వరల్డ్‌వైడ్ గా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అల్లు అర్జున్ 'పుష్ప', ప్రభాస్ 'సలార్' రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టింది. రీసెంట్ గానే ఈ సినిమాకు దాదాపు 6 నిమిషాల ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేసి ‘రీలోడెడ్ వర్షన్’ను కూడా థియేటర్లలోకి తీసుకురావడంతో కలెక్షన్ల వేగం మరింత పెరిగింది.
{{/usCountry}}ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ రగ్గడ్ రెజ్లర్ లుక్, ఆయన నటనకు థియేటర్లలో మాస్ ఆడియన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన మ్యాజికల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచింది.
పెద్ది మూవీ విశేషాలు
వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా.. కన్నడ లెజెండ్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, పవర్‌ఫుల్ విలన్ జగపతి బాబు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో మెప్పించారు. ఈరోజు సాయంత్రం జరగబోయే ఈ మెగా ఈవెంట్ లో రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఎలాంటి అనౌన్స్‌మెంట్ ఇస్తారో అని ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
హెచ్‌టీ విశ్లేషణ
ఒక సినిమా మూడో వారంలోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నప్పుడు ఇలాంటి పెద్ద ఈవెంట్స్ ప్లాన్ చేయడం వల్ల ఆ చిత్రం లాంగ్ రన్ కు మరింత ప్లస్ అవుతుంది. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో స్టేజ్ పైకి వచ్చి బుచ్చిబాబును, చరణ్ ను ప్రశంసిస్తుంటే.. అవి సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అయిపోతాయి. గూగుల్ డిస్కవర్ ఫీడ్ లో ప్రస్తుతం 'పెద్ది సక్సెస్ మీట్' ట్రెండ్స్ నేషనల్ వైడ్ గా టాప్ లో దూసుకుపోతున్నాయి.